భీమవరం బుల్లోడు రెడీ
భీమవరం బుల్లోడు రెడీ
Published Sun, Feb 2 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
భీమవరం నుంచి హైదరాబాద్‌కి వచ్చి ప్రేమలో పడ్డ ఓ కుర్రాడి కథతో రూపొందిన చిత్రం ‘భీమవరం బుల్లోడు’. సునీల్ కథానాయకునిగా ఉదయ్‌భాస్కర్ దర్శకత్వంలో డి.సురేష్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ -‘‘వెంకటేష్, రవితేజ... ఇలా ఎవరైనా ఈ కథకి హీరోగా చేయొచ్చు. అలాంటి కమర్షియల్ వేల్యూస్ ఉన్న కథ.
ముందు ఈ సినిమాకు ‘దసరాబుల్లోడు’ అనే టైటిల్ అనుకున్నాం. తర్వాత ‘భీమవరం బుల్లోడు’గా మార్చాం. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఇటీవలే ఓ కొత్త పాటను ఆడియోలో జత చేశాం. సినిమా రీషూట్ చేశామనే కథనాలొచ్చాయి. చిన్న కరెక్షన్లు చేశామంతే’’ అని తెలిపారు. సునీల్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ‘‘ఇందులో నాకు మంచి లవ్‌ట్రాక్ ఉంది. హీరోయిన్‌ని చూసి లవ్‌లో పడతాను. నేను పది సినిమాల్లో చేసిన కామెడీ ఈ ఒక్క సినిమాలో ఉంటుంది’’ అని సునీల్ చెప్పారు. కథానాయిక ఎస్తర్, రచయిత శ్రీధర్ సీపాన మాట్లాడారు.
Advertisement
Advertisement