Uday Shankar New Movie First Look Poster: వైవిధ్యమైన కథల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సంసాదించుకున్నాడు యంగ్ హీరో ఉదయ్ శంకర్ . ఇప్పుడు ఆయన హీరోగా గురు పపవన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతుంది. కాగా, మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్.
ఈ పోస్టర్‌లో ఉదయ్ శంకర్ యూత్‌ని ఆకట్టుకునేలా చాలా స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. మధునందన్ , హీరోయిన్ జన్నీ ఫర్ లుక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కమర్షియల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మధునందన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ కీలక పాత్రల పోషిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే కథా, కథనాలతో సాగే ఈ మూవీ ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు అందించబోతుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment