PRESSCLUB
-
గో హత్యలు అరికట్టే వరకు పోరాటం ఆగదు
ఖైరతాబాద్: గో రక్షకులు, గో సైనికులపై పోలీసుల దాడులను ఖండిస్తూ, వారి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 26న ఇందిరాపార్క్ వద్ద ‘గో రక్షా’ పేరుతో ధర్నా నిర్వహిస్తున్నట్లు యుగతులసి చైర్మన్ కె.శివకుమార్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు గో రక్షకులపై రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 125 కేసులు నమోదు చేశారన్నారు. ఆరు నెలల వ్యవధిలో 3500 గోవులను అక్రమంగా తరలిస్తున్న వారి నుంచి రక్షించి గో శాలల్లో చేర్చడం జరిగిందన్నారు. గో రక్షణలో చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. గో రక్షకులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ నెల 26న ఉదయం 10గంటలకు ఇందిరాపార్క్ వద్ద గో రక్షా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. గో రక్షణ కోసం హింధువులు, గో బంధువులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో గో రక్షా దళ్ వ్యవస్థాపకులు కోటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న శివకుమార్ తదితరులు -
ప్రెస్‌క్లబ్ ఏర్పాటుకు డిప్యూటీ సీఎం గ్రీన్ సిగ్నల్
– జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ హామీ – ప్రెస్‌క్లబ్ భవనానికి జెడ్పీ చైర్మన్ 3 లక్షల విరాళం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): – జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ హామీ – ప్రెస్‌క్లబ్ భవనానికి జెడ్పీ చైర్మన్ 3 లక్షల విరాళం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): దశాబ్దాలుగా వర్కింగ్ జర్నలిస్టులు ఎదురు చూస్తున్న ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న ఆధ్వర్యంలోని బృందం డిప్యూటీ సీఎం నివాసంలో అయన్ను కలసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి విన్నవించగా తక్షణమే సీక్యాంపులోని ప్రభుత్వ క్వార్టర్లో గదిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆయన చాంబర్లో కలసి సమస్యలపై విన్నవించగా ప్రెస్‌క్లబ్‌కు భవనాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే జగన్నాథగట్టు స్థలాలు లేవుట్, అప్రూవల్, స్థలాలులేని వారికి కొత్త స్థలాలు, డెస్కు జర్నలిస్టులకు అక్రిడియేషన్ తదితర సమస్యల పరిష్కారానికి జేసీ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఏపీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌కు మూడు లక్షల విరాళం: మరోవైపు ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి మూడు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తానని జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ హామీ ఇచ్చారు. అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజు, కోశాధికారి ఉస్సేన్, ఉపాధ్యక్షుడు కిషోర్, సీనియర్ పాత్రికేయులు రాఘవేంద్రారెడ్డి, నాగభూషణం, సుబ్బయ్య, వీడియో జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్నేహాల్, మౌలాలి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గురువారం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న ఆధ్వర్యంలోని బృందం డిప్యూటీ సీఎం నివాసంలో అయన్ను కలసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి విన్నవించగా తక్షణమే సీక్యాంపులోని ప్రభుత్వ క్వార్టర్లో గదిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆయన చాంబర్లో కలసి సమస్యలపై విన్నవించగా ప్రెస్‌క్లబ్‌కు భవనాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే జగన్నాథగట్టు స్థలాలు లేవుట్, అప్రూవల్, స్థలాలులేని వారికి కొత్త స్థలాలు, డెస్కు జర్నలిస్టులకు అక్రిడియేషన్ తదితర సమస్యల పరిష్కారానికి జేసీ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఏపీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌కు మూడు లక్షల విరాళం: మరోవైపు ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి మూడు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తానని జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ హామీ ఇచ్చారు. అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజు, కోశాధికారి ఉస్సేన్, ఉపాధ్యక్షుడు కిషోర్, సీనియర్ పాత్రికేయులు రాఘవేంద్రారెడ్డి, నాగభూషణం, సుబ్బయ్య, వీడియో జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్నేహాల్, మౌలాలి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నవంబర్ 12న శ్రామిక మహిళా ఫోరం మహాసభ
విజయవాడ (గాంధీనగర్) : సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో ఏపీ శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర ప్రథమ మహాసభ నవంబర్ 12న జరుగుతుందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ పి.సూర్యావతి తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ మహాసభను ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్కౌర్ ప్రారంభిస్తారన్నారు. ముఖ్యఅతిథిగా పద్మావతి మహిళా యూనివర్సిటీ తెలుగు శాఖాధికారిణి కొలకలూరి మధుజ్యోతి హాజరవుతారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 500 మంది శ్రామిక మహిళలు ప్రతినిధులుగా పాల్గొంటారని వివరించారు. నూతన రాష్ట్రంలో శ్రామిక మహిళల సమస్యలు, హక్కులపై చర్చించి మహిళాభ్యున్నతికి, సాధికారత సాధన దిశగా భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. పని ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి కఠిన చర్యలు చేపట్టాలి, సమాన పనికి సమాన వేతనం, రాత్రి సమయాల్లో మహిళలు పనిచేయకుండా నిషేధించాలి.. వంటి తొమ్మిది డిమాండ్లను మహాసభ ప్రభుత్వం ముందుంచుతుందని పేర్కొన్నారు. డిమాండ్ల సాధనకు ప్రతి మహిళ మహాసభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శ్రామిక మహిళా ఫోరం కో–కన్వీనర్ ఆర్.లక్ష్మీదేవి, టీవీ భవానీ, కె.శైలజ, డాక్టర్ సుజాత పాల్గొన్నారు. -
ఆ పార్టీల బాటలోనే టీఆర్ఎస్
హిమాయత్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ హామీలను విస్మరించి గత పార్టీలకు అనుగుణంగా పని చేస్తోందని జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు. ప్రతి ఇంటికీSఓ ఉద్యోగం, డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు, ప్రతి ఇంటికి నల్లా, దళితులకు, ఆదివాసీలకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ ‘420’ పార్టీగా పేరుగాంచిందని వ్యాఖ్యానించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో న్యాయవాది గొర్రె రమేష్ అధ్యక్షులుగా నూతనంగా ప్రారంభించిన ‘తెలంగాణ లేబర్ పార్టీ’ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ నీళ్లు అందిస్తామని చెప్పి డ్రైనేజీ, వర్షపు నీటిని అందించారని వ్యాఖ్యానించారు. ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని కొన్ని రాజకీయ పార్టీలు భ్రష్టు పట్టించాయని...వాటికి ప్రత్యామ్నాయంగా ప్రజలు టీఆర్ఎస్ను ఎన్నుకుంటే...అది ప్రజలను మోసగిస్తోందన్నారు. ప్రతి ఇంటికో ఉద్యోగం అంటే యువత ఎంతో ఆనందించారని... అధికారం వచ్చాక వారి ఇంట్లోనే నలుగురూ ఉద్యోగాలు పొంది... ఇంటికో ఉద్యోగం అనే హామీని నెరవేర్చారని ఎద్దేవా చేశారు. అధికారం ఉన్నందునే ఇతర పార్టీల నాయకులు ఆ పార్టీలోకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ లేబర్ పార్టీ’ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ పార్టీ ఆవిర్భవించిందన్నారు. బలహీన వర్గాలకు అధికారం వచ్చే వరకు పోరాడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నాగుల శ్రీనివాస్ యాదవ్, సంపత్‌కుమార్, మురళీధర్, ముత్తయ్య పాల్గొన్నారు. -
ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్: హైదరాబాద్ ప్రెస్క్లబ్కి నూతనంగా ఎన్నికైన పాలకవర్గ ప్రతినిధులు గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లకు ఒకసారి జరిగే హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు ఈ నెల 22 ముగిశాయి. ప్రెస్ క్లబ్ పూర్వపు అధ్యక్షుడు ఆర్ రవికాంత్ రెడ్డి గెలిచిన ప్రెస్ క్లబ్ కమిటీ నూతన అధ్యక్షుడు బి. రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డికి గురువారం పదవీ బాధ్యతలు అప్పగించారు. అనంతర నూతన అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ .. అందరం సమిష్ఠిగా కలిసి మెలసి పనిచేసి హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. క్లబ్‌కి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకువస్తామన్నారు. ప్యామిలీ క్లబ్ వాతావరణం కల్పించేందుకు పాలకవర్గం అంతా కలిసి ప్రయత్నిద్దామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కార్యవర్గ సభ్యులు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. -
అక్కడ రాజీ... ఇక్కడ ఉద్యమ డ్రామా
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: ఢిల్లీలో సోనియాగాంధీతో రాజీపడి, ఇక్కడ సమైక్యాంధ్ర ఉద్యమమంటూ ప్రజలకు నామాలు పెట్టేందుకే మంత్రి గల్లా అరుణకుమారి సరికొత్త రాజీనామా నాటకానికి తెరతీశారని వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం తొమ్మిదేళ్లుగా నలుగుతుంటే ఏ మాత్రమూ స్పందించని ఆమె ఇప్పుడు ర్యాలీలు, ఉద్యమాలు నిర్వహిస్తే నమ్మడానికి జిల్లా ప్రజలు అమాయకులు కారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో పదవులు అనుభవిస్తూ తాను కూడా సమైక్యం కోసం రాజీ నామా చేశానని మంత్రి చెప్పడం ఉద్యమకారులను, జిల్లా ప్రజల మనోభావాలను అపహాస్యం చేయడమేనన్నారు. సమైక్యవాదంపై, ప్రజాస్వామ్య విలువలపై చిత్తశుద్ధి ఉంటే ఆమె తన పదవులకు రాజీనామాచేసి తర్వాత ఉద్యమాలు నడపాలని సూచించారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో నిజంగా ప్రజల భాగస్వామ్యం ఉందా? వాళ్ల ఫ్యాక్టరీ కార్మికుల భాగస్వామ్యం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. సమైక్య ఉద్యమంలో తన సొంత నియోజకవర్గంలోనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతిచెందితే ఇంతవరకు వాళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించని మంత్రి సమైక్య ర్యాలీ చేయడం హాస్యాస్పదం అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి విధానాలు, తీరును యావగించుకున్న ప్రజలు పల్లెల్లోకి రానీయకుండా తిరగబడతారనే ఉద్దేశంతో ఉద్యమాలతో ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలపై మమకారం ఉంటే ఢిల్లీలో సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేపట్టాలని కోరారు.