'భీమవరం బుల్లోడు' ఫంక్షన్లో అభిమాని మృతి | stampede at bhimavaram bullodu audio function, youngster died | Sakshi
Sakshi News home page

'భీమవరం బుల్లోడు' ఫంక్షన్లో అభిమాని మృతి

Published Sun, Dec 22 2013 9:16 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

stampede at bhimavaram bullodu audio function, youngster died

భీమవరం(ప.గో): 'భీమవరం బుల్లోడు' ఆడియో ఫంక్షన్లో అపశృతి చోటు చేసుకుంది.  భీమవరం బుల్లోడు  సినిమా ఆడియో ఫంక్షన్ ను భీమవరంలోని  ఓ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో తొక్కిసలాట జరగడంతో  సురేష్ అనే అభిమాని మృతి చెందాడు. సునీల్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం  ఆడియో ఫంక్షన్ భీమవరంలో ఏర్పాటు చేశారు. సునీల్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను అతని సొంతూరు భీమవరంలో ఏర్పాటు చేశారు.

 

ఆ ఫంక్షన్ ను కాలేజీలో ఏర్పాటు చేయడంతో అభిమానులు అశేషంగా పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే కిందపడ్డ సురేష్ అనే అభిమాని అపస్మారక స్థితికి లోనైయ్యాడు. అతన్ని ఆస్పత్రికి చేర్చే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో సినిమా యూనిట్ దిగ్భ్రాంతికి లోనైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement