శాంటియాగో: చిలీ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం మాజీ నేత గాబ్రియెల్ బోరిక్(35) ఘన విజయం సాధించారు. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో బోరిక్ సునాయాసంగా రికార్డు స్థాయిలో 56% ఓట్లు గెలుచుకున్నారు. ప్రధాన ప్రత్యర్థి జోస్ ఆంటోనియో కాస్ట్ కంటే 10 పాయింట్లు ఎక్కువగా సాధించారు. దేశ పాలనపగ్గాలు చేపట్టిన ఆధునిక ప్రపంచ యువ నేతల్లో ఒకరిగా, అత్యంత పిన్న వయస్కుడైన చిలీ అధ్యక్షుడిగా బోరిక్ నిలిచారు.
రాజధాని శాంటియాగోలో విజయోత్సవాల్లో భారీగా హాజరైన ప్రజలు, ముఖ్యంగా యువతనుద్దేశించి బోరిక్ స్థానిక మపుచె భాషలో ప్రసంగించారు. దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రకటించారు. ప్రజలందరికీ సమానంగా న్యాయం అందిస్తానని వాగ్దానం చేశారు. చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్, బోరిక్‌తో ఫోన్‌లో సంభాషించారు. మార్చిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ఆయనకు సహకారం అందిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment