Chitra unit
-
ఇదా విషయం
నటి తమన్న దరిదాపులకు ఎవరూ రాకుండా చిత్ర యూనిట్ గట్టి భద్రత ఏర్పాటు చేసింది. ఈ భద్రతకు కారణమేంటన్న విషయమై కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. కోలీవుడ్‌లో పైయ్యా, అయన్, వీరం తదితర విజయవంతమైన చిత్రాల్లో తమన్న నటించిం ది. ఈ భామ కొంతకాలం కోలీవుడ్‌కు దూరమైంది. ఈ సమయంలో బాలీవుడ్లో పాగా వేసేందుకు యత్నించింది. అయితే అక్కడ ఈ బ్యూటీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడంతో మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆర్య సరసన వాసువుం శరనణనుం ఒండ్రాగ పడిత్తవరగళ్ అనే చిత్రంలో నటిస్తోంది. రాజేష్.ఎం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్య నిర్మించడం విశేషం. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. షూటింగ్ స్పాట్లో తమన్న దరిదాపుల్లోకి ఎవరినీ చేరనీయకుండా రక్షణ వలయాన్ని దర్శకుడు ఏర్పాటు చేశారట. ముఖ్యంగా మీడియా వాళ్లు తమన్నను కలవకూడదని ఆదేశించారట. కారణం ఏమిటి అని ఆరా తీస్తే మీడియా తమన్న పాత్ర, ప్రేమ విషయాల గురించి ప్రశ్నిస్తే ఆ భామ ఎక్కడ మూడ్ అవుట్ అవుతుందోనని ఇలా భద్రత ఏర్పాటు చేశారట. -
దెయ్యాలు.. డెమోలివ్వవు.. డెరైక్ట్‌గా పైకి పంపేస్తాయ్
రాజమండ్రిసిటీ : దెయ్యాలు డెమోలివ్వవు.. డెరైక్ట్‌గా పైకి పంపేస్తాయ్.. అంటూ ‘గీతాంజలి ’ సినిమా హీరోయిన్ అంజలి సినిమా యూనిట్‌తో స్థానిక స్వామి థియేటర్లో హల్చల్ చేసింది. ‘గీతాంజలి’ విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం రాజమండ్రి చేరుకుంది. చిత్ర సమర్పకుడు, రచయిత కోన వెంకట్ తొలుత షెల్టాన్ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ హిట్,..ఫ్లాప్ తప్ప చిన్నసినిమా, పెద్ద సినిమా అనేది ఉండదన్నారు. తమ చిన్నప్రయత్నానికి పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘గీతాంజలి’ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 కోట్ల వ్యాపారం చేసిందన్నారు. అనంతరం స్వామి థియేటర్‌కు వెళ్లిన యూనిట్‌కు ఘన స్వాగతం లభించింది. హీరోయిన్ అంజలి తనకు వేసిన పూలమాలలు ప్రేక్షకులపైకి విసిరి సినిమా విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన తాను ‘గీతాంజలి’ విజయం పంచుకునేందుకు ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. డెరైక్టర్ రాజ్‌కిరణ్, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, కెమెరామెన్ సాయిశ్రీ రమణ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. కాకినాడలో... కల్చరల్(కాకినాడ) : గీతాంజలి చిత్ర యూనిట్ విజయయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం కాకినాడ మల్టిప్లెక్స్ థియేటర్‌కు విచ్చేసింది. యూనిట్ సభ్యులకు కవిత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ చౌదరి, రాజు స్వాగతం పలికారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు చిత్ర సమర్పకుడు కోన వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. నటి అంజలి, డెరైక్టర్ రాజ్‌కిరణ్ చిత్ర విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నటులు శ్రీనివాస్‌రెడ్డి, రాజేష్, మధు ప్రేక్షకులను అలరింపజేశారు. సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, మల్టిప్లెక్స్ థియేటర్ రెడ్డి పాల్గొన్నారు. -
సందడి చేసిన ‘భీమవరం బుల్లోడు’
గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్ :జిల్లాలో ‘భీమవరం బుల్లోడు’ చిత్ర యూనిట్ బుధవారం సందడి చేసింది. గుంటూరు నగరంతో పాటు తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేటల్లో పర్యటించింది. చిత్ర యూనిట్‌కు అభిమానులుఘనస్వాగతం పలికారు. చిత్ర దర్శకులు ఉదయ శంకర్, కథానాయకుడు సునీల్, కథానాయకి ఎస్తేరు సహన నటులు సత్యంరాజు, సుదర్శన్, పృధ్వీలు గుంటూరులోని సరస్వతి థియేటర్‌కు వచ్చారు. సురేష్ ప్రొడక్షన్ జిల్లా మేనేజరు మాదాల రత్తయ్య, ఈవీవీ యువకళావాహిని వ్యవస్థాపకుడు వెచ్చా కృష్ణమూర్తి, థియేటర్ ప్రతినిధులు కె.పాండు, పి.సూరి, వెంకటేశ్వరరావులు వారిని గజమాలతో ఘనంగా సత్కరించారు. సునీల్, ఎస్తేరు అభిమానులకు చేతులు ఊపి పలకరించారు. అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ సందడి చేశారు. అందుకు హీరో సునీల్ ప్రతిస్పందిస్తూ గుంటూరు ఘాటు అదిరింంటూ అభిమానులను మరింత ఉత్సాహపరిచారు. చిత్రంలోని కొన్ని హాస్య డైలాగులను చెప్పారు. ఘనంగా సన్మానం.. అనంతరం చిత్ర యూనిట్ బ్రాడీపేటలోని గ్రాండ్ నాగార్జునకు చేరుకుంది. సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఈవీవీ యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో చిత్ర యూనిట్‌కు ఘనసత్కారం జరిగింది. హీరో సునీల్ మాట్లాడుతూ ప్రతి ఊరులో తమను ఘనంగాస్వాగతించడం, ఆదరించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. చిత్ర కథానాయకి ఎస్తేరు మాట్లాడుతూ సురేష్ మూవీస్ వంటి పెద్ద సంస్థలో నటించడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర దర్శకుడు ఉదయశంకర్ మాట్లాడుతూ సురేష్ మూవీస్ సంస్థలో దర్శకత్వం వహించడం తన అదృష్టమన్నారు. మాదాల రత్తయ్య, వెచ్చా కృష్ణమూర్తి మాట్లాడారు. హీరోహీరోయిన్లను గజమాల, మెమోం టోలు, పట్టుశాలువలతోఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుమ్మడి సీతారామయ్య చౌదరి, పి.సూరి, పత్తి భాస్కర్‌రెడ్డి, మహేష్, ఆర్.టి.కోటేశ్వరరావు, సినీ పంపిణీదారుడు జయరామ్ పాల్గొన్నారు.