ప్రెస్‌క్లబ్ ఏర్పాటుకు డిప్యూటీ సీఎం గ్రీన్ సిగ్నల్
ప్రెస్‌క్లబ్ ఏర్పాటుకు డిప్యూటీ సీఎం గ్రీన్ సిగ్నల్
Published Fri, Nov 11 2016 1:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
– జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ హామీ
– ప్రెస్‌క్లబ్ భవనానికి జెడ్పీ చైర్మన్ 3 లక్షల విరాళం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
– జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ హామీ
– ప్రెస్‌క్లబ్ భవనానికి జెడ్పీ చైర్మన్ 3 లక్షల విరాళం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
దశాబ్దాలుగా వర్కింగ్ జర్నలిస్టులు ఎదురు చూస్తున్న ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న ఆధ్వర్యంలోని బృందం డిప్యూటీ సీఎం నివాసంలో అయన్ను కలసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి విన్నవించగా తక్షణమే సీక్యాంపులోని ప్రభుత్వ క్వార్టర్‌లో గదిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆయన చాంబర్‌లో కలసి సమస్యలపై విన్నవించగా ప్రెస్‌క్లబ్‌కు భవనాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే జగన్నాథగట్టు స్థలాలు లేవుట్, అప్రూవల్, స్థలాలులేని వారికి కొత్త స్థలాలు, డెస్కు జర్నలిస్టులకు అక్రిడియేషన్ తదితర సమస్యల పరిష్కారానికి జేసీ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఏపీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు.
ప్రెస్‌క్లబ్‌కు మూడు లక్షల విరాళం:
మరోవైపు ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి మూడు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తానని జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ హామీ ఇచ్చారు. అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజు, కోశాధికారి ఉస్సేన్, ఉపాధ్యక్షుడు కిషోర్, సీనియర్ పాత్రికేయులు రాఘవేంద్రారెడ్డి, నాగభూషణం, సుబ్బయ్య, వీడియో జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్నేహాల్, మౌలాలి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గురువారం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న ఆధ్వర్యంలోని బృందం డిప్యూటీ సీఎం నివాసంలో అయన్ను కలసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి విన్నవించగా తక్షణమే సీక్యాంపులోని ప్రభుత్వ క్వార్టర్‌లో గదిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆయన చాంబర్‌లో కలసి సమస్యలపై విన్నవించగా ప్రెస్‌క్లబ్‌కు భవనాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే జగన్నాథగట్టు స్థలాలు లేవుట్, అప్రూవల్, స్థలాలులేని వారికి కొత్త స్థలాలు, డెస్కు జర్నలిస్టులకు అక్రిడియేషన్ తదితర సమస్యల పరిష్కారానికి జేసీ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు ఏపీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు.

Advertisement