ఒకప్పుడు అరుదుగా సీక్వెల్స్ తీసేవారు.. ఇప్పుడు సీక్వెల్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. అలా పదేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ గీతాంజలి. దశాబ్దం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది తెరకెక్కించారు. అంజలి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్, సత్య, సునీత్ ప్రధాన పాత్రలు పోషించారు. కోన వెంకట్ కథ అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు.
ఆ దేవుడిని ఒకటే అడిగా
ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలిరోజే మిక్స్‌డ్ టాక్ అందుకుంది. గురువారం నాడు కోన వెంకట్ మీడియా ముందు మాట్లాడుతూ.. 'తిరుపతిలో దేవుడి ముందు నిలబడ్డప్పుడు ఒకటే కోరుకున్నా.. 27 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. బ్లాక్‌బస్టర్లు, ఫ్లాపులు చూశాను. తొలిసారి సక్సెస్ కావాలని భగవంతుడిని వేడుకున్నాను.
సక్సెస్ కావాలి
సక్సెస్ అనేది మనకంటూ కొత్త శక్తినిస్తుంది. కొత్త కథలను, కొత్తవారిని పరిచయం చేసేందుకు బలాన్నిస్తుంది. నేను చూసింది చాలు.. నా ద్వారా పదిమంది పరిచయం కావాలి, ఇండస్ట్రీకి మేలు జరగాలని కోరుకున్నాను. ముఖ్యంగా ఇది అంజలి 50వ సినిమా కావడంతో ఈ చిత్రానికి కనీసం రూ.50 కోట్లు అయినా వచ్చేట్లు చూడమని అడిగాను. తప్పకుండా ఆ నెంబర్స్ వస్తాయని ఆశిస్తున్నాను. త్వరలోనే రూ.50 కోట్ల ఫంక్షన్‌లో కలుద్దాం' అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment