మా ఊరోళ్లు హ్యాపీ..!
మా ఊరోళ్లు హ్యాపీ..!
Published Sun, Mar 2 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
‘‘నా ప్రతి పుట్టినరోజుకి నేను నటించిన ఓ సినిమా విడుదలవుతుంటుంది. ఈసారి ‘భీమవరం బుల్లోడు’ విడుదలైంది. ఈ సినిమా ఆదరణ పొందినందుకు మా ఊరోళ్లు అందరూ ఆనందపడుతున్నారు’’ అన్నారు సునీల్. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ‘భీమవరం బుల్లోడు’ చిత్రం యూనిట్ సభ్యుల సమక్షంలో తన పుట్టినరోజు జరుపుకున్నారు సునీల్. చిత్రనిర్మాత డి. సురేష్‌బాబు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు హీరోగా సునీల్ నటించిన అన్ని చిత్రాల్లోకెల్లా ఎక్కువ ఓపెనింగ్స్ సాధించిందీ సినిమా. సునీల్ హీరోగా చేసిన ఏ సినిమానీ మా అమ్మ చూడలేదు. కానీ, ఈ సినిమా చూసి బాగా చేశాడని మెచ్చుకుంది’’ అన్నారు. ఈ సినిమా మీకు మంచి పుట్టినరోజు కానుక అవుతుందని సునీల్‌తో అన్నానని, అది నిజమైందని చిత్రదర్శకుడు ఉదయశంకర్ చెప్పారు. ఇంకా ఈ వేడుకలో పృథ్వీ, శ్రీధర్ సీపాన, ఎస్తర్ కూడా పాల్గొన్నారు.
Advertisement
Advertisement