'గీతాంజలి మళ్లీ వచ్చింది' ట్రైలర్‌ చూసేయండి | Geethanjali Malli Vachindi Telugu Trailer Out Now | Sakshi
Sakshi News home page

Geethanjali Malli Vachindi Trailer: 'గీతాంజలి మళ్లీ వచ్చింది' ట్రైలర్‌ చూసేయండి

Published Wed, Apr 3 2024 1:51 PM | Last Updated on Wed, Apr 3 2024 2:56 PM

Geethanjali Malli Vachindi Telugu Trailer Out Now - Sakshi

థియేటర్‌లో ప్రేక్షకులను భయపెడుతూనే  కడుపుబ్బా నవ్వించిన చిత్రం 'గీతాంజలి'. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికి వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా  'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా విడుదలకు ఇప్పుడు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్‌ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో టైటిల్‌ పాత్రలో అంజలి పోషిస్తుండగా.. శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంజలికి ఇది 50వ చిత్రం. ఈ చిత్రానికి కోన వెంకట్‌ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం. అంచనాలతో వచ్చిన ప్రేక్షకులు అంతకుమించి ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుందని కోన వెంకట్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement