భీమవరం బుల్లోడు
గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్ :జిల్లాలో ‘భీమవరం బుల్లోడు’ చిత్ర యూనిట్ బుధవారం సందడి చేసింది. గుంటూరు నగరంతో పాటు తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేటల్లో పర్యటించింది. చిత్ర యూనిట్‌కు అభిమానులుఘనస్వాగతం పలికారు. చిత్ర దర్శకులు ఉదయ శంకర్, కథానాయకుడు సునీల్, కథానాయకి ఎస్తేరు సహన నటులు సత్యంరాజు, సుదర్శన్, పృధ్వీలు గుంటూరులోని సరస్వతి థియేటర్‌కు వచ్చారు. సురేష్ ప్రొడక్షన్ జిల్లా మేనేజరు మాదాల రత్తయ్య, ఈవీవీ యువకళావాహిని వ్యవస్థాపకుడు వెచ్చా కృష్ణమూర్తి, థియేటర్ ప్రతినిధులు కె.పాండు, పి.సూరి, వెంకటేశ్వరరావులు వారిని గజమాలతో ఘనంగా సత్కరించారు. సునీల్, ఎస్తేరు అభిమానులకు చేతులు ఊపి పలకరించారు. అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ సందడి చేశారు. అందుకు హీరో సునీల్ ప్రతిస్పందిస్తూ గుంటూరు ఘాటు అదిరింంటూ అభిమానులను మరింత ఉత్సాహపరిచారు. చిత్రంలోని కొన్ని హాస్య డైలాగులను చెప్పారు.
ఘనంగా సన్మానం.. అనంతరం చిత్ర యూనిట్ బ్రాడీపేటలోని గ్రాండ్ నాగార్జునకు చేరుకుంది. సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఈవీవీ యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో చిత్ర యూనిట్‌కు ఘనసత్కారం జరిగింది. హీరో సునీల్ మాట్లాడుతూ ప్రతి ఊరులో తమను ఘనంగాస్వాగతించడం, ఆదరించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. చిత్ర కథానాయకి ఎస్తేరు మాట్లాడుతూ సురేష్ మూవీస్ వంటి పెద్ద సంస్థలో నటించడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర దర్శకుడు ఉదయశంకర్ మాట్లాడుతూ సురేష్ మూవీస్ సంస్థలో దర్శకత్వం వహించడం తన అదృష్టమన్నారు. మాదాల రత్తయ్య, వెచ్చా కృష్ణమూర్తి మాట్లాడారు. హీరోహీరోయిన్లను గజమాల, మెమోం టోలు, పట్టుశాలువలతోఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుమ్మడి సీతారామయ్య చౌదరి, పి.సూరి, పత్తి భాస్కర్‌రెడ్డి, మహేష్, ఆర్.టి.కోటేశ్వరరావు, సినీ పంపిణీదారుడు జయరామ్ పాల్గొన్నారు.