
గణేశ్ చంద్ర, ఉదయ్ శంకర్, క్రిష్, నిర్మల్ కుమార్
‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్ నటిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ ఆంటోనీతో ‘డా. సలీమ్’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ఎన్.వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తున్న ‘మిస్ మ్యాచ్’ తొలి ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ– ‘‘నిర్మల్‌గారు నాకు మంచి మిత్రుడు. ఆయన మేకింగ్ ఎలా ఉంటుందో ‘డా. సలీమ్’ సినిమాతోనే అర్థమైంది .
ఆనాటి ‘ముఠామేస్త్రి’ నుంచి ఇప్పటి ‘సైరా నరసింహారెడ్డి’ వరకు భూపతి రాజు రాసిన సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం. సినిమాటోగ్రాఫర్ గణేష్, నిర్మాతలు శ్రీ రామ్, భరత్ రామ్‌గార్లు అందరూ నాకు తెలిసిన వాళ్లే. ఉదయ్ శంకర్ తొలి చిత్రం ‘ఆటగదరా శివ’ మంచి విలువలు ఉన్న సినిమా. ‘మిస్ మ్యాచ్’ సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘అనుకున్నట్టుగానే స్క్రిప్ట్ పరంగా సినిమా బాగా వస్తోంది’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘క్రీడల నేపథ్యంలో రూపొందుతోన్న మంచి కథాబలం ఉన్న చిత్రమిది’’ అన్నారు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్. ‘‘తెలుగులో నా తొలిచిత్రమిది’’ అని నిర్మల్ కుమార్ అన్నారు. సంగీత దర్శకుడు గిఫ్టన్ ఇలియాస్, కెమెరామేన్ గణేష్ చంద్ర మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment