Success Tour
-
తిరుపతి నుంచే ‘తిమ్మరుసు’ విజయోత్సవ యాత్ర
తిరుపతి కల్చరల్: తిమ్మరుసు చిత్రం విజయవంతం అయిన సందర్భంగా విజయోత్సవయాత్రలో భా గంగా ఆదివారం ఆ చిత్రం యూనిట్ తిరుపతిలో సందడి చేసింది. ఈ చిత్రం ప్రదర్శిస్తున్న పీజీఆర్ సినిమాస్‌కు విచ్చేసిన తిమ్మరుసు చిత్రం హీరో సత్యదేవ్, దర్శకుడు చరణ్ కొప్పిశెట్టి, నిర్మాత మహేష్ కోనేరు, సహనటుడు అకింత్‌కు పీజీఆర్ అధినేత అభిషేక్ పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రేక్షకులతో కలిసి చిత్ర ప్రదర్శనను తిలకించి, ప్రేక్షకుల నడుమ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. కరోనా విపత్కర కష్టాల నేపథ్యంలో విడుదలైన తమ చిత్రాన్ని ఆదరిస్తూ విజయపథంలో నడిపిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. తిరుమల వెంకన్న పాదాల చెంతనున్న తిరుపతి అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి నుంచే తన విజయయాత్ర ప్రారంభించడం మహదానందమని చెప్పారు. ఈ చిత్రం తర్వాత ‘స్కైలాబ్’ చిత్రంలో నటిస్తున్నానని, భవిషత్తులో జనం మెచ్చే మంచి చిత్రాలతో ముందుకు సాగుతాయనని తెలిపారు. దర్శకుడు చరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ చిత్రం యూనిట్ సమష్టి కృషితో ఒక మంచి చిత్రాన్ని అందించామని చెప్పారు. కరోనా రెండోదశ తర్వాత ఎంతో నమ్మకంతో చిత్రా న్ని విడుదల చేశామని, అదే నమ్మకంతో సినిమాకు విజయాన్ని చేకూర్చుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అనంతరం హీరో సత్యదేవ్‌తో సెల్పీ దిగేందుకు అభిమానుల సందడిచేశారు. -
‘తెలుగు ప్రజలు నిజంగానే దేవుళ్ళు’
లాస్ట్ పంచ్ మనదైతే దానికొచ్చే కిక్కే వేరప్పా అన్నట్టు.. ఈ ఏడాది చివర్లో వచ్చి అంచనాలను మించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ‘కె.జి.యఫ్’. ప్రస్తుతం అన్ని భాషల్లో ఈ చిత్రం దుమ్ములేపుతోంది. ఏకంగా బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ ‘జీరో’ సినిమాను బీట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందంటే విషయం ఇట్టే అర్థమవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. కె.జి.యఫ్ సక్సెస్ టూర్లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన హీరో యశ్ మాట్లాడుతూ.. ‘కె.జి.యఫ్ గొప్ప విజయం సాధించింది. నా నిర్మాతల వల్లనే ఇది సాధ్యమైంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా, బిజినెస్ సినిమా అవుతుంది అని ముందుగా నమ్మిన వ్యక్తి విజయ్ కిరగందుర్. తెలుగులోనూ పెద్ద విజయం సాధించాం. ఇక్కడి ప్రజల అభిమానం చూస్తుంటే డాక్టర్ రాజ్ కుమార్ చెప్పిన `అభిమానులే దేవుళ్ళు` అనే మాట గుర్తుకు వస్తోంది. నా తొలి సినిమాకే ఇంత ఘనంగా వెల్కమ్ చెప్పిన తెలుగు ప్రజలు నిజమైన దేవుళ్ళు. 10 ఏళ్ల క్రితం పరిశ్రమకు వచ్చినప్పుడు కూడా నాకు ఇలాంటి వెల్కమ్ చెప్పి ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా నన్ను ప్రేమగా అక్కున చేర్చుకున్నారు. ఈ సినిమాను ముందు నుండి నమ్మి ప్రతీ ఊరిలో ప్రతిఇంటికీ తీసుకెళ్లిన అందరికీ నా ధన్యవాదాలు.ఈ సినిమాను చూసి బూస్టప్ ఇచ్చిన ఎస్. ఎస్. రాజమౌళిగారికి నా ధన్యవాదాలు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీనిధి శెట్టి చాలా లక్కీ. ఒకేసారి అయిదు భాషలలో పరిచయమైంది. తెలుగు హీరోలు చాలా గ్రేట్ వాళ్ళ డాన్సులు, ఫైట్స్ లకు నేను పెద్ద ఫ్యాన్‌ని. తెలుగు హీరోలందరి సినిమాలు చూసి నేను తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాను. వాళ్ళే నా స్ఫూర్తి’ అని అన్నారు. -
వైజాగ్ లో ‘గూఢచారి’ చిత్ర బృందం సందడి
-
వైజాగ్ సెంటిమెంట్
అల్లిపురం(విశాఖ దక్షిణ): వైజాగ్ సెంటిమెంట్ మాకు బాగా లాభించిందని సప్తగిరి ఎల్ఎల్బీ హీరో సప్తగిరి అన్నారు. తన మొదటి సినిమా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సక్సెస్ టూర్ వైజాగ్ నుంచే ప్రారంభించామన్నారు. అదే విధంగా తన రెండో సినిమా సప్తగిరి ఎల్ఎల్బీ విజయోత్సవ యాత్ర కూడా వైజాగ్ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. వైజాగ్ ప్రేక్షకుల ఆశీర్వాదం గొప్పదని, వారి ఆదరణ ఉంటే సక్సెస్ తనంతట అదే వస్తుందన్నారు. సాయి సెల్యులాయిడ్ సినిమాటెక్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్యానర్‌పై , డాక్టర్ రవికిరణ్, డైరెక్టర్ చరణ్ లక్కోజుల నిర్మించిన సప్తగిరి ఎల్ఎల్బీ విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర బృందం గురువారం జ్యోతి థియేటర్‌కు వచ్చింది. ఈ సందర్బంగా చిత్ర హీరో విలేకరులతో మాట్లాడుతూ మోసం తెలియని రైతుల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాదిగా ఈ చిత్రంలో తాను చేసిన పాత్ర సంతృప్తి నిచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని ఆయన కోరారు. చిత్ర హీరోయిన్ కౌశిష్ వర మాట్లాడుతూ తను నటించిన చిత్రం విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ తమ మొదటి చిత్రం మాదిరిగానే రెండో చిత్రం విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ నుంచే విజయోత్సవ టూర్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో ఈ టూర్ ఉంటుందన్నారు. చిత్ర దర్శకుడు చరణ్ లక్కోజుల మాట్లాడుతూ చిత్రంలో సప్తగిరి యాక్షన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. -
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతి
-
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతి
కాకినాడ: సాయిధరమ్ తేజ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్ వద్దకు ఈ చిత్ర బృందం వచ్చింది. చిత్ర బృందంలోని కారు ఓ అభిమాని కాలుపై వెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. అభిమానికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అతని కాలు విరిగినట్టు వైద్యులు తెలిపారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో హీరో సాయిధరమ్ తేజ, డైరక్టర్ హరీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. థియేటర్ యాజమాన్యం ముందుగా ప్రచారం చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
సిక్కోలులో పటాస్ యూనిట్ సందడి
శ్రీకాకుళం క్రైం:మనీనే వాడుతావో-మనుషులనే వాడుతావో...కాళ్లే పట్టుకుంటావో-కాలర్లే పట్టుకుంటావో...పైరవీలే చేస్తావో-పక్కలే వేస్తావో నాకొడక...ఏమ్ చేస్తావో చేసుకో పో అంటూ తన డైలాగ్‌తో కల్యాణ్‌రామ్ ప్రేక్షకుల మధ్య సందడి చేశారు. పటాస్ చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో చిత్రం ప్రదర్శిస్తున్న ఎస్వీసీ థియేటర్‌కు చిత్ర యూనిట్ శనివారం మొదటి ఆట సమయంలో వచ్చి అభిమానులను పలకరించింది. ఈ సందర్భంగా కథానాయకుడు నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ అభిమానులు ఉత్సాహాంతో పెట్టే ఈ గోల వినటానికి తనకు పదేళ్లు పట్టిందన్నారు. అభిమానుల కేరింతలు, వారు పెట్టే కేకలు ఎంతో ఆనందాన్నిస్తున్నాయన్నారు. ఇకపై ఏటా నందమూరి కుటుంబం నుంచి కచ్చితంగా విజయోత్సవ చిత్రం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు పటాస్ తరువాత తమ్ముడుది టెంపర్, తరువాత బాబాయ్‌ది లయిన్ వరుసుగా వస్తున్నాయన్నారు. చిత్రంలో తను చెప్పిన డైలాగ్‌ను అభిమానుల కోరిక మేరకు చెప్పి ఉర్రుతలూగించారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు రుణపడి ఉంటానన్నారు. ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ మాట్లాడుతూ కనిపించేవి మూడు సింహాలైతే...ఇప్పుడు నాలుగో సింహం కల్యాణ్‌రామ్ అంటూ ప్రేక్షకుల్లో కేరింతలు కొట్టించారు. తన పెళ్లి శ్రీకాకుళంలోనే అయ్యిందని, తన కుమారుడు ఆది శ్రీకాకుళంలోనే పుట్టాడని, తాను ఈ ఊరి అల్లుడ్నని చెప్పారు. చాలాసార్లు ఆ కొడుకు ఆదితో వచ్చానని, ఇప్పుడు ఈ కొడుకు కల్యాణ్‌రామ్‌తో వచ్చానని తెలిపారు. అప్పుడు ఎన్టీఆర్‌తో మేజర్ చంద్రకాంత్‌లో నటించానని, తరువాత బాలకృష్ణతో రౌడీఇన్స్పెక్టర్లోను, ఇప్పుడు కల్యాణ్‌రామ్‌తో పటాస్‌లో నటించానంటూ.. నందమూరి ఫ్యామీలితో హెట్రిక్ కొట్టానన్నారు. ఓరే జీకే...మగాడ్ని చూడాలన్నవు కదా...వచ్చాడ్రా నా కొడుకు...అంటూ డైలాగ్ చెప్పి అభిమానుల్లో కేక పుట్టించారు. చిత్ర దర్శకుడు అనీల్ రవిపూడి మాట్లాడుతూ ప్రేక్షకుల ఉత్సాహాం చూస్తుంటే మాకే ఊపు వస్తుందన్నారు. హాస్యనటుడు ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ సినిమా నచ్చిందా...పాటలు నచ్చాయా...యాక్షన్ ఎలా ఉంది అంటూ ప్రేక్షకులతో కేరింతలు కొట్టించారు. కార్యక్రమంలో చిత్ర విలన్ నాని, ఎస్.వి.సి థియేటర్ మేనేజరు శాసనాల బోసుబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.వి.రమణ, టీడీపీ నాయకులు మాదరపు వెంటేష్, శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ విశాఖపట్నం మేనేజర్లు ఎం.శ్రీనివాసరావు, విజయ భాస్కర్‌రెడ్డి ఉన్నారు.ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలపటాస్ చిత్ర విజయోత్సవ యాత్ర సందర్భంగా శ్రీకాకుళం వచ్చిన కల్యాణ్‌రామ్ ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, శ్రీకాకుళం ముఖ ద్వారం వద్ద ఉన్న మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేశారు. -
మావయ్యల పై చూపించిన అభిమానమే నాపై చూపిస్తున్నారు
అమలాపురం టౌన్ :‘మీ రుణం తీర్చుకోలేను, మావయ్యలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌పై మీరు చూపించిన అభిమానమే నాపై చూపిస్తున్న తీరు జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని మెగా హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. ధరమ్‌తేజ్ హీరోగా నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రం యూనిట్ ఆదివారం సాయంత్రం అమలాపురం వచ్చింది. ఆ చిత్రం ప్రదర్శిస్తున్న రమా థియేటర్లో సందడి చేసింది. థియేటర్లో ప్రేక్షకులను, అభిమానులనుదే దశించి సాయిధరమ్‌తేజ్ మాట్లాడారు. ఆయనతోపాటు చిత్ర దర్శకుడు రవికుమార్ చౌదరి, నటుడు గబ్బర్‌సింగ్ శ్రీను కూడా మాట్లాడారు. చిత్ర కథానాయిక రెజీనా సందడి చేశారు. ముందుగా ఈదరపల్లి వంతెన వద్ద ఆ చిత్ర యూనిట్ బస్సుకు చిరంజీవి అభిమానులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఊరేగింపుగా యూనిట్‌ను థియేటర్‌కు తోడ్కొని వచ్చారు. చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు నల్లా చిట్టిబాబు, ఏడిద శ్రీను, నల్లా నాయుడు, యర్రా నాగబాబు, నల్లా పవన్, ఆకుల రాము, పిండి రాజా, జంగా అబ్బాయి వెంకన్న తదితరులు హీరో సాయిధరమ్తేజను గజమాల, పూలకిరీటాలతో ఘనంగా సన్మానించారు. థియేటర్ వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో అభిమానులు అసౌకర్యానికి గురయ్యారు. ప్రేక్షకాదరణ పొందుతుందని తెలుసు : దిల్ రాజు కాకినాడ సిటీ : ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందని ముందే ఊహించినట్టు దిల్ రాజు చెప్పారు. విజయోత్సవ యాత్రలో భాగంగా ఈ చిత్ర యూనిట్ కాకినాడకు వచ్చింది. హీరో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ రెజీనా, చిత్ర సమర్పకులు దిల్‌రాజు, దర్శకుడు రవికుమార్‌చౌదరి, నిర్మాతలు బన్నీవాసు, శ్రీహర్షిత్, సినీనటి హేమ, నటుడు ప్రభాస్‌శ్రీను పద్మప్రియ థియేటర్‌ను సందర్శించారు. ముందుగా థియేటర్ యాజమాన్యం అభిమానులతో కలిసి చిత్రయూనిట్‌కు బాణ సంచా, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. మెగా ఫ్యామిలీ ప్రభావం ఉన్నప్పటికీ హీరో నటన, ప్రతిభ కామన్ ఆడియన్స్‌ను ఎంతో ఆకట్టుకుందని దిల్‌రాజు చెప్పారు. మంచి కథ, కథనాలతో నిర్మిస్తున్న చిత్రాల్లో పిల్లా నువ్వులేని జీవితం ఒక్కటన్నారు. హీరో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ మేనమామల ప్రోత్సాహం తనకు స్ఫూర్తి ఇచ్చిందన్నారు. ప్రేక్షకులు ఆదరించడం చాలా ఆనందంగా ఉందని, కుటుంబ సమేతంగా చిత్రాన్ని చూస్తున్నారని చెప్పారు. పాదగయ సందర్శన పిఠాపురం : ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్ర యూనిట్ బృందం స్థానిక పాదగయ క్షేత్రాన్ని దర్శించుకుంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, చిత్ర హీరో సాయి ధరమ్‌తేజ, నిర్మాతలు బన్నీవాసు, ఆదిశెట్టి తదితరులు శ్రీకుక్కుటేశ్వరస్వామిని, శ్రీపురుహూతికా అమ్మవారిని, శ్రీరాజరాజేశ్వరీదేవిని, దత్తాత్రేయస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. రాజమండ్రిలో హల్చల్ రాజమండ్రి కల్చరల్ : గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్ర బృందం ఆదివారం స్థానిక గీతా అప్సరా థియేటర్లో హల్చల్ చేసింది. హీరో, హీరోయిన్లను చూడడానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హీరో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ రెజీనాలకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. సాయి ధరమ్‌తేజ్ మాట్లాడుతూ మావయ్య (చిరంజీవి)తో కలిసి మదర్‌థెరిస్సా విగ్రహావిష్కరణకు రాజమండ్రి వచ్చానని, తర్వాత ఇప్పుడు వచ్చానన్నారు. గోదావరి అందచందాలంటే మావయ్యకు ఎంతో ఇష్టమని చెప్పారు. హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ చిత్రం విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి అందాలు తనను ఆకట్టుకున్నాయన్నారు. హీరోను గజమాలతో సత్కరించారు. అభిమానసంఘ నాయకులు ఏడిద బాబి, పడాల శ్రీనివాస్, వై.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మెగా ఫ్యామిలిలో పుట్టడమే అదృష్టం
శ్రీకాకుళం కల్చరల్: పిల్లా నువ్వులేని జీవితం చిత్ర యూనిట్ శనివారం శ్రీకాకుళంలో సందడి చేసింది. సినిమా ప్రదర్శిస్తున్న ఎస్వీసీ రామలక్ష్మణ థియేటర్ మ్యాట్నీషో సయయంలో హిరో సాయి ధరమ్ తేజ్, కథానాయిక తదితరులు వచ్చారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశించి హీరో తేజ్, హీరోయిన్ రేజీనా మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అభిమానాన్ని కొనసాగించాలన్నారు. సినీనటి హేమ మాట్లాడుతూ సినిమాకి మంచి హిట్ ఇచ్చినందుకు ధన్యవాదాలన్నారు. తొలుత థియేటర్ యూజమాన్యం చిత్ర యూనిట్‌కు పూలదండలతో, బొకేలతో స్వాగతం పలికారు. చిత్ర నిర్మాతలు బన్నీవాసు, శ్రీహర్ష, ఎస్వీసీ థియేటర్స్ ప్రతినిధి విజయభాస్కర్, హాలు మేనేజర్ బోసుబాబు, ఫ్యాన్సు అసోసియేషన్ సభ్యులు చౌదరి సతీష్, త్వైకాండో శ్రీను, వైశ్యరాజు మోహన్, జీవీ నరసింహం, జామి దిలీప్, గిరి, సత్యనారాయణ ఉన్నారు. శ్రీకాకుళం కల్చరల్:మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలిలో పుట్టడమే తన అదృష్టం.. అవకాశం వస్తే చిరు 150వ చిత్రంలో నటిస్తానని చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ల మేనల్లుడు.. పిల్లా నువ్వులేని జీవితం కథా నాయకుడు సాయిధరమ్ తేజ్ చెప్పారు. చిత్రం విజయోత్సవంలో భాగంగా శనివారం శ్రీకాకుళం వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రశ్న: హీరో అవ్వాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? జవాబు: డిగ్రీ పూర్తయిన తరువాత మాస్టర్ డిగ్రీ చేయాలనుకుంటుండగా నటించాలనే చిన్న ఆలోచన వచ్చింది. డాక్టర్ కావాలనుకున్నా... అది నాకు సెట్ కాలేదు. తర్వాత లాయర్ కావాలనుకున్నా అదీ కరెక్ట్ అనిపించలేదు. ఇలా అనుకుంటుండగానే ఎంబీఏ పూర్తిచేశాను. అప్పుడే నటుడుని కావాలనే ఆలోచన వచ్చింది. ప్రశ్న: చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ ఉండడం వల్ల హీరో అయిపోవడం ఈజీ అనుకుని ఈ ఫీల్డ్‌లోకి వచ్చారా? జవాబు: నేను నటించాలనుకున్నాను కాని హీరో అవుదామనుకోలేదు. నటుడిగా స్థిరపడ్డాక హీరోగా చేద్దామనుకున్నా. ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు మాత్రం హీరోగా అనుకోలేదు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఈజీ అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. అరుుతే మెగా ఫ్యామిలీలో పుట్టడం నా అదృష్టం. ప్రశ్న: నటుడు అవుదామని ముందుగా మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గర చెప్పారు? జవాబు: తొలుత కల్యాణ్ మావయ్యతో చెప్పాను. ఎందుకంటే నాకు చిన్నప్పటినుంచి ఆయనతో చనువు ఎక్కువ. చెప్పగానే అన్నయ్యకు చెప్పావా అన్నారు. లేదంటే.. వెళ్లి అన్నయ్యతో చెప్పు అన్నారు. చిరంజీవి గారికి చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ప్రశ్న: మీ కెరీర్లో పవన్ కల్యాణ్ సాయం ఏమైన ఉంటుందా? జవాబు: ఆయన ఒక గైడ్, ఒక గురువు. ఉపాధ్యాయుడు తన స్టూడెంట్‌ని ఎలాగైతే గైడ్ చేస్తారో అలాగే ఆయన నన్ను గైడ్ చేశారు. అవకాశం వస్తే చిరంజీవి 150వ సినిమాలో నటించాలని ఉంది. ప్రశ్న: విజయ యాత్రకు సిక్కోలు నుంచి శ్రీకారం చుట్టడానికి కారణం? జవాబు: పిల్లా నువ్వులేని జీవితం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా మా చిత్ర యూనిట్ విజయయాత్ర ప్రారంభించాల ని నిర్ణరుుంచారు. వెంటనే నేను శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యుని ఆలయం నుంచి ప్రారంభించాలని మా నిర్మాతలను కోరాను. దానికి అంగీకారం రావడంతో ఇక్కడ నుంచే విజయయూత్ర ప్రారంభించా. ఆదిత్యుని సన్నిధిలో.. పిల్లా నువ్వులేని జీవితం సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యదేవుని ఆలయం చాలా బాగుందన్నారు. అర్చకుడు ఇప్పిలిశంకరశర్మ ఆశీర్వచనం అందజేశారు. కూర్మనాథుని సన్నిధిలో.. గార:శ్రీకూర్మం శ్రీకూర్మనాథుడ్ని సినీ హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. -
దెయ్యాలు.. డెమోలివ్వవు.. డెరైక్ట్‌గా పైకి పంపేస్తాయ్
రాజమండ్రిసిటీ : దెయ్యాలు డెమోలివ్వవు.. డెరైక్ట్‌గా పైకి పంపేస్తాయ్.. అంటూ ‘గీతాంజలి ’ సినిమా హీరోయిన్ అంజలి సినిమా యూనిట్‌తో స్థానిక స్వామి థియేటర్లో హల్చల్ చేసింది. ‘గీతాంజలి’ విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం రాజమండ్రి చేరుకుంది. చిత్ర సమర్పకుడు, రచయిత కోన వెంకట్ తొలుత షెల్టాన్ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ హిట్,..ఫ్లాప్ తప్ప చిన్నసినిమా, పెద్ద సినిమా అనేది ఉండదన్నారు. తమ చిన్నప్రయత్నానికి పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘గీతాంజలి’ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 కోట్ల వ్యాపారం చేసిందన్నారు. అనంతరం స్వామి థియేటర్‌కు వెళ్లిన యూనిట్‌కు ఘన స్వాగతం లభించింది. హీరోయిన్ అంజలి తనకు వేసిన పూలమాలలు ప్రేక్షకులపైకి విసిరి సినిమా విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన తాను ‘గీతాంజలి’ విజయం పంచుకునేందుకు ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. డెరైక్టర్ రాజ్‌కిరణ్, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, కెమెరామెన్ సాయిశ్రీ రమణ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. కాకినాడలో... కల్చరల్(కాకినాడ) : గీతాంజలి చిత్ర యూనిట్ విజయయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం కాకినాడ మల్టిప్లెక్స్ థియేటర్‌కు విచ్చేసింది. యూనిట్ సభ్యులకు కవిత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ చౌదరి, రాజు స్వాగతం పలికారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు చిత్ర సమర్పకుడు కోన వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు. నటి అంజలి, డెరైక్టర్ రాజ్‌కిరణ్ చిత్ర విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నటులు శ్రీనివాస్‌రెడ్డి, రాజేష్, మధు ప్రేక్షకులను అలరింపజేశారు. సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, మల్టిప్లెక్స్ థియేటర్ రెడ్డి పాల్గొన్నారు.