హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్‌ఎంఏ) కొత్త అధ్యక్షుడిగా నూజివీడు సీడ్స్ (ఎన్‌ఎస్‌ఎల్), ఎన్‌ఎస్‌ఎల్ షుగర్స్ లిమిటెడ్ సంస్థల చైర్మన్ మండవ ప్రభాకర్ రావు ఎన్నికయ్యారు. ఆదిత్య ఝున్‌ఝున్‌వాలా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
న్యూఢిల్లీలో జరిగిన 89వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ పేరును ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్‌ఎంఏ)గా మార్చారు. సంస్థ ఉపాధ్యక్షుడిగా ధామ్‌పూర్ బయో ఆర్గానిక్స్ (డీబీవో) ఎండీ గౌతమ్ గోయల్‌ను ఎన్నుకున్నారు.
దేశీయంగా జీవ ఇంధనాలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో దూరదృష్టితో తమ సంస్థ పేరులో బయో ఎనర్జీని కూడా చేర్చినట్లు ఐఎస్‌ఎంఏ తెలిపింది. దేశీయంగా చక్కెర పరిశ్రమ.. ఇంధన పరిశ్రమగా రూపాంతరం చెంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment