ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్: హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కి నూతనంగా ఎన్నికైన పాలకవర్గ ప్రతినిధులు గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లకు ఒకసారి జరిగే హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు ఈ నెల 22 ముగిశాయి. ప్రెస్ క్లబ్ పూర్వపు అధ్యక్షుడు ఆర్ రవికాంత్ రెడ్డి గెలిచిన ప్రెస్ క్లబ్ కమిటీ నూతన అధ్యక్షుడు బి. రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డికి గురువారం పదవీ బాధ్యతలు అప్పగించారు. అనంతర నూతన అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ .. అందరం సమిష్ఠిగా కలిసి మెలసి పనిచేసి హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. క్లబ్‌కి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకువస్తామన్నారు. ప్యామిలీ క్లబ్ వాతావరణం కల్పించేందుకు పాలకవర్గం అంతా కలిసి ప్రయత్నిద్దామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కార్యవర్గ సభ్యులు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.