ఆ సినిమా సునీల్ కూడా చేయనన్నాడట..! | Sunil Rejected Bichagadu | Sakshi
Sakshi News home page

ఆ సినిమా సునీల్ కూడా చేయనన్నాడట..!

Published Sat, Aug 6 2016 11:18 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

ఆ సినిమా సునీల్ కూడా చేయనన్నాడట..! - Sakshi

ఆ సినిమా సునీల్ కూడా చేయనన్నాడట..!

కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోగా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న హీరో సునీల్. స్టార్ కమెడియన్గా కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైంలోనే హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ ఇంత వరకు నిలదొక్కుకోలేకపోయాడు. ముఖ్యంగా తనకు బాగా పట్టున్న కామెడీ జానర్ను కాదని మాస్ ఇమేజ్ కోసం తాపత్రేయపడుతుండటంతో కెరీర్ గాడి తప్పుతుందంటున్నారు విశ్లేషకులు.

అయితే ఈ హీరో ఇటీవల సూపర్ హిట్ టాక్ తెచ్చకున్న ఓ సినిమా ఆఫర్ను కాదన్నాడట. తమిళ్లో ఘనవిజయం సాధించి తరువాత తెలుగు నాట కూడా కలెక్షన్ల సునామీ సృష్టించిన సూపర్ హిట్ సినిమా బిచ్చగాడు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించిన నిర్మాతలు.. రానాతో పాటు సునీల్కు కూడా వినిపించారట.

అయితే తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కథను, ఆ పాత్రలో సునీల్ను చూసి ఆదరిస్తారో.. లేదో..? అన్న ఆలోచనతో సునీల్ రిజెక్ట్ చేశాడు. దీంతో రీమేక్ ఆలోచనలను పక్కన పెట్టేసిన నిర్మాతలు బిచ్చగాడు సినిమాను డబ్ చేసి రిలీజ్ చేశారు. సునీల్ వర్క్ అవుట్ కాదనుకున్న ఆ సినిమానే ఇప్పుడు సంచలనాలను నమోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement