New Executive Committee
-
YSRCP: జిల్లా నూతన కార్యవర్గాల నియామకం
సాక్షి, తాడేపల్లి: అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలను నియమిస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నూతన నియామకాలను చేపట్టినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ►అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ►అనకాపల్లి జిల్లా-బొడ్డేట ప్రసాద్ ►అనంతపురం-పైల నరసింహయ్య ►అన్నమయ్య జిల్లా-ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ►బాపట్ల-ఎంపీ మోపిదేవి వెంకటరమణ ►చిత్తూరు-ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ ►కోనసీమ-ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ►తూర్పు గోదావరి- ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ►ఏలూరు-ఎమ్మెల్యే ఆళ్ల నాని ►గుంటూరు-డొక్కా మాణిక్య వరప్రసాద్ ►కాకినాడ-ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ►కృష్ణా-ఎమ్మెల్యే పేర్ని నాని ►కర్నూలు-ఎమ్మెల్యే బీవై. రామయ్య, మేయర్ ►నంద్యాల-ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ►ఎన్టీఆర్ జిల్లా- ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ►పల్నాడు జిల్లా- ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ►పార్వతీపురం మన్యం- శత్రుచర్ల పరీక్షిత్ రాజు ►ప్రకాశం-జంకె వెంకటరెడ్డి ►నెల్లూరు- ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ►సత్యసాయి జిల్లా- ఎమ్మెల్యే ఎం. శంకరనారాయణ ►శ్రీకాకుళం- ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, ►తిరుపతి జిల్లా- నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ►విజయనగరం-మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జడ్పీ చైర్మన్ ►వెస్ట్ గోదావరి- ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ►వైఎస్సార్ జిల్లా : కె.సురేష్ బాబు, మేయర్ -
సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ నూతన కార్యవర్గం
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) తొమ్మిదో వార్షిక సర్వ సభ్య సమావేశం నవంబర్ 27వ తేదీన స్థానిక ఆర్య సమాజ్‌లో జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ఎనిమిదో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2021-2022 ఆర్థిక సంవత్సరపు రాబడి, ఖర్చుల పట్టికను వివరించి, ఆమోదం పొందింది. 2021-2022 ఆర్థిక సంవత్సర ఆడిటర్లు కిరణ్ కుమార్ ఎర్రబోయిన, శివ రెడ్డి అద్దులకు కమిటీ కృతజ్ణతలు తెలిపింది. నూతన అధ్యక్షుడుగా గడప రమేశ్ బాబుతోపాటు, కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు పెద్దపల్లి వినయ్ కుమార్, ముద్రకోల నవీన్ ప్రకటించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించి ఇక్కడి తెలంగాణ వాసులకు సేవ చేసే అవకాశం ఇస్తున్నందుకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. దీనితో పాటు 2022-2023ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా మద్దికుంట్ల రాజు, శేఖర్ రెడ్డి ఓరుగంటి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షులు నీలం మహేందర్ మాట్లాడుతు సొసైటీ చేసిన కార్యక్రమాలను వివరించారు. సొసైటీ సంస్థాగత అధ్యక్షులు బండా మాధవ రెడ్డి విలువైన సలహాలు అందించారు. సొసైటీకి ఇంతకాలం సేవలందించిన నీలం మహేందర్, గర్రెపల్లి శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ చెన్నోజ్వల, గార్లపాటి లక్ష్మారెడ్డి, కొల్లూరి శ్రీధర్, గింజల సురేందర్ రెడ్డి, వినయ్ కుమార్ పెద్దపల్లి తదితరులకు జ్ఞాపిక అందజేశారు. నూతన కార్య వర్గం నూతన కార్య వర్గం, కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు, నల్ల భాస్కర్ గుప్త, గోనె నరేందర్ రెడ్డి, మిర్యాల సునీత రెడ్డి, దుర్గ ప్రసాద్ మంగలి ప్రాంతీయ కార్యదర్శులు, నంగునూరి వెంకట రమణ, బొండుగుల రాము, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజ్జాపూర్, కార్యవర్గ సభ్యులుగా పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, బొడ్ల రోజా రమణి, శివప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, రాధికా రెడ్డి, సదానందం అందె, రవి చైతణ్య మైసా, విజయ మోహన్ వెంగళ ఉన్నారు. -
ఫిక్కీ నూతన కార్యవర్గం
న్యూఢిల్లీ: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన కార్యవర్గం ఎంపికైంది. 2020–21 సంవత్సరానికి ఫిక్కీ ప్రెసిడెంట్‌గా ఉదయ్ శంకర్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ పదవిలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఉదయ్ శంకర్ ది వాల్ట్ డిస్నీ కంపెనీ, స్టార్ అండ్ డిస్నీ ఇండియాలకు ఏపీఏసీ అండ్ చైర్మన్‌గా ఉన్నారు. ఈయనతో పాటు ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా హిందుస్తాన్ యూనీలివర్ (హెచ్‌యూఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్‌గా ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అల్లోస్ ఎండీ సుభ్రకాంత్ పాండా నియమితులయ్యారు. -
ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్: హైదరాబాద్ ప్రెస్క్లబ్కి నూతనంగా ఎన్నికైన పాలకవర్గ ప్రతినిధులు గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లకు ఒకసారి జరిగే హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు ఈ నెల 22 ముగిశాయి. ప్రెస్ క్లబ్ పూర్వపు అధ్యక్షుడు ఆర్ రవికాంత్ రెడ్డి గెలిచిన ప్రెస్ క్లబ్ కమిటీ నూతన అధ్యక్షుడు బి. రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డికి గురువారం పదవీ బాధ్యతలు అప్పగించారు. అనంతర నూతన అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ .. అందరం సమిష్ఠిగా కలిసి మెలసి పనిచేసి హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. క్లబ్‌కి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకువస్తామన్నారు. ప్యామిలీ క్లబ్ వాతావరణం కల్పించేందుకు పాలకవర్గం అంతా కలిసి ప్రయత్నిద్దామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కార్యవర్గ సభ్యులు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. -
మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ నూతన కార్యవర్గం
విజయవాడ (భవానీపురం) : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యుల ఎంపిక గురువారం జరిగింది. విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీరామ్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ ఎంపిక చేపట్టారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యాచరణ, ఉద్యోగుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర సభ్యుల ఎన్నిక కార్యక్రమం ఏకగ్రీవంగా జరిగింది. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో నేత ఎ.విద్యాసాగర్ పాల్గొన్నారు. అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గం అధ్యక్షులుగా ఎన్.కష్ణమోహన్రావు (నరసాపురం), ప్రధాన కార్యదర్శిగా డి.ఈశ్వర్ (విజయవాడ కార్పొరేషన్), మహిళా ఉపాధ్యక్షురాలుగా జి.పావని (సీనియర్ అసిస్టెంట్, గుడివాడ), కోశాధికారిగా ఎస్.వెంకటేష్ (సీనియర్ అసిస్టెంట్, మచిలీపట్నం), ఉపాధ్యక్షులుగా ఎన్.నరసింహులు (హిందూపురం), కె.శివాజీ (పిఠాపురం), ఎం మురళి (ఆర్ఓ, తాడేపల్లి), కార్యదర్శులుగా ఈఎస్ ఎర్ర స్వామి (తాడిపర్తి), కేపీ శేఖర్ ఆదిత్య (తణుకు), ఎంవీఎస్‌ఎస్‌కేవీ ప్రసాద్ (విశాఖపట్నం), జాయింట్ సెక్రటరీలుగా ఎస్.అప్పయ్య (విజయనగరం), టి.నాగేశ్వరరావు (విజయవాడ), వి.నాగేశ్వరరావు (నూజివీడు), ఎం.మాల్యాద్రి (చీరాల)లతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మరో ఏడుగురిని ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నుకున్నారు. -
హైదరాబాద్ కోచ్‌గా అజీమ్
- అర్జున్ యాదవ్‌కు అండర్-23 కోచ్ పదవి - సీనియర్ చీఫ్ సెలక్టర్‌గా జ్యోతిప్రసాద్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కొత్త కార్యవర్గం ఎన్నికైన నాలుగు రోజుల్లోపే తమ ‘ముద్ర’ చూపించింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పదవిలోకి రాగానే కమిటీలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. పాత కార్యవర్గం ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీలను రద్దు చేయడంతో పాటు కొత్తగా కోచ్‌లను కూడా నియమించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో గురువారం హెచ్‌సీఏ కొత్త కార్యవర్గం తొలి సమావేశం జరిగింది. అనంతరం సమావేశం వివరాలను హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ వెల్లడించారు. కార్యదర్శి జాన్ మనోజ్, ఉపాధ్యక్షులు ప్రకాశ్ చంద్ జైన్, సంయుక్త కార్యదర్శి విజయానంద్, కోశాధికారి దేవ్‌రాజ్ కూడా ఇందులో పాల్గొన్నారు. రెండేళ్ల పదవీ కాలం: సెలక్షన్ కమిటీ, కోచ్‌లను రెండేళ్ల పదవీ కాలానికి ఎంపిక చేసినట్లు అర్షద్ అయూబ్ వెల్లడించారు. ఈ సీజన్ షెడ్యూల్ చాలా బిజీగా ఉందని, మధ్యలో కనీసం రెండు వారాల విరామం దొరికితే మొయినుద్దౌలా టోర్నీని నిర్వహిస్తామని, దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఇందులో పాల్గొనేలా చేయడమే తమ ఆలోచన అని అన్నారు. మెదక్‌లో తొలి అకాడమీ: జింఖానా మైదానంలో ఉన్న హెచ్‌సీఏ అకాడమీని కూడా ‘సెంట్రల్ అకాడమీ’గా మరింత అభివృద్ధి చేస్తామని అయూబ్ వివరించారు. దీనికి డెరైక్టర్‌గా ఉండాలని ఆర్.శ్రీధర్‌ను కోరామన్నారు. ఇప్పటికే ఆంధ్ర క్రికెట్‌తో ఒప్పందం చేసుకున్న శ్రీధర్, దానిని రద్దు చేసుకుంటే ఇక్కడ పని చేస్తారని తెలిపారు. జిల్లాల్లో సౌకర్యాల కల్పన హామీకి కట్టుబడి ఉన్నామన్న హెచ్‌సీఏ అధ్యక్షుడు... ముందుగా మెదక్‌లో తొలి అకాడమీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీసీఐని డబ్బులు అడిగాం: మరో వైపు హెచ్‌సీఏ ఖాతాలో ప్రస్తుతం రూ. కోటి లోపు మొత్తం మాత్రం ఉందని, ఇది భవిష్యత్తు కార్యకలాపాలకు ఏ మాత్రం సరిపోదని అయూబ్ అన్నారు. అయితే చాంపియన్స్ లీగ్ నిర్వహణ కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ.30 లక్షలు ఇవ్వాల్సిందిగా బీసీసీఐని కోరామన్నారు. హైదరాబాద్ సీనియర్ సెలక్షన్ కమిటీ జ్యోతి ప్రసాద్ (చైర్మన్), ఆర్ఏ స్వరూప్, ఎహ్తెషామ్, అరుణ్ పాల్ జూనియర్ సెలక్షన్ కమిటీ జ్యోతి శెట్టి (చైర్మన్), ఇమ్రాన్ మహమూద్, నాగరాజు, ఇఫ్తెఖారుద్దీన్ సబ్ జూనియర్ సెలక్షన్ కమిటీ అల్లాడి రాజు (చైర్మన్), వినోద్ మఖీజా, సాయిలక్ష్మణ్, ఎంఏ జావీద్. హైదరాబాద్ కోచ్‌లు రంజీ ట్రోఫీ కోచ్: అబ్దుల్ అజీమ్, అసిస్టెంట్ కోచ్: నోయల్ డేవిడ్, ఫీల్డింగ్ కోచ్: గణేశ్ అండర్-23 కోచ్: అర్జున్ యాదవ్, ఫీల్డింగ్ కోచ్: మొహమ్మద్ గౌస్ అండర్-19 కోచ్: కిరణ్ కుమార్, ఫీల్డింగ్ కోచ్: దయానంద్ అండర్-16 కోచ్: అనిరుధ్ సింగ్, ఫీల్డింగ్ కోచ్: అనిల్ మిట్టల్ అండర్-14 కోచ్: రియాజ్ ఖురేషీ, ఫీల్డింగ్ కోచ్: రాజేశ్వర్. కన్సల్టెంట్ ‘తరహా’ పాత్రలో లక్ష్మణ్ మరో వైపు హెచ్‌సీఏ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా మాజీ టెస్టు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా హాజరు కావడం విశేషం. హైదరాబాద్ క్రికెట్ మెరుగుదల గురించి లక్ష్మణ్ తగిన సూచనలిచ్చారని, భవిష్యత్తులో క్రికెట్ వ్యవహారాల్లో భాగస్వామి అయ్యేందుకు ఆసక్తి చూపించారని అయూబ్ వెల్లడించారు. అయితే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలకు వీవీఎస్ దూరంగా ఉంటారని, ఆయనకు అధికారిక హోదా ఏమీ ఇవ్వకున్నా కన్సల్టెంట్ తరహా పాత్ర పోషిస్తారని చెప్పారు.