దెయ్యాలు.. డెమోలివ్వవు.. డెరైక్ట్‌గా పైకి పంపేస్తాయ్
రాజమండ్రిసిటీ : దెయ్యాలు డెమోలివ్వవు.. డెరైక్ట్‌గా పైకి పంపేస్తాయ్.. అంటూ ‘గీతాంజలి ’ సినిమా హీరోయిన్ అంజలి సినిమా యూనిట్‌తో స్థానిక స్వామి థియేటర్‌లో హల్‌చల్ చేసింది. ‘గీతాంజలి’ విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం రాజమండ్రి చేరుకుంది. చిత్ర సమర్పకుడు, రచయిత కోన వెంకట్ తొలుత షెల్టాన్ హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ హిట్,..ఫ్లాప్ తప్ప చిన్నసినిమా, పెద్ద సినిమా అనేది ఉండదన్నారు.
తమ చిన్నప్రయత్నానికి పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘గీతాంజలి’ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 కోట్ల వ్యాపారం చేసిందన్నారు. అనంతరం స్వామి థియేటర్‌కు వెళ్లిన యూనిట్‌కు ఘన స్వాగతం లభించింది. హీరోయిన్ అంజలి తనకు వేసిన పూలమాలలు ప్రేక్షకులపైకి విసిరి సినిమా విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన తాను ‘గీతాంజలి’ విజయం పంచుకునేందుకు ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. డెరైక్టర్ రాజ్‌కిరణ్, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, కెమెరామెన్ సాయిశ్రీ రమణ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
కాకినాడలో...
కల్చరల్(కాకినాడ) : గీతాంజలి చిత్ర యూనిట్ విజయయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం కాకినాడ మల్టిప్లెక్స్ థియేటర్‌కు విచ్చేసింది. యూనిట్ సభ్యులకు కవిత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ చౌదరి, రాజు స్వాగతం పలికారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు చిత్ర సమర్పకుడు కోన వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. నటి అంజలి, డెరైక్టర్ రాజ్‌కిరణ్ చిత్ర విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నటులు శ్రీనివాస్‌రెడ్డి, రాజేష్, మధు ప్రేక్షకులను అలరింపజేశారు. సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, మల్టిప్లెక్స్ థియేటర్ రెడ్డి పాల్గొన్నారు.