cow attack
-
బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం ఇది.. తన ప్రాణాలను లెక్కచేయకుండా..
బిడ్డలపై కన్నతల్లికి ఎంత ప్రేమ ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనబిడ్డకు ఎలాంటి ఆపద వచ్చినా తల్లితల్లడిల్లిపోతుంది. బిడ్డకు అపాయం ఉందని తెలిస్తే తన ప్రాణాలను సైతం లెక్కచేయదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి గుజరాత్లో చోటుచేసుకుంది. తన బిడ్డపై దాడి చేస్తున్న ఆవు దాడి నుంచి కుమారుడిని కాపాడింది ఓ తల్లి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని మోర్బీ ప్రాంతంలో ఉన్న లక్ష్మినారాయణ సొసైటీ పరిధిలో ఓ తల్లి తన కొడుకుతో కలిసి నడుచుకుంటూ రోడ్డుపై వస్తోంది. ఇంతలో అక్కడే ఉన్న ఓ ఆవు.. వారి మీద దాడి చేసేందుకు అటుగా వచ్చింది. అది గమనించిన తల్లి.. వెంటనే తన బిడ్డను పక్కకు లాగేసింది. అయినా.. ఆవు మాత్రం వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. దీంతో, ఆమె.. ఆవు దాడిని ప్రతిఘటించింది. ఇంతలో అక్కడున్నవారు వచ్చి ఆవును తరిమేశారు. ఇక, ఈ దాడి ఘటనలో వారిద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన బిడ్డను కాపాడుకున్న తల్లిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ధైర్యానికి ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. મોરબી:- ગાયે માતા અને બાળકને ચગદી નાખવાનો પ્રયાસ કર્યો, લોકો એકઠા થઈ જતાં માંડ માંડ જીવ બચ્યો#Morbi #Cow #StrayCattle #Animal #AnimalAttack #CowAttack #MorbiNews #Gujarat #ConnectGujarat #BeyondJustNews pic.twitter.com/N69YlldXnt — ConnectGujarat (@ConnectGujarat) October 22, 2022 -
గో హత్యలు అరికట్టే వరకు పోరాటం ఆగదు
ఖైరతాబాద్: గో రక్షకులు, గో సైనికులపై పోలీసుల దాడులను ఖండిస్తూ, వారి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 26న ఇందిరాపార్క్ వద్ద ‘గో రక్షా’ పేరుతో ధర్నా నిర్వహిస్తున్నట్లు యుగతులసి చైర్మన్ కె.శివకుమార్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు గో రక్షకులపై రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 125 కేసులు నమోదు చేశారన్నారు. ఆరు నెలల వ్యవధిలో 3500 గోవులను అక్రమంగా తరలిస్తున్న వారి నుంచి రక్షించి గో శాలల్లో చేర్చడం జరిగిందన్నారు. గో రక్షణలో చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. గో రక్షకులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ నెల 26న ఉదయం 10గంటలకు ఇందిరాపార్క్ వద్ద గో రక్షా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. గో రక్షణ కోసం హింధువులు, గో బంధువులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో గో రక్షా దళ్ వ్యవస్థాపకులు కోటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న శివకుమార్ తదితరులు -
మనలో కరువైంది ఇదే.. ఆవును చూసి నేర్చుకోవాల్సిందే!
కొందరు వ్యక్తులు మూగజీవాలపట్ల కఠినంగా ప్రవర్తిస్తుంటారు. జంతువులను రాళ్లతో, కర్రలతో కొడుతూ.. పైశాచికానందాన్ని పొందుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచుగా మన చుట్టు జరుగుతుంటాయి. చాలా వరకు.. మూగజీవాలపై ఎవరైన దాడిచేస్తుంటే..పక్కనున్నవారు వద్దని వారిస్తుంటారు. అయితే, ఒక్కొసారి ఇలాంటి దుర్మార్గులకు కాలం, కర్మ తగిన గుణపాఠం చెబుతాయి. తాజాగా, ఇలాంటి ఆసక్తికర వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక వ్యక్తి.. వీధిలో ఉన్న శునకాన్ని పట్టుకుని పైకి లాగి అమానుషంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత దాని రెండు చెవులు పట్టుకుని గట్టిగా లాగుతున్నాడు. పాపం.. ఆ బాధకు తాళలేక కుక్క గట్టిగా విలవిల్లాడిపోయింది. శునకం.. బాధతో అరుస్తుంటే.. ఆ దుర్మార్గుడు మాత్రం పైశాచికానందాన్ని పొందుతున్నాడు. ఏ ఒక్కరు కూడా... అతగాడి చర్యలను ఆపటానికి ప్రయత్నం చేయడంలేదు. శునకం అరుపులు విన్న ఒక ఆవు అటుగా వచ్చింది. వెంటనే కుక్కను పట్టుకుని హింసిస్తున్న వ్యక్తిపై కొమ్ములతో దాడికి తెగబడింది. అతడిని.. తన రెండు కొమ్ములతో లేపి కిందపడేసి కుమ్మింది. ఆ శునకాన్ని దుర్మార్గుడి బారి నుంచి తప్పించింది. ఈ ఘటనతో అక్కడివారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. దీన్ని అటవీశాఖాధికారి సుషాంత్ నందా.. ‘కర్మ ఫలం’ అనుభవించాల్సిందే.. అంటూ తన ట్విటర్ ఖాతాలో కామెంట్‌ను జతచేసి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు..‘పాపం.. శునకం.. ఎంత బాధతో అరుస్తుంది.. ’, ‘ నీకు చేతులేల వచ్చాయి.. ’,‘మనుషుల కన్నా.. నోరులేని జీవులే నయం..’,‘ కర్మఫలం.. అనుభవించాల్సిందే..’, ‘ఒక నోరులేని జీవి బాధ.. మరో మూగ జీవికే అర్థం అవుతోంది’ అంటూ ఆవుపై ప్రశంసలు కురిపిస్తూ... కామెంట్లు పెడుతున్నారు. Karma 🙏🙏 pic.twitter.com/AzduZTqXH6 — Susanta Nanda IFS (@susantananda3) October 31, 2021 -
కార్లను కుమ్మేసి.. మనుషులను పొడిచేసి..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఓ ఆవు విధ్వంసం సృష్టించింది. రోడ్లపై కనబడిన వారినల్లా పొడిచింది. అలాగే, వాహనాలపైనా ప్రతాపం చూపింది. మూడు గంటలపాటు ఆవు సృష్టించిన గందరగోళంతో అశోక్‌నగర్, శ్రీనివాసనగర్ కాలనీ వాసులు హడలిపోయారు. కనిపించిన వారినల్లా పొడవడంతో జనం రోడ్లపై పరుగులు తీశారు. పార్క్ చేసి ఉన్న కార్లను సైతం వదలకుండా కొమ్ములతో కుమ్మడంతో నాలుగు కార్లు దెబ్బతిన్నాయి. ఆవు దాడిలో ముగ్గురికి గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. చివరకు పోలీసులు, పశువైద్య అధికారులు చేరుకుని తాళ్ల సాయంతో ఆవును బంధించి మత్తు మందు ఇచ్చి నియంత్రించారు.దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
కొమ్ములతో పొడిచి.. గుండెలపై తొక్కి
సాక్షి, మునుగోడు(నల్గొండ) : పాడిఆవు.. తన ఇంటికి ఆసరా అవుతుందనుకున్నాడు. పాలతోపాటు వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని భావించాడు. కానీ ఆ ఆవే..అతని పాలిట మృత్యువైంది. యజమానిని పొడిచి గుండెలపై కాళ్లతో తొక్కి చంపేసింది. ఈ హృదయ విదారక ఘటన.. మునుగోడు మండలం కోతులారం గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పందుల పాపయ్య (56) తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో పది ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయ పనుల కోసం ఒక ఎద్దుతో పాటు ఒక ఆవును ఏడాది క్రితం కొనుగోలు చేశాడు. వాటిని వ్యవసాయ పనుల కోసం వినియోగించుకొని బావి వద్దనే కొట్టంలో కట్టేసేవాడు. ఆవు పాలు కూడా ఇచ్చేది. పాపయ్య రాత్రి వ్యవసాయ బావి వద్దనే పడుకుని ఉదయాన్నే ఆవుపాలు పిండుకుని ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అక్కడికి వెళ్లిన అతను మంగళవారం ఉదయం ఇంటికి రాలేదు. దీంతో అతని కుమారుడు నరేష్ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా, తండ్రి తీవ్రగాయాలతో విగతజీవిగా పడి ఉన్నాడు. అక్కడే ఉన్న ఆవు నరేష్ వెంట పడడంతో అతను తప్పించుకుని గ్రామానికి చేరుకున్నాడు. మరికొంతమందిని వెంటబెట్టుకుని తిరిగి బావి వద్దకు వెళ్లి ఆవును పట్టుకుని కట్టేశారు. పాపయ్యను చూడగా అప్పటికే మృతిచెందాడు. ఆవుకి నీళ్లు తాపే సమయంలో ఆయనని పొడిచి కింద పడేసి గుండెపై కాళ్లతో తొక్కడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆవు అప్పుడప్పుడు పొడిచేందుకు వచ్చేదని, ఇలా చంపుతదని అనుకోలేదని రోదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా చేశారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కె. రజినీకర్ తెలిపారు. -
హంతకుల్లేని హత్య!
ఉన్మాద మూకలు అమాయకుల్ని కొట్టి చంపుతున్న ఉదంతాల్లో చాలా కేసులకు ఏ గతి పట్టిందో రాజస్తాన్‌లోని పెహ్లూ ఖాన్ హత్యోదంతంలోనూ అదే జరిగింది. రెండేళ్లక్రితం రాజస్తాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో 55 ఏళ్ల పెహ్లూఖాన్ అనే వ్యక్తిని ఒక మూక కొట్టి చంపిన కేసులో ఆరుగురు నింది తులూ నిర్దోషులని జిల్లా కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు మైనారిటీ తీరనివారు గనుక వారిపై బాల నేరస్తుల కోర్టులో విచారణ జరుగుతోంది. హర్యానాకు చెందిన డెయిరీ రైతు పెహ్లూ ఖాన్, ఆయన కుమారులిద్దరూ జైపూర్ పశువుల సంతలో ఆవుల్ని కొని స్వస్థలానికి వెళ్తుండగా ఉన్మాద మూక వారిపై దాడి చేసింది. పశువుల్ని అక్రమ రవాణా చేస్తు న్నారన్న అనుమానమే ఈ దాడికి కారణం. మూడు గంటలపాటు పెహ్లూఖాన్నూ, ఇతరులనూ కొట్టి తీవ్రంగా గాయపరిస్తే రెండు రోజుల తర్వాత పెహ్లూ ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఇలాంటి దాడులు గత అయిదేళ్లలో వందకుపైగా చోటుచేసుకోగా వేళ్లమీద లెక్కపెట్టదగ్గ కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. ఆ కేసుల్లో కూడా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. మూకదాడులు చోటు చేసుకున్నప్పుడల్లా కాస్త వెనకో ముందో అధికార, విపక్ష నేతలు ఖండిస్తూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భిన్న సందర్భాల్లో ఈ తరహా దాడుల్ని సహించేది లేదని హెచ్చరించారు. కానీ కింది స్థాయిలో పరిస్థితులు దానికి తగినట్టుగా లేవు. ఘటన జరిగాక అరెస్టులు చేస్తున్నా దర్యాప్తులో, సాక్ష్యాధారాల సేకరణలో పోలీసులు ఘోరంగా విఫల మవుతున్నారు. చాలా సందర్భాల్లో కావాలని నీరుగారుస్తున్నారు. పెహ్లూఖాన్ ఉదంతంలో వీడియో దృశ్యాలున్నాయి. ఫొటోలున్నాయి. ఒక న్యూస్ చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో నిందితు డొకరు అతన్ని ఎలా కొట్టి చంపిందీ కళ్లకు కట్టినట్టు వివరించాడు. ఇవన్నీ న్యాయస్థానం ముందు వీగిపోయాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కిన కేసు స్థితే ఇలా ఉంటే దేశంలో చట్టపాలనపై ఎవరికైనా విశ్వాసం ఉంటుందా? ఇలాంటి దాడులు జరిగినప్పుడల్లా కాంగ్రెస్, దాంతోపాటు ఇతర పార్టీలు బీజేపీ, సంఘ్ పరివార్‌లను తప్పుబడతాయి. ఆ సంస్థలు ఖండిస్తాయి. అక్కడితో అది ముగిసిపోతుంది. పెహ్లూఖాన్ ఉదంతంలో కాంగ్రెస్ ఎంత హడావుడి చేసిందో ఎవరూ మరిచిపోరు. బహుశా దాని పర్యవసానం కావొచ్చు... నిరుడు జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. ప్రత్యేకించి ఆళ్వార్ జిల్లాలో కాంగ్రెస్, బీఎస్పీలు అత్యధిక స్థానాలు గెల్చుకున్నాయి. రాజస్తాన్‌లో జరిగిన మూడు మూక హత్యలూ ఈ ప్రాంతంలో చోటుచేసుకున్నవే. కనీసం ఈ కేసును సవాలుగా తీసుకుని దోషుల్ని దండించడానికి ప్రయత్నిద్దామన్న స్పృహ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోయింది. ఈ కేసులో పోలీసులు నిందితులపై సరైన సెక్షన్లు పెట్టలేదని ఆరోపణలొచ్చినా దానికి పట్టలేదు. నడిరోడ్డుపై బహిరంగంగా కొట్టి తీవ్రంగా గాయపరిచి చంపితే నిందితులపై పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశమున్న సెక్షన్ 307(హత్యాయత్నం)ను పెట్టలేదు. దానికి బదులు ‘ప్రాణనష్టం జరిగినా హత్యగా పరిగణించవీల్లేని’ చర్యగా సెక్షన్ 308కింద నేరారోపణ చేశారు. పైగా బాధితులపైనే రెండు నెలలక్రితం మరో చార్జిషీటు దాఖలు చేశారు. పెహ్లూఖాన్, అతని కుమారులు, ట్రక్కు యజ మాని పశువుల్ని అక్రమంగా తరలిస్తున్నారన్నది దాని సారాంశం. హర్యానా–రాజస్తాన్ సరిహద్దు ల్లోని ఆళ్వార్ తదితర ప్రాంతాల్లో పాడి పరిశ్రమ ఉంది. అక్కడ పశువుల్ని ఇటునుంచి అటూ, అటునుంచి ఇటూ తరలించడం, అమ్మడం రివాజు. పశువుల్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి అవసరమన్న నిబంధన ఉన్నా చాలామంది దాన్ని పట్టించుకోకుండా వ్యాపార లావాదేవీలు సాగిస్తుంటారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో అధికారులకు వర్తమానం ఇచ్చి నిందితులను పట్టి ఇవ్వొచ్చు. కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇలా కొట్టి చంపడం, ఆ కేసు కాస్తా వీగిపోవడం, చివరకు బాధితులపై స్మగ్లింగ్ కేసు నమోదు కావడం దిగ్భ్రాంతికలిగిస్తుంది. పెహ్లూ, అతని కుమారులపై చార్జిషీటు నమోదైనప్పుడే కొన్ని సంస్థలు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. కానీ ఫలితం లేకపోయింది. దర్యాప్తులోనూ, సాక్ష్యాధారాల సేకరణలోనూ పోలీసులు విఫలమైనప్పుడు న్యాయస్థానాలు నిస్సహాయంగా మిగిలిపోతాయి. ఈ కేసులో ప్రభుత్వాసుపత్రి వైద్యులిచ్చిన పోస్టుమార్టం నివేది కకూ, దెబ్బలుతిన్నవారికి తొలుత చికిత్స చేసిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి పోస్టుమార్టం నివేదికకూ పొంతన లేదు. ఒంటినిండా తీవ్ర గాయాలు కావడం వల్లా, షాక్‌కి గురికావటం వల్లా పెహ్లూ మరణించి ఉండొచ్చని ప్రభుత్వాసుపత్రి వైద్యుల నివేదిక చెప్పగా, అతను గుండెపోటుతో చనిపోయాడని ప్రైవేటు ఆసుపత్రి తేల్చిచెప్పింది. నిబంధనల ప్రకారం పెహ్లూ మరణ వాంగ్మూ లంపై మేజిస్ట్రేట్ సంతకం చేయాల్సి ఉండగా అది జరగలేదు. ఇక వీడియో తీసిన వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదన్న కారణంతో ఆ సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. నిరుడు సెప్టెంబర్‌లో మూకదాడి కేసులో జరిగే విచారణకు హాజరుకావడాని కొచ్చిన బాధితులపై దుండగులు దాడిచేశారు. పెహ్లూఖాన్ తరహాలోనే అంతం చేస్తామని తమను హెచ్చరించారని బాధితులు ఫిర్యాదు చేశారు. కానీ అదంతా నిజం కాదని పోలీసులు తేల్చారు. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు వీడియో తీసిన వ్యక్తయినా, దాన్ని ప్రత్యక్షంగా చూసిన మరెవరైనా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాగలరా? మూకదాడులపై ప్రత్యేక చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలిం చమని 2015లో సుప్రీంకోర్టు సూచించింది. కానీ దర్యాప్తు సంస్థల్లో నిబద్ధత కొరవడినప్పుడు ఎన్ని చట్టాలుండి ఏం ప్రయోజనం? ఉదాసీనతతో లేదా ఉద్దేశపూర్వకంగా నిందితులకు తోడ్పడే అధికా రులను సైతం నేరాల్లో భాగస్వాములుగా పరిగణించే నిబంధనలుంటేతప్ప ఈ ధోరణి ఆగదు. -
చెట్టుకు కట్టేసి చేతులు నరికారు..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆవులు గల్లంతైన వ్యవహారంలో ఘర్షణ చెలరేగడంతో 35 ఏళ్ల వ్యక్తిని చెట్టుకు కట్టేసి చేతులు నరికిన ఘటన రైసినా గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం ఆవులు కనిపించడం లేదంటూ ప్రేమ్ నారాయణ్ సాహూ అనే వ్యక్తి సత్తూ యాదవ్ గోశాలకు వెళ్లి ఆరా తీశారు. ఈ విషయమై ఘుర్షణ జరగడంతో యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు సాహుపై దాడికి పాల్పడ్డారు. సాహును తీవ్రంగా కొట్టి చెట్టుకు కట్టేసి కత్తితో అతని చేతులు నరికారు. బాధితుడు సాయం చేయాలని అరిచినా గ్రామస్తులు ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. స్ధానికులు సమాచారం అందించడంతో స్పందించిన పోలీసులు సాహూను ఆస్పత్రికి తరలించారు. బాధితుడిపై దాడికి పాల్పడిన కుటుంబంపై హత్యా యత్నం కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మరో ముగ్గురికోసం గాలిస్తున్నామన్నారు. -
ఆ బాలిక దైర్యానికి అందరూ ఫిదా..
-
ఆ బాలిక ధైర్యానికి అందరూ ఫిదా..
సాక్షి, బెంగళూరు: ప్రమాదం సంభవించే ముందు ఏమి చేయాలో అర్థం కాదు. కొంతమంది అయితే ప్రమాదం వచ్చినప్పుడు తమ వారిని వదిలి పారిపోయేవాళ్లు కూడా ఉంటారు. కానీ తన బుజ్జి తమ్ముడిని కాపాడుకునేందుకు ఎనిమిది సంవత్సరాల బాలిక తన వయసుకు మించిన సాహసం చేసింది. మృత్యువు ఆవు రూపంలో వచ్చింది. దారిపొడవునా అందర్ని పొడుచుకుంటూ వస్తున్న ఆవు ఒక్కసారిగా అడుకుంటున్న చిన్నారుల వైపు దూసుకొచ్చింది. వివరాలివి.. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఆర్తి తన చిట్టి తమ్ముడు కార్తీక్‌ని చిన్న కారులో కూర్చోబెట్టుకుని ఇంటి ఆవరణలో ఆడిస్తోంది. ఆ సమయంలో అటువైపుగా పరుగెత్తుకు వచ్చిన ఆవు వారివైపు మళ్లింది. దాంతో తమ్ముడిని తన చేతులతో పక్కకు లాగేసుకుంది. కానీ ఆవు మాత్రం వాళ్లను వదలకుండా కొమ్ములతో కుమ్ముతున్నా ఆ చిన్నారి తన శరీరాన్ని అడ్డంగా పెట్టి తన బుజ్జి తమ్ముడిని రక్షించేందుకు ప్రయత్నించింది. ఆవు మాత్రం అలానే ఆర్తిని రెండు, మూడు సార్లు పొడిచింది. ఫిబ్రవరి 13న ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆవును అక్కడి నుంచి తరిమేశాడు. ఆ బాలికకు మాత్రం చిన్నపాటి గాయాలయ్యాయి. సీసీటీవిలో రికార్డు అయినా ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిన్నారి ధైర్య సాహసాలను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
ఆవు దాడిలో 10 మందికి గాయాలు
అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురంలో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. పిచ్చి పట్టిన విధంగా ఆవు కనపడిన జనాలపైకి దూసుకురావడంతో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా..మరో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.