కొందరు వ్యక్తులు మూగజీవాలపట్ల కఠినంగా ప్రవర్తిస్తుంటారు. జంతువులను రాళ్లతో, కర్రలతో కొడుతూ.. పైశాచికానందాన్ని పొందుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచుగా మన చుట్టు జరుగుతుంటాయి. చాలా వరకు.. మూగజీవాలపై ఎవరైన దాడిచేస్తుంటే..పక్కనున్నవారు వద్దని వారిస్తుంటారు. అయితే, ఒక్కొసారి ఇలాంటి దుర్మార్గులకు కాలం, కర్మ తగిన గుణపాఠం చెబుతాయి. తాజాగా, ఇలాంటి ఆసక్తికర వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఇది.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక వ్యక్తి.. వీధిలో ఉన్న శునకాన్ని పట్టుకుని పైకి లాగి అమానుషంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత దాని రెండు చెవులు పట్టుకుని గట్టిగా లాగుతున్నాడు. పాపం.. ఆ బాధకు తాళలేక కుక్క గట్టిగా విలవిల్లాడిపోయింది. శునకం.. బాధతో అరుస్తుంటే.. ఆ దుర్మార్గుడు మాత్రం పైశాచికానందాన్ని పొందుతున్నాడు. ఏ ఒక్కరు కూడా... అతగాడి చర్యలను ఆపటానికి ప్రయత్నం చేయడంలేదు.
శునకం అరుపులు విన్న ఒక ఆవు అటుగా వచ్చింది. వెంటనే కుక్కను పట్టుకుని హింసిస్తున్న వ్యక్తిపై కొమ్ములతో దాడికి తెగబడింది. అతడిని.. తన రెండు కొమ్ములతో లేపి కిందపడేసి కుమ్మింది. ఆ శునకాన్ని దుర్మార్గుడి బారి నుంచి తప్పించింది. ఈ ఘటనతో అక్కడివారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. దీన్ని అటవీశాఖాధికారి సుషాంత్ నందా.. ‘కర్మ ఫలం’ అనుభవించాల్సిందే.. అంటూ తన ట్విటర్ ఖాతాలో కామెంట్‌ను జతచేసి పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు..‘పాపం.. శునకం.. ఎంత బాధతో అరుస్తుంది.. ’, ‘ నీకు చేతులేల వచ్చాయి.. ’,‘మనుషుల కన్నా.. నోరులేని జీవులే నయం..’,‘ కర్మఫలం.. అనుభవించాల్సిందే..’, ‘ఒక నోరులేని జీవి బాధ.. మరో మూగ జీవికే అర్థం అవుతోంది’ అంటూ ఆవుపై ప్రశంసలు కురిపిస్తూ... కామెంట్లు పెడుతున్నారు.
Karma 🙏🙏 pic.twitter.com/AzduZTqXH6
— Susanta Nanda IFS (@susantananda3) October 31, 2021
Comments
Please login to add a commentAdd a comment