
‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న తాజా త్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జెన్నీఫర్ హీరోయిన్. డా. సౌజన్య ఆర్. అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది. కాగా నేడు (జూలై 19) ఉదయ్ శంకర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోమవారం ఉదయ్ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ –‘‘చంద్ర సిద్ధార్థ్‌గారి దర్శకత్వంలో వ్చన ‘ఆటగదరా శివ’తో నా జర్నీ స్టార్ట్ అయ్యి బుధవారానికి (జులై 20) నాలుగేళ్లు పూర్తవుతోంది.
దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు గురు పవన్ మంచి కమర్షియల్ ప్రేమ కథను సెలెక్ట్ చేసుకుని ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ‘‘మంచి కథాంశంతో రపొందుతున్న వ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు అట్లూరి నారాయణరావు. ‘‘సెప్టెంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు గురు పవన్. సంగీత దర్శకుడు గిఫ్టన్ ఎలియాస్, సినివటోగ్రాఫర్ సిద్ధం మనోహర్, నటుడు సౌరవ్ మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ ముంద్రు.