
ఉదయ్ శంకర్,ఐశ్వర్యా రాజేష్
‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. తమిళంలో విజయ్ ఆంటోని హీరోగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన ఎన్‌వి. నిర్మల్ కుమార్ ‘మిస్ మ్యాచ్’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి. శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ సినిమాని డిసెంబరు 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ కథలో హీరోగా నటించే అవకాశం రావడం నా అదృష్టం. కథ, కథనాలు ప్రేక్షకులను అలరిస్తాయి’’ అన్నారు.
‘‘రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ఇది. హీరోహీరోయిన్లు పోటీ పడి నటించారు’’ అన్నారు కథా రచయిత భూపతి రాజా. ‘‘సరికొత్త కథ, కథనాలతో రూపొందిన ‘మిస్ మ్యాచ్’ సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు నిర్మల్ కుమార్. ‘‘ఒక మంచి కథని మిస్ చేసుకోకూడదని ఈ సినిమా చేశాను. నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు ఐశ్వర్యా రాజేష్. ‘‘ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి’’ అని జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ అన్నారు. సంజయ్‌స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కెమెరా: గణేష్ చంద్ర.
∙ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేశ్
Comments
Please login to add a commentAdd a comment