ఖైరతాబాద్: గో రక్షకులు, గో సైనికులపై పోలీసుల దాడులను ఖండిస్తూ, వారి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 26న ఇందిరాపార్క్ వద్ద ‘గో రక్షా’ పేరుతో ధర్నా నిర్వహిస్తున్నట్లు యుగతులసి చైర్మన్ కె.శివకుమార్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు గో రక్షకులపై రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్‌ల పరిధిలో 125 కేసులు నమోదు చేశారన్నారు. ఆరు నెలల వ్యవధిలో 3500 గోవులను అక్రమంగా తరలిస్తున్న వారి నుంచి రక్షించి గో శాలల్లో చేర్చడం జరిగిందన్నారు. గో రక్షణలో చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. గో రక్షకులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ నెల 26న ఉదయం 10గంటలకు ఇందిరాపార్క్ వద్ద గో రక్షా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. గో రక్షణ కోసం హింధువులు, గో బంధువులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో గో రక్షా దళ్ వ్యవస్థాపకులు కోటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న శివకుమార్ తదితరులు
Comments
Please login to add a commentAdd a comment