bhimavaram bullodu
-
సందడి చేసిన ‘భీమవరం బుల్లోడు’
గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్ :జిల్లాలో ‘భీమవరం బుల్లోడు’ చిత్ర యూనిట్ బుధవారం సందడి చేసింది. గుంటూరు నగరంతో పాటు తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేటల్లో పర్యటించింది. చిత్ర యూనిట్‌కు అభిమానులుఘనస్వాగతం పలికారు. చిత్ర దర్శకులు ఉదయ శంకర్, కథానాయకుడు సునీల్, కథానాయకి ఎస్తేరు సహన నటులు సత్యంరాజు, సుదర్శన్, పృధ్వీలు గుంటూరులోని సరస్వతి థియేటర్‌కు వచ్చారు. సురేష్ ప్రొడక్షన్ జిల్లా మేనేజరు మాదాల రత్తయ్య, ఈవీవీ యువకళావాహిని వ్యవస్థాపకుడు వెచ్చా కృష్ణమూర్తి, థియేటర్ ప్రతినిధులు కె.పాండు, పి.సూరి, వెంకటేశ్వరరావులు వారిని గజమాలతో ఘనంగా సత్కరించారు. సునీల్, ఎస్తేరు అభిమానులకు చేతులు ఊపి పలకరించారు. అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ సందడి చేశారు. అందుకు హీరో సునీల్ ప్రతిస్పందిస్తూ గుంటూరు ఘాటు అదిరింంటూ అభిమానులను మరింత ఉత్సాహపరిచారు. చిత్రంలోని కొన్ని హాస్య డైలాగులను చెప్పారు. ఘనంగా సన్మానం.. అనంతరం చిత్ర యూనిట్ బ్రాడీపేటలోని గ్రాండ్ నాగార్జునకు చేరుకుంది. సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఈవీవీ యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో చిత్ర యూనిట్‌కు ఘనసత్కారం జరిగింది. హీరో సునీల్ మాట్లాడుతూ ప్రతి ఊరులో తమను ఘనంగాస్వాగతించడం, ఆదరించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. చిత్ర కథానాయకి ఎస్తేరు మాట్లాడుతూ సురేష్ మూవీస్ వంటి పెద్ద సంస్థలో నటించడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర దర్శకుడు ఉదయశంకర్ మాట్లాడుతూ సురేష్ మూవీస్ సంస్థలో దర్శకత్వం వహించడం తన అదృష్టమన్నారు. మాదాల రత్తయ్య, వెచ్చా కృష్ణమూర్తి మాట్లాడారు. హీరోహీరోయిన్లను గజమాల, మెమోం టోలు, పట్టుశాలువలతోఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుమ్మడి సీతారామయ్య చౌదరి, పి.సూరి, పత్తి భాస్కర్‌రెడ్డి, మహేష్, ఆర్.టి.కోటేశ్వరరావు, సినీ పంపిణీదారుడు జయరామ్ పాల్గొన్నారు. -
'భీమవరమే హీరోను చేసింది'
భీమవరం : భీమవరంలో చూసిన సినిమాలే తాను హీరో అవ్వడానికి కారణమని హీరో సునీల్ అన్నారు. ‘భీమవరం బుల్లోడు’ చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా మంగళవారం యూనిట్ ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకులో సందడి చేసింది. భీమవరంలో విజయలక్ష్మి థియేటర్లో హీరో సునీల్ మాట్లాడుతూ ‘వర్షంలోని పిడుగు భీమవరం బుల్లోడి అడుగు’ అంటూ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చిత్రం విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ చిత్ర విజయానికి కారణం ప్రేక్షకులే అని అన్నారు. ముందుగా ఓ రెస్టారెంట్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ తనను 20 ఏళ్లపాటు మోసిన భీమవరానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఇక్కడ నిర్వహించిన ఆడియో ఫంక్షన్‌కి వచ్చిన స్పందనే సినిమా విజయానికి కారణమని చెప్పారు. రాబోయే రోజుల్లో ఓ సంస్థను ఏర్పాటుచేసి పట్టణాభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని చెప్పారు. భీమవరం బుల్లోడు చిత్రానికి వచ్చిన ఓపెనింగ్ కలెక్షన్లు గతంలో తన ఏ చిత్రానికి రాలేదని సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. సునీల్ కోరిక మేరకే టైటిల్ హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ భీమవరం పట్టణం అందమైన పేయింటింగ్‌లా ఉందన్నారు. ఆడియో ఫంక్షన్లో భీమవరం అంటే ఏమిటో చూశానని మళ్లీ ఇప్పుడు మరోసారి రుజువైందని చెప్పారు. చిత్రం డెరైక్టర్ ఉదయ శంకర్ మాట్లాడుతూ భీమవరం బుల్లోడు అనే టైటిల్‌ను సునిల్ కోరిక మేరకే పెట్టామన్నారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. నటుడు పృధ్వీరాజ్, రచయిత శ్రీధర్, పి.రామకృష్ణ, సంతోష్‌వర్మ, శ్రీను, మురళీ పాల్గొన్నారు. -
సిక్కోల్లో భీమవరం బుల్లోడు సందడి
శ్రీకాకుళం కల్చరల్ : ‘భీమవరంబుల్లోడు’ సినిమా యూనిట్ సోమవారం శ్రీకాకుళం పట్టణంలోని కిన్నెర హాల్లో సందడి చేసింది. సినీ ప్రేక్షకులను అలరించింది. సినిమాల్లోని కొన్ని డైలాగ్‌లు చెబుతూ, పాటలకు డ్యాన్స్ చేస్తూ హీరో, హీరోరుున్లు సునీల్, ఎస్తేరులు ఉర్రూతులూగించారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలో పాటలు, కథ ఎలా ఉందని అడిగారు. హీరోయిన్ ఎస్తేరు మాట్లాడుతూ మంచి హిట్ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ డెరైక్టర్ అనూప్ రూబెన్స్ పలు గీతాలను ఆలపించారు. వీరితో పాటుగా నటులు సత్యం రాజేష్, పృధ్విరాజ్, థియోటర్ మేనేజర్ వరప్రసాద్‌లు పాల్గొన్నారు. తెలుగు ‘గోవిందా’ కావాలనుంది హిందీ హీరో గోవిందా వలే తెలుగు గోవింద కావాలని ఉందని భీమవరం బుల్లోడు హీరో సినీల్ అన్నారు. స్థానిక కిన్నెర థియేటర్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో విలేకరులతో కాసేపు ముచ్చటించారు. హిందీలో గోవిందా ఇటు కమెడియన్‌గా, అటు హీరోగా చేసిన సక్సెస్ చూసిన తరువాత ఈ కోరిక కలిగిందన్నారు. తడాఖాలాంటి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పక నటిస్తానన్నారు. హీరోగా అయితే డైటింగ్ చేసి స్లిమ్స్గా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. హీరో ఛాన్సుకన్నా కమెడియన్‌గా చేయడం చాలా ఇష్టమన్నారు. ఇక్కడి ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుందన్నారు. కవి దూర్జటి రచించిన ‘భక్త కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. అలాగే, నల్లమల బుజ్జి, మోహన్‌లు నిర్మిస్తున్న మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు వెల్లడించారు. సేవా కార్యక్రమాలు చేయడమంటే చాలా ఇష్టమన్నారు. అందు లో చుదువుకోసం సహాయం చేసేం దుకు ఎప్పుడూ ముందుంటానన్నా రు. రాజకీయాలంటే ఇష్టంలేదన్నా రు. ఈ సినిమాకు మాటల రచయిత అయిన సీపాన సురేష్ మీజిల్లా వాడేనని తెలిపారు. అందుకే విజయోత్సవాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించామన్నారు. హిందీ సినిమాలో అవకాశం వస్తే నటిస్తానని, కానీ తెలుగు సినీ పరిశ్రమను విడిచిపెట్టనన్నారు. శ్రీధర్‌కు సత్కారం భీమవరం బుల్లోడు సినిమా మాటల రచయిత జిల్లాకు చెందిన సీపాన శ్రీధర్‌ను స్నేహితులు శంకర తరఫున హీరో సునీల్ దుశ్శాలువతో, దండతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తన స్వగ్రామం టెక్కలి అన్నారు. తల్లిదండ్రులు రమణమ్మ, సత్యనారాయణ ఆశీస్సులతో సినిమా ఇండస్ట్రీకి వెళ్లానన్నారు. తను బీఈ చదివానని, సినిమా హిట్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. -
మా ఊరోళ్లు హ్యాపీ..!
‘‘నా ప్రతి పుట్టినరోజుకి నేను నటించిన ఓ సినిమా విడుదలవుతుంటుంది. ఈసారి ‘భీమవరం బుల్లోడు’ విడుదలైంది. ఈ సినిమా ఆదరణ పొందినందుకు మా ఊరోళ్లు అందరూ ఆనందపడుతున్నారు’’ అన్నారు సునీల్. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ‘భీమవరం బుల్లోడు’ చిత్రం యూనిట్ సభ్యుల సమక్షంలో తన పుట్టినరోజు జరుపుకున్నారు సునీల్. చిత్రనిర్మాత డి. సురేష్‌బాబు మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు హీరోగా సునీల్ నటించిన అన్ని చిత్రాల్లోకెల్లా ఎక్కువ ఓపెనింగ్స్ సాధించిందీ సినిమా. సునీల్ హీరోగా చేసిన ఏ సినిమానీ మా అమ్మ చూడలేదు. కానీ, ఈ సినిమా చూసి బాగా చేశాడని మెచ్చుకుంది’’ అన్నారు. ఈ సినిమా మీకు మంచి పుట్టినరోజు కానుక అవుతుందని సునీల్‌తో అన్నానని, అది నిజమైందని చిత్రదర్శకుడు ఉదయశంకర్ చెప్పారు. ఇంకా ఈ వేడుకలో పృథ్వీ, శ్రీధర్ సీపాన, ఎస్తర్ కూడా పాల్గొన్నారు. -
భీమవరం బుల్లోడు మూవీ స్టిల్స్
-
రానా వాయిస్ ఓవర్‌తో.
కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రాలను అందించి, ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ‘భీమవరం బుల్లోడు’. హాస్యనటుడిగానే కాదు కథానాయకునిగా కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సునీల్ హీరోగా ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో డి. సురేష్‌బాబు నిర్మించా. ఈ నెల 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ -‘‘పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. భీమవరానికి చెందిన సునీల్ ఈ చిత్రంలో భీమవరం బుల్లోడుగా అద్భుతంగా నటించాడు. మంచి కథ, కథనం, దర్శకుడి టేకింగ్, పాటలు ఈ చిత్రానికి ప్రధాన బలాలు’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఆరంభంలో రానా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ వాయిస్ ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. -
భీమవరం బుల్లోడు రెడీ
భీమవరం నుంచి హైదరాబాద్‌కి వచ్చి ప్రేమలో పడ్డ ఓ కుర్రాడి కథతో రూపొందిన చిత్రం ‘భీమవరం బుల్లోడు’. సునీల్ కథానాయకునిగా ఉదయ్‌భాస్కర్ దర్శకత్వంలో డి.సురేష్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ -‘‘వెంకటేష్, రవితేజ... ఇలా ఎవరైనా ఈ కథకి హీరోగా చేయొచ్చు. అలాంటి కమర్షియల్ వేల్యూస్ ఉన్న కథ. ముందు ఈ సినిమాకు ‘దసరాబుల్లోడు’ అనే టైటిల్ అనుకున్నాం. తర్వాత ‘భీమవరం బుల్లోడు’గా మార్చాం. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఇటీవలే ఓ కొత్త పాటను ఆడియోలో జత చేశాం. సినిమా రీషూట్ చేశామనే కథనాలొచ్చాయి. చిన్న కరెక్షన్లు చేశామంతే’’ అని తెలిపారు. సునీల్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ‘‘ఇందులో నాకు మంచి లవ్‌ట్రాక్ ఉంది. హీరోయిన్ని చూసి లవ్‌లో పడతాను. నేను పది సినిమాల్లో చేసిన కామెడీ ఈ ఒక్క సినిమాలో ఉంటుంది’’ అని సునీల్ చెప్పారు. కథానాయిక ఎస్తర్, రచయిత శ్రీధర్ సీపాన మాట్లాడారు. -
పిబ్రవరిలో భీమవరం బుల్లోడు
-
భీమవరంలో ఈ బుల్లోడి అడుగు పడితే దద్దరిల్లాల్సిందే!
‘‘ఒకప్పుడు ఇదే ప్రాంగణంలో నేను డ్యాన్స్ చేశాను. ‘వర్షం’ సినిమా వేడుక జరిగినప్పుడు ఇక్కడికి వచ్చాను. మళ్లీ ఇదే రావడం. పది సినిమాల్లో చేసే కామెడీని ఈ ఒక్క సినిమాలోనే చేశాను’’ అని సునీల్ చెప్పారు. సునీల్, ఎస్తర్ జంటగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మించిన ‘భీమవరం బుల్లోడు’ పాటల సీడీ ఆవిష్కరణ భీమవరంలో జరిగింది. ఈ సందర్భంగా సునీల్ ఉద్వేగంగా మాట్లాడారు. ‘వర్షంలో పిడుగు, భీమవరంలో ఈ బుల్లోడి అడుగు పడితే దద్దరిల్లాల్సిందే’ అంటూ డైలాగ్ చెప్పి, ఆహూతులను ఉత్సాహపరిచారు. అశోక్‌కుమార్ మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారు ఎవరి సహాయం లేకుండా పైకి వచ్చిన వ్యక్తి. సునీల్ కూడా అంతే. చిరంజీవిగారు ఎలాగైతే డ్యాన్సులు చేస్తారో, సునీల్ కూడా అలాగే చేస్తాడు. సో... తనలో చిరంజీవిగారిని చూసుకోవచ్చు’’ అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో ఈ చిత్రం రూపొందడం విశేషమని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ వేడుకలో మాగంటి బాబు, జయప్రకాష్‌రెడ్డి, అంబికా కృష్ణ, రఘురామరాజు, అనూప్, నాగేశ్వరరావు, చంద్రబోస్, రాజారవీంద్ర, ఎస్తర్ తదితరులు మాట్లాడారు. -
భీమవరం బుల్లోడు ఆడియో సందడి
-
ఆంధ్రా అమెరికా భీమవరం
భీమవరం, న్యూస్‌లైన్ : ‘భీమవరాన్ని ఆంధ్రా అమెరికాగా పిలుస్తుంటాను.. ఎందుకంటే వేర్ఆర్యూ అని అక్కడ పిలుస్తారు.. ఇక్కడ హే... ఎక్కడికి వెళ్తున్నావ్.. అని ఆప్యాయతగా పలకరిస్తారు. అందుకే నేనలా ఉచ్చరిస్తాను’ అని హీరో సునీల్ అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి సునీల్ హీరోగా నటించిన ‘భీమవరం బుల్లోడు’ ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ తాను చిన్నతనంలో డీఎన్నార్ క్రీడా మైదానంలో ఆటలు ఆడుకున్నాని గుర్తుచేశారు. మొదటగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు తరువాత వర్షం సినిమా ఆడియో విడుదల సందర్భంగా ఈ ప్రాంగణంలో భారీగా జనం వచ్చారని.. మరలా ఇప్పుడు అంతటి జనాన్ని చూస్తున్నానని చెప్పారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి డీఎన్నార్ అధ్యాపకులు, స్నేహితులు కారణమని, వారికి రుణపడి ఉంటానన్నారు. సినీ హీరోయిన్ ఎస్తేరు మాట్లాడుతూ భీమవరం రావడం ఇదే మొదటిసారని, ఈ ప్రాంత ప్రజల ఆపాయత్యలను ఎన్నటికీ మరిచిపోలేనని చెప్పారు. సినిమా దర్శకుడు ఉదయ్ శంకర్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నిర్మాత మాగంటి బాబు మాట్లాడారు. పారిశ్రామిక వేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ భీముడిలా ఉండే సునీల్ భీమవరం బుల్లోడుగా మారాడని అన్నారు. ఇంకా మంచి చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు. ముందుగా పలు గ్రూపుల డాన్స్‌లు ఆకట్టుకున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత డి.సురేష్‌బాబు ఆడియో సీడీని విడుదల చేసి మొదటి సీడీని సునీల్‌కి అందజేశారు. సురేష్ సంస్థ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 50 కిలోల కేక్ కట్ చేశారు. సునీల్, ఎస్తేరు స్టెప్పులేసి అభిమానులను ఉర్రూతలూగించారు. నటులు పృధ్వీరాజ్, జయప్రకాశ్ రెడ్డి, శివపార్వతి, పద్మ, గౌతమ్ రాజు, సినీ పాటల రచయిత చంద్రబోస్, అనంత శ్రీరాం, డాన్స్ మాస్టారు భాను, హరీష్, వితిక, రాజారవీంద్ర, కమెడియన్ రఘు, డీటీఎస్ ఆనంద్, గాయకులు అంజనా సౌమ్య, నిర్మాత అశోక్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. అభిమానులతో డీఎన్నార్ కళాశాల మైదానం కిటకిటలాడింది. -
భీమవరం బుల్లోడు ఆడియో ఫంక్షన్లో అపశ్రుతి
భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : భీమవరంలో నిర్వహించిన ‘భీమవరం బుల్లోడు’ ఆడియో ఫంక్షన్లో అపశ్రుతి చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఓ యువకుడు మరణించాడు. స్థానిక డీఎన్నార్ కళాశాల క్రీడామైదానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఆడియో ఫంక్షన్‌కు వెళ్లిన స్థానిక రైతుబజార్ ప్రాంతానికి చెందిన సంగిరెడ్డి సురేష్ (25) ప్రాణాలు కోల్పోయాడు. సంగిరెడ్డి రాంబాబు రెండో కుమారుడైన సురేష్ ఓ సూపర్బజార్లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మి, ఏడాది వయసు కుమార్తె ఉన్నారు. లక్ష్మి ప్రస్తుతం ఏడో నెల గర్భిణి. ఆదివారం మధ్యాహ్నం ఆమె పురుటి కోసం పుట్టింటికి వెళ్ళింది. ఆడియో ఫంక్షన్‌ను చూసేందుకు సురేష్ డీఎన్నార్ కళాశాల క్రీడామైదానంలోకి వెళ్లాడు. వేదిక సమీపంలో జరిగిన తొక్కిసలాటలో అతను స్పృహ కోల్పోయాడు. పోలీసులు అతడిని ఆటోలో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సురేష్ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోలీసులు అతని ఇంటికి తరలించారు. ఆడియో ఫంక్షన్ నిర్వాహకులు, పోలీసుల వైఫల్యం వల్లే తన తమ్ముడు మృతిచెందాడని అతని అన్న మురళి ఆరోపించాడు. వేడుక ఏర్పాట్లను సక్రమంగా చేయకపోవటం, పోలీసుల ఓవర్ యాక్షన్ సురేష్ మృతికి కారణమని అతని బంధువులు పేర్కొన్నారు. ఏర్పాట్లలో లోపమే కారణమా! ఈ వేడుకకు చేసిన ఏర్పాట్లలో లోపమే సురేష్ మృతికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశంలో వేడుక నిర్వహించేందుకు అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు ఇక్కడ చేయలేదని తెలిపారు. ఈ వేడుక చూడటానికి వచ్చిన ప్రేక్షకులను పోలీసులు పదే పదే తోసివేయటంతో ఒకరి మీద ఒకరు పడగా ఈ దుర్ఘటన జరిగింది. బహిరంగ ప్రదేశంలో నిర్వహిస్తున్న భారీ ఫంక్షన్‌కు చేయాల్సిన ఏర్పాట్లు ఇక్కడ కనిపించలేదు. సీనీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నప్పుడు పోలీసులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు లేవు. పాస్‌లు చూపించిన వారిని పోలీసులు లోపలకు వెళ్లనీయకుండా మెయిన్ గేటు వద్ద గంటలతరబడి నిలబెట్టడం వల్ల అక్కడ కూడా తోపులాట జరిగింది. -
భీమవరం బుల్లోడు ఆడియో వేడుకలో అభిమాని మృతి
-
'భీమవరం బుల్లోడు' ఫంక్షన్లో అభిమాని మృతి
భీమవరం(ప.గో): 'భీమవరం బుల్లోడు' ఆడియో ఫంక్షన్లో అపశృతి చోటు చేసుకుంది. భీమవరం బుల్లోడు సినిమా ఆడియో ఫంక్షన్ ను భీమవరంలోని ఓ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో తొక్కిసలాట జరగడంతో సురేష్ అనే అభిమాని మృతి చెందాడు. సునీల్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం ఆడియో ఫంక్షన్ భీమవరంలో ఏర్పాటు చేశారు. సునీల్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను అతని సొంతూరు భీమవరంలో ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్ ను కాలేజీలో ఏర్పాటు చేయడంతో అభిమానులు అశేషంగా పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే కిందపడ్డ సురేష్ అనే అభిమాని అపస్మారక స్థితికి లోనైయ్యాడు. అతన్ని ఆస్పత్రికి చేర్చే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో సినిమా యూనిట్ దిగ్భ్రాంతికి లోనైంది.