ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా? | Geethanjali Malli Vachindi Movie OTT Release Details | Sakshi
Sakshi News home page

Geethanjali Malli Vachindi OTT: 'గీతాంజలి మళ్లీ వచ్చింది' ఓటీటీ రిలీజ్ ఫిక్సయిందా?

May 5 2024 3:06 PM | Updated on May 5 2024 3:23 PM

Geethanjali Malli Vachindi Movie OTT Release Details

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చంపేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటే భయమేస్తోంది. ఇలాంటి టైంలో థియేటర్‌కి వెళ్లి చూడటం కంటే ఓటీటీలో మూవీస్ చూడటానికే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రస్తుతం 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

హీరోయిన్ అంజలి తెలుగమ్మాయి. అప్పట్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ ఓ మాదిరి సక్సెస్ మాత్రమే అందుకుంది. తన 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చేసింది. ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో జనాలు అంతంత మాత్రంగానే వెళ్లారు.

థియేటర్లలోకి ఏప్రిల్ 11న వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాని ఇప్పుడు నెల తిరిగిసరికల్లా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుందని సమాచారం. హిట్ మూవీ కాదు కాబట్టి పెద్దగా హడావుడి లేకుండా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 2014లో వచ్చిన 'గీతాంజలి' మూవీకి దీన్ని సీక్వెల్‌గా తెరకెక్కించారు. కాకపోతే తొలి భాగంలా హిట్ కొట్టలేకపోయారు.

(ఇదీ చదవండి: స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్‌లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement