రానా వాయిస్ ఓవర్‌తో. | rana voice over to bhimavaram bullodu movie | Sakshi
Sakshi News home page

రానా వాయిస్ ఓవర్‌తో.

Published Sat, Feb 22 2014 11:04 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రానా వాయిస్ ఓవర్‌తో. - Sakshi

రానా వాయిస్ ఓవర్‌తో.

 కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రాలను అందించి, ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ‘భీమవరం బుల్లోడు’. హాస్యనటుడిగానే కాదు కథానాయకునిగా కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సునీల్ హీరోగా ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో డి. సురేష్‌బాబు నిర్మించా. 

 

ఈ నెల 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ -‘‘పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. భీమవరానికి చెందిన సునీల్ ఈ చిత్రంలో భీమవరం బుల్లోడుగా అద్భుతంగా నటించాడు.
 

మంచి కథ, కథనం, దర్శకుడి టేకింగ్, పాటలు ఈ చిత్రానికి ప్రధాన బలాలు’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఆరంభంలో రానా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ వాయిస్ ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement