త్రివిక్రమ్, ఉదయ్‌శంకర్
‘‘మిస్ మ్యాచ్’ టైటిల్ కొత్తగానూ, ఆసక్తి కలిగించేదిగానూ ఉంది. డైరెక్టర్ నిర్మల్ తీసిన ‘సలీమ్’ సినిమా తమిళ్, తెలుగులో మంచి విజయం సాధించింది. అతను తెలుగులో తొలిసారి తీసిన ‘మిస్ మ్యాచ్’ సినిమా విజయం సాధిస్తుంది’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా ఎన్వీ నిర్మల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలవుతోంది.
ఈ చిత్రంలోని ‘అరెరే అరెరే..’ అంటూ సాగే తొలి పాటని త్రివిక్రమ్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘అరెరే అరెరే..’ మెలోడి సాంగ్ వినాలనిపించేదిగా ఉంది. ‘మిస్ మ్యాచ్’ కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. ఉదయ్ శంకర్‌కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు. ‘‘నా మొదటి సినిమా ‘ఆటగదరా శివ’కు త్రివిక్రమ్‌గారు సపోర్ట్ చేశారు.
ఇప్పుడు ‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని పాటని విడుదల చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. మరో రెండు పాటలను విభిన్నంగా విడుదల చేయబోతున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీరామ్. ‘‘అరెరే అరెరే..’ మెలోడీ, రొమాంటిక్ సాంగ్. శ్రోతలకు త్వరగా నచ్చే పాట ఇది’’ అన్నారు డైరెక్టర్ ఎన్. వి.నిర్మల్. ‘‘సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి’’ అన్నారు సంగీత దర్శకుడు గిఫ్టన్ ఇలియాస్. ఈ చిత్రానికి కెమెరా: గణేష్ చంద్ర.
Comments
Please login to add a commentAdd a comment