![Mans Arms Chopped Off With Sword After Fight Over Missing Cows - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/3/attack.jpg.webp?itok=y7gNlusi)
ప్రతీకాత్మకచిత్రం (ఫైల్‌ఫోటో)
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆవులు గల్లంతైన వ్యవహారంలో ఘర్షణ చెలరేగడంతో 35 ఏళ్ల వ్యక్తిని చెట్టుకు కట్టేసి చేతులు నరికిన ఘటన రైసినా గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం ఆవులు కనిపించడం లేదంటూ ప్రేమ్ నారాయణ్ సాహూ అనే వ్యక్తి సత్తూ యాదవ్ గోశాలకు వెళ్లి ఆరా తీశారు. ఈ విషయమై ఘుర్షణ జరగడంతో యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు సాహుపై దాడికి పాల్పడ్డారు. సాహును తీవ్రంగా కొట్టి చెట్టుకు కట్టేసి కత్తితో అతని చేతులు నరికారు.
బాధితుడు సాయం చేయాలని అరిచినా గ్రామస్తులు ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. స్ధానికులు సమాచారం అందించడంతో స్పందించిన పోలీసులు సాహూను ఆస్పత్రికి తరలించారు. బాధితుడిపై దాడికి పాల్పడిన కుటుంబంపై హత్యా యత్నం కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మరో ముగ్గురికోసం గాలిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment