సిక్కోలులో పటాస్ యూనిట్ సందడి | 'Patas' unit success tour in srikakulam | Sakshi
Sakshi News home page

సిక్కోలులో పటాస్ యూనిట్ సందడి

Published Sun, Feb 8 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

సిక్కోలులో పటాస్ యూనిట్ సందడి

సిక్కోలులో పటాస్ యూనిట్ సందడి

 శ్రీకాకుళం క్రైం:మనీనే వాడుతావో-మనుషులనే వాడుతావో...కాళ్లే పట్టుకుంటావో-కాలర్లే పట్టుకుంటావో...పైరవీలే చేస్తావో-పక్కలే వేస్తావో నాకొడక...ఏమ్ చేస్తావో చేసుకో పో అంటూ తన డైలాగ్‌తో కల్యాణ్‌రామ్ ప్రేక్షకుల మధ్య సందడి చేశారు. పటాస్ చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో చిత్రం ప్రదర్శిస్తున్న ఎస్‌వీసీ థియేటర్‌కు చిత్ర యూనిట్ శనివారం మొదటి ఆట సమయంలో వచ్చి అభిమానులను పలకరించింది. ఈ సందర్భంగా కథానాయకుడు నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ అభిమానులు ఉత్సాహాంతో పెట్టే ఈ గోల వినటానికి తనకు పదేళ్లు పట్టిందన్నారు. అభిమానుల కేరింతలు, వారు పెట్టే కేకలు ఎంతో ఆనందాన్నిస్తున్నాయన్నారు. ఇకపై ఏటా నందమూరి కుటుంబం నుంచి కచ్చితంగా విజయోత్సవ చిత్రం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు పటాస్ తరువాత తమ్ముడుది టెంపర్, తరువాత బాబాయ్‌ది లయిన్ వరుసుగా వస్తున్నాయన్నారు.
 
  చిత్రంలో తను చెప్పిన డైలాగ్‌ను అభిమానుల కోరిక మేరకు చెప్పి ఉర్రుతలూగించారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు రుణపడి ఉంటానన్నారు. ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ మాట్లాడుతూ కనిపించేవి మూడు సింహాలైతే...ఇప్పుడు నాలుగో సింహం కల్యాణ్‌రామ్ అంటూ  ప్రేక్షకుల్లో కేరింతలు కొట్టించారు. తన పెళ్లి శ్రీకాకుళంలోనే అయ్యిందని, తన కుమారుడు ఆది శ్రీకాకుళంలోనే పుట్టాడని, తాను ఈ ఊరి అల్లుడ్నని చెప్పారు. చాలాసార్లు ఆ కొడుకు ఆదితో వచ్చానని, ఇప్పుడు ఈ కొడుకు కల్యాణ్‌రామ్‌తో వచ్చానని తెలిపారు. అప్పుడు ఎన్టీఆర్‌తో మేజర్ చంద్రకాంత్‌లో నటించానని, తరువాత బాలకృష్ణతో రౌడీఇన్‌స్పెక్టర్‌లోను, ఇప్పుడు కల్యాణ్‌రామ్‌తో పటాస్‌లో నటించానంటూ.. నందమూరి ఫ్యామీలితో హెట్రిక్ కొట్టానన్నారు. ఓరే జీకే...మగాడ్ని చూడాలన్నవు కదా...వచ్చాడ్రా నా కొడుకు...అంటూ డైలాగ్ చెప్పి అభిమానుల్లో కేక పుట్టించారు.
 
  చిత్ర దర్శకుడు అనీల్ రవిపూడి మాట్లాడుతూ ప్రేక్షకుల ఉత్సాహాం చూస్తుంటే మాకే ఊపు వస్తుందన్నారు. హాస్యనటుడు ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ సినిమా నచ్చిందా...పాటలు నచ్చాయా...యాక్షన్ ఎలా ఉంది అంటూ ప్రేక్షకులతో కేరింతలు కొట్టించారు. కార్యక్రమంలో చిత్ర విలన్ నాని, ఎస్.వి.సి థియేటర్ మేనేజరు శాసనాల బోసుబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.వి.రమణ, టీడీపీ నాయకులు మాదరపు వెంటేష్, శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్‌స్ విశాఖపట్నం మేనేజర్లు ఎం.శ్రీనివాసరావు, విజయ భాస్కర్‌రెడ్డి ఉన్నారు.ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలపటాస్ చిత్ర విజయోత్సవ యాత్ర సందర్భంగా శ్రీకాకుళం వచ్చిన కల్యాణ్‌రామ్ ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, శ్రీకాకుళం ముఖ ద్వారం వద్ద ఉన్న మాజీ ఎంపీ  కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement