సాక్షి, విజయవాడ: ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అచ్చెన్నాయుడు స్థానంలో పల్లా శ్రీనివాస్‍ను నియమించే అవకాశాలున్నాయి. బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పల్లా శ్రీనివాస్‌ను టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రకటించనున్నారని సమాచారం.
కాగా, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న అచ్చెన్నాయుడు.. కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు స్ధానంలో మరో సీనియర్ నేతకు ఏపీ పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. గాజువాక నుంచి గెలిచిన టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాస్‌రావు పేరును త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment