Palla Srinivasa Rao
-
టీడీపీ భరత్, పల్లా.. మిమ్మల్ని ప్రజలు క్షమించరు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావును మాదిరిగానే విశాఖ టీడీపీ ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తాజాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను 2024 జనవరిలో స్పీకర్ ఆమోదించారు. అప్పటి గంటా శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత వైజాగ్ పార్లమెంటు సభ్యుడు భరత్ మతుకుమల్లి, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలి. వారు అలా రాజీనామా చేయకపోయినా, ప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోయినా చరిత్ర వారిని ద్రోహులుగా, మోసగాళ్లుగా పరిగణిస్తుంది. ప్రజలు వారిద్దరినీ క్షమించరు. వారు చేసిన ద్రోహానికి వారిద్దరికీ గట్టి గుణపాఠం జనం చెబుతారు అంటూ కామెంట్స్ చేశారు. The then MLA, Sri Ganta Srinivas Rao, resigned in February 2021 in protest against the decision to privatize the Vizag Steel Plant, and his resignation was accepted in January 2024. Taking inspiration from him, Vizag Lok Sabha MP Bharat Mathukumilli (@sribharatm) and local MLA…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 13, 2024 అయితే, నిన్న కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3 ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ యధావిధిగా గాలికి కొట్టుకుపోయినట్టే. ఈ సంక్షోభం సమయంలో ఆయన మౌనం ఎన్డీయే కేంద్రప్రభుత్వానికి ఉక్కు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంగా భావించవచ్చు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డట్టే. స్టీల్ ఫ్యాక్టరీ ఆలంబనగా వైజాగ్ లో ఎగిసి పడిన ఒక ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) ఇక ఛిద్రమైనట్టే. చంద్రబాబు మోసాన్ని, కాపాడే శక్తి ఉన్నా నిర్లిప్తంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు. టీడీపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. (1/7) భయపడినంతా అయింది. చంద్రబాబు@ncbn గారి హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3 ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ యధావిధిగా గాలికి…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 12, 2024 ఇది కూడా చదవండి: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏలేరు వరదలు: వైఎస్ జగన్ -
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం
-
ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?
సాక్షి, విజయవాడ: ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అచ్చెన్నాయుడు స్థానంలో పల్లా శ్రీనివాస్‌ను నియమించే అవకాశాలున్నాయి. బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పల్లా శ్రీనివాస్‌ను టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రకటించనున్నారని సమాచారం.కాగా, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న అచ్చెన్నాయుడు.. కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు స్ధానంలో మరో సీనియర్ నేతకు ఏపీ పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. గాజువాక నుంచి గెలిచిన టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాస్‌రావు పేరును త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
భూకబ్జాలో కొత్త కోణం: దళితుల భూమి వదల్లేదు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు సోదరుడు శంకరరావు భూకబ్జాలో కొత్త కోణం వెలుగు చూసింది. శంకరరావు తమ భూమి ఆక్రమించినట్లు పలువురు దళితులు ఫిర్యాదు చేశారు. అజయ్‌బాబు, జైన్ అనే వ్యక్తులతో కలిసి శంకరరావు దళిత భూములు ఆక్రమణకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తుంగలం సర్వే నంబర్ 29/1లోని ఎకరా 30 సెంట్ల స్థలంలో పల్లా శంకరరావు బెదిరించి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటున్నారు దళితులు. పల్లా సోదరుడి భూ ఆక్రమణలపై అప్పటి హోంమంత్రి చినరాజప్పకు తాము ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు బాధితులు. టీడీపీ హయాంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. చదవండి: కొనసాగుతున్న కబ్జా ప్రకంపనలు -
కొనసాగుతున్న కబ్జా ప్రకంపనలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖపట్నంలో భూకబ్జాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబసభ్యుల చెరలో ఉన్న భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై తెలుగుదేశం నాయకులు గగ్గోలు పెడుతున్నారని మంత్రులు, ప్రజాప్రతినిధులు సోమవారం ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల తీరును ఎండగట్టారు. ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలేదిలేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. కబ్జాకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాచేసిన భూముల విలువే రూ.వెయ్యికోట్లని ఎమ్మెల్యే అమర్నాథ్ తెలిపారు. మరోవైపు తాను భూములు ఆక్రమించలేదన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.. తన తమ్ముడి ఆక్రమణలపై మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అడ్డూఅదుపు లేకుండా ప్రభుత్వ భూముల కబ్జా విశాఖపట్నంలో వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఆనాడు టీడీపీ ప్రభుత్వమే సిట్ వేసిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోందన్నారు. ఆనాడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్ఛగా వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని టీడీపీ నేతలు ఆక్రమించారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎక్కువమంది టీడీపీ నేతలు ఆక్రమణదారులు కావటంతో అప్పటి ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించిందన్నారు. విశాఖలో టీడీపీ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా సాగాయన్నారు. ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. విశాఖలో టీడీపీ నేతలు ఆక్రమించినవి ప్రభుత్వ భూములని రికార్డులే చెబుతున్నాయని గుర్తుచేశారు. అందుకే ప్రభుత్వం వాటిని న్యాయబద్ధంగా తన ఆధీనంలోకి తీసుకుంటోందన్నారు. టీడీపీ నేతల ఘనకార్యాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆక్రమిత భూముల గురించి టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని చెప్పారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటే అది కక్షపూరితం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ట్రస్టీగా ప్రజల ఆస్తులను కాపాడటంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అధికారులు నిగ్గు తేల్చారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అండదండలతో విశాఖ కేంద్రంగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూకబ్జాలు, భూకుంభకోణాలకు పాల్పడ్డారని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కుటుంబం ఆధీనంలో ప్రభుత్వ భూములున్నట్లు అధికారులు నిగ్గుతేల్చారని, వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి, అధికారులకు ఉందని చెప్పారు. విశాఖలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్ధరాత్రి షెడ్లను కూల్చేశారని కొందరు టీడీపీ నేతలు ఆక్రమణదారులకు వత్తాసుపలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న రూ.4,776 కోట్ల విలువైన సుమారు 430 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి మంచి సంకల్పంతో చేపట్టిన ఆక్రమిత భూముల స్వాధీన మహాయజ్ఞానికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు భూకుంభకోణాలపై పరస్పరం ఆరోపణలు చేసుకున్నారని గుర్తుచేశారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఎస్టేట్, ఈనాం భూములను టీడీపీకి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని, వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని చెప్పారు. విశాఖను పరిపాలన రాజధాని చేసి తీరతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్త కె.కె రాజు, పార్టీ నాయకుడు అక్కరమాని వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. కబ్జాకు సూత్రధారి చంద్రబాబే.. విశాఖలో భూదోపిడీ, ప్రభుత్వ భూముల కబ్జాకు సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాచేసిన దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన 40 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని గుర్తుచేశారు. రుషికొండలో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లాంటి వారు ఇప్పుడు తమ సహచరుల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన కుటుంబసభ్యులు ఆక్రమించుకున్న భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందే తప్ప దీన్లో కక్షసాధింపు ఏమీ లేదన్నారు. హుద్‌హుద్ తుపాను సమయంలో విశాఖలో లక్ష ఎకరాలకు సంబంధించిన రికార్డులు పోయాయని చెబుతున్నారని, అసలు అప్పుడు గాలులే తప్ప లాకర్లలో ఉన్న భూరికార్డులు తడిసిపోయే విధంగా వర్షం పడలేదని చెప్పారు. అప్పటి భూరికార్డులు ఎలా మాయమయ్యాయో చంద్రబాబుకే తెలియాలన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ అభివృద్ధికి రాత్రిబంవళ్లు పనిచేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేక విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. నేను ఎక్కడా ఆక్రమించలేదు – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గంలో అధికారులు స్వాధీనం చేసుకున్న ఆక్రమిత భూములు తనవి కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖపట్నంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను భూములు ఆక్రమించినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పారు. గాజువాక నియోజకవర్గంలోని సర్వే నం.33/4లో తన స్థలం పక్కన ఉన్న రాస్తా తనకు మాత్రమే పనికొస్తుందని, అది ఎవరికీ ఉపయోగపడదని, దాన్ని తనకు అప్పగిస్తే.. బదులుగా ఎక్కడైనా స్థలం ఇస్తానని గతంలోనే దరఖాస్తు చేసుకున్నానని, అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించకపోతే.. ఆ భూముల్ని మీరెలా వినియోగించుకుంటారని మీడియా ప్రశ్నించగా.. సమాధానం దాటవేశారు. సర్వే నం.33/2లో తన స్థలం పక్కన చెరువు బంద ఉందని, దాన్ని తాను ఆక్రమించకుండానే ఆక్రమించేసినట్లు చూపించారని చెప్పారు. చట్టం ప్రకారం కుటుంబ భూముల్లో తన వాటా 1/7 మాత్రమేనన్నారు. తుంగ్లాం రెవెన్యూ గ్రామం పరిధిలో తన సోదరుడు పల్లా శంకరరావు పేరుతో ఉన్న ఆక్రమిత భూముల స్వాధీనంపై మాత్రం పల్లా శ్రీనివాసరావు నోరు మెదపకుండానే మీడియా సమావేశం ముగించేశారు. -
పల్లా ఆక్రమణలకు చెక్
-
సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో భూబకాసురుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన భూములను అధికారులు ఒక్కొక్కటిగా స్వా«దీనం చేసుకుంటున్నారు. అధికారం అండతో టీడీపీ నేతలు గతంలో చేసిన ఆక్రమణలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలకు స్పందించిన అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారం అడ్డంపెట్టుకొని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధుగణం దోచుకున్న భూముల బాగోతాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించారు. నగర శివారు ప్రాంతాల్లో భారీ స్థాయి ఆక్రమణలను గుర్తించిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం.. ఆ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఒకటి కాదు, రెండు కాదు రూ.669 కోట్ల విలువ చేసే ఏకంగా 38.45 ఎకరాల ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సాక్షి, విశాఖపట్నం/అక్కిరెడ్డిపాలెం(గాజువాక): అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా అండ్ కో సాగించిన భూదందాకు రెవెన్యూ యంత్రాంగం ఫుల్స్టాప్ పెట్టింది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వెంటనే.. ప్రభుత్వ భూములపై ఎగబడి బంధుగణంతో కలిసి అందినకాడికి ఆక్రమించుకున్న పల్లా శ్రీనివాసరావు ఆక్రమణల బాగోతాన్ని సర్వే నంబర్లతో సహా ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు ఆయా సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూముల పరిస్థితులను పరిశీలించి.. నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందించగా.. ఆక్రమణలు తొలగించి.. స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పల్లా ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఆదివారం ఉక్కుపాదం మోపారు. గత 15 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ భూములను ఆక్రమించి పలు కంపెనీలకు లక్షల్లో లీజులకు ఇచ్చి కోట్లు కొల్లగొట్టిన మాజీ ఎమ్మెల్యే బంధుగణం దర్జాగా అనుభవిస్తున్న ప్రభుత్వ ఆక్రమిత భూములను గుర్తించి రెవెన్యూ అధికారులు తొలగింపు చర్యల్ని వేకువ జామున 3 గంటల నుంచి ప్రారంభించారు. మూడు ప్రాంతాల్లో 38.45 ఎకరాలు స్వాదీనం గాజువాక నియోజకవర్గంలో ఎక్కడ ఖాళీ జాగా, పోరంబోకు స్థలం, ప్రభుత్వ భూమి, చెరువు.. ఏం కనిపించినా విడిచిపెట్టకుండా ఆక్రమించేశారు. జగ్గరాజుపేట, తుంగ్లాం, కూర్మన్నపాలెం రెవెన్యూపరిధిలో ఆక్రమించేసుకున్న 38.45 ఎకరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. జగ్గరాజుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నం. 28–1, 28–2లో 1.26 ఎకరాలు వాగు స్థలం స్వాదీనం చేసుకున్నారు. అదేవిధంగా తుంగ్లాంలోని సర్వే నం.9–6, 10–2లోని 0.92 ఎకరాల పోరంబోకు రాస్తా, సర్వే నం.12–1 నుంచి 12–14 వరకూ 6.15 ఎకరాల యూఎల్సీ ల్యాండ్, 14–1లోని 1.85 ఎకరాల పోరంబోకు చెరువు, సర్వే నం.28లోని 21.67 ఎకరాల పోరంబోకు చెరువు, 29/1బీలోని 0.70 ఎకరాల ఇనాం భూములు, 29/2లోని 0.80 ఎకరాల పోరంబోకు బంద, 30–12, 30–13, 30–15లోని 2.04 ఎకరాల గయాలు భూములు, 33/2, 33/4లోని 1.50 ఎకరాల పోరంబోకు రాస్తా, సర్వే నం.34–2లోని 0.24 ఎకరాల పోరంబోకు స్థలాల్లోని ఆక్రమణలను తొలగించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కూర్మన్నపాలెంలోని సర్వే నం. 8/6లోని 1.35 ఎకరాల పోరంబోకు భూమిలోని ఆక్రమణలను తొలగించారు. ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎల్అండ్టీ, హెచ్‌పీసీఎల్ సంస్థలకు చెందిన ప్రైవేట్ కాంట్రాక్ట్ పనులకు లక్షల్లో లీజులకు ఇచ్చి కోట్ల రూపాయలు గడించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తొలగింపు చేపట్టే ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆయా సర్వే నంబర్లలోని ఆక్రమణలను ఆర్డీవో పెంచల్కిశోర్, గాజువాక తహసీల్దార్ ఎంవీఎస్ లోకేశ్వరరావు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆయా భూములు ఆక్రమణలకు గురయ్యాయని నిర్థారించిన అనంతరం తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ తొలగింపులో గాజువాక, కూర్మన్నపాలెం రెవెన్యూ అధికారులు, సిబ్బందితో పాటు గాజువాక పోలీసులు పాల్గొన్నారు. మార్కెట్ విలువ అక్షరాలా రూ.669.26 కోట్లు పల్లా ఆక్రమించి అనుభవించిన భూముల విలువ మార్కెట్లో భారీగానే ఉంది. తనతో పాటు బంధుగణంతో కలిసి ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. జగ్గరాజుపేట రెవెన్యూ పరిధిలో ఆక్రమించుకున్న 1.26 ఎకరాల భూమి మార్కెట్‌విలువ రూ.12.81 కోట్లుంది. అదేవిధంగా తుంగ్లాం రెవెన్యూ పరిధిలో ఆక్రమించుకున్న భూముల విలువ రూ. 613,32,48,000. కూర్మన్నపాలెంలో ఆక్రమించిన భూమి విలువ రూ.43.12 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో రూ.669.26 కోట్లు ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దేవస్థాన భూముల ఆక్రమణలపై మరోసారి విచారణ.. ఏళ్ల క్రితం జగ్గరాజుపేట, తుంగ్లాం రెవెన్యూ పరిధిల్లో 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ మధ్య కాలంలో వీటిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు గత కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో రికార్డుల పరిశీలనతో పాటు ఆక్రమిత స్థలాల్లో సర్వే జరిపిన అనంతరం ప్రభుత్వ భూములుగా గుర్తించాం. అనంతరం ఆక్రమిత స్థలాలను స్వా«దీనం చేసుకోవడానికి ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆర్డీవో ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగిచే ప్రక్రియ చేపట్టాం. ఆక్రమణల్లో కొన్ని భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవని దేవస్థానం ఈవో గుర్తించారు. అవి వారి పరిధిలో ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆక్రమణలు గురైనట్లుగా కనిపిస్తున్నాయి. దీనిపై మరోసారి విచారణ చేపట్టి రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరిగిన తర్వాత చర్యలకు సిద్ధమవుతాం. కబ్జాకు పాల్పడిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. – ఎంవీఎస్ లోకేశ్వరరావు, గాజువాక తహసీల్దార్ -
టీడీపీ కబ్జాపై కొరడా!
అధికారాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్ఛగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు. ప్రహరీలు కట్టేసుకున్నారు. కబ్జాదారుల్లో ఎక్కువ మంది టీడీపీ నేతలే కావటంతో అప్పటి ప్రభుత్వం అవేమీ చూడనట్లే నటించింది. దీంతో వారు చెలరేగిపోయారు. కానీ ప్రభుత్వం మారింది. సర్కారు భూముల్ని తిరిగి స్వా«దీనం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఏడాదిగా కొరడా ఝుళిపిస్తోంది. ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదంటూ... దాదాపు రూ.4,300 కోట్ల విలువైన భూముల్ని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. దీంతో ఉత్తరాంధ్ర టీడీపీ త్రయం అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు విషప్రచారానికీ వెనకాడటం లేదు. దీనికి తోడు ఎల్లో మాఫియా... రోజుకో రకం అసత్య ప్రచారాలకు దిగుతోంది. సాక్షి, విశాఖపట్నం: ఇవి ప్రభుత్వ భూములు. ఎందుకంటే రికార్డులు అబద్ధాలు చెప్పవు!. అందుకే వాటిని ప్రభుత్వం తిరిగి తన అదీనంలోకి తీసుకుంటోంది. మరి ఇప్పటిదాకా ఇవి ఎవరి అదీనంలో ఉన్నాయి? ఆ ప్రశ్నకు జవాబు తెలిస్తే... టీడీపీ నేతలు ఎంతటి ఘనులో అర్థమయిపోతుంది. తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఎంతటి అర్థం లేనివో, ఎందుకింత కడుపుమంటతో రగిలిపోతున్నారో తెలిసిపోతుంది. ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే గాజువాక నియోజకవర్గంలో మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువుల కబ్జాలో ఉన్న రూ.669.26 కోట్లు విలువైన 38.45 ఎకరాల్ని రెవెన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ భూముల్ని పల్లా సోదరుడు శంకరరావు, ఇతర బంధువులు ఆక్రమించుకోవటమే కాక... వాటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చేసి కోట్లు సంపాదిస్తున్నారు. దీంతో వీటిని తిరిగి స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించారు. పల్లా భూకబ్జాలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గాజువాక మండలం తుంగ్లాం రెవెన్యూ పరిధిలోని ఆటోనగర్ ఎఫ్ బ్లాక్‌లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించిన రెవెన్యూ అధికారులు నెలన్నరపాటు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ అనంతరం పల్లా సోదరుడు శంకరరావు గాజువాక మండలం తుంగ్లాం, జగ్గరాజుపేట, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో 38.45 ఎకరాలను కబ్జాచేసినట్లు గుర్తించారు. 15 ఏళ్లకు పైగా ప్రభుత్వ భూములను ఆధీనంలో ఉంచుకుని వీటిని హెచ్‌పీసీఎల్, ఎల్అండ్టీ, మరికొన్ని ప్రైవేటు కంపెనీలకు లీజులకిచ్చి భారీగా ఆర్జించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు నివేదిక అందటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీవో పి.కిశోర్, గాజువాక తహసీల్దార్ లోకేశ్వరరావు, ఇతర రెవెన్యూ అధికారులు ఆదివారం ఆక్రమిత భూముల స్వా«దీన ప్రక్రియను చేపట్టారు. శంకరరావుకు నోటీసులిచ్చిన అనంతరం నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. పల్లా అనుచరులు అక్కడికి వచ్చి కొంత హడావుడి చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపు చేశారు. గతంలో ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది(ఫైల్) 430.81 ఎకరాలు.. రూ.4,291.41 కోట్లు విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల సంరక్షణపై జిల్లా రెవిన్యూ అధికారులు ఏడాదికాలంగా చర్యలు చేపట్టారు. కబ్జాదారులు ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం మేరకు.. ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేసి రికార్డుల పరంగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా రూ.4,291.41 కోట్లు విలువ చేసే 430.81 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క విశాఖ రూరల్ మండలంలోనే అత్యధికంగా రూ.1,691 కోట్ల విలువైన భూముల్ని స్వా«దీనం చేసుకున్నారంటే కబ్జాదారులు ఏ స్థాయిలో చెలరేగిపోయారో అర్థంచేసుకోవచ్చు. అక్కడితో ఆగకుండా పదేపదే ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేశారు. స్వా«దీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల చేతుల్లో ఉన్నవే. తమ భూబాగోతం బయటపడటంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగారు. అచ్చెన్న, అయ్యన్న, బండారు ఏకంగా ఆక్రమణలు తొలగిస్తున్న అధికారుల్ని కూడా తిడుతూ శాపనార్థాలు పెట్టారు. ఐఎఎస్‌లు, రెవిన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులు, పోలీసులపై నోటిదురుసుతనం ప్రదర్శించారు. టీడీపీ నేతల కబ్జా చెర నుంచి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న కొన్ని భూముల వివరాలు చూస్తే... – టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి గీతం విద్యాసంస్థల పేరుతో రుషికొండ, ఎండాడ పరిసరాల్లో సర్వే నంబర్ 15, 16, 17, 18, 19, 20, 55, 61లో ఉన్న 18.53 ఎకరాల్ని ఆక్రమించి దాని చుట్టూ ప్రహరీ నిర్మించేశారు. అదేవిధంగా రుషికొండలో సర్వే నం. 34, 35, 37, 38లో 20 ఎకరా>ల్లో గార్డెనింగ్, గ్రావెల్ బండ్‌తో పాటు వివిధ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిని గుర్తించిన అధికారులు 2020 అక్టోబర్ 24న అక్రమ నిర్మాణాల్ని తొలగించి.. స్వా«దీనం చేసుకున్నారు. – ఆనందపురం–శొంఠ్యాం సమీపంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువు, జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావు సహా పలువురు టీడీపీ నేతలు టైటిల్ డీడ్ నం.1180లో ఆక్రమించుకున్న రూ.256 కోట్లు విలువ చేసే 64 ఎకరాల భూముల్ని గతేడాది నవంబర్‌లో స్వాదీనం చేసుకున్నారు. – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆనందపురం మండలం భీమన్నదొర పాలెంలో సర్వే నం.156లో సుమారు 60 ఎకరాల భూమిని ఆక్రమించేసుకోగా.. గతేడాది డిసెంబర్లో రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఈ భూముల మార్కెట్ విలువ సుమారు రూ. 300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. – టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆక్రమించిన రుషికొండ బీచ్‌రోడ్డులో సర్వే నం.21లో సుమారు రూ.3 కోట్లు విలువ చేసే 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధువర్గం పేరుతో గాజువాక నియోజకవర్గంలో మూడు రెవిన్యూ గ్రామాల పరిధిలోని సుమారు రూ.669.26 కోట్లు విలువ చేసే 38.45 ఎకరాల్ని ఆదివారం రెవిన్యూ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. – టీడీపీ హయాంలో ప్రభుత్వ భూమిని ప్లే గ్రౌండ్‌గా మార్చి.. దర్జాగా కబ్జా చేసిన విశ్వనాధ విద్యాసంస్థల నుంచి ఆనందపురంలో సర్వే నంబర్ 122, 123లోని రూ.15 కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల భూమిని గతేడాది నవంబర్‌లో రెవిన్యూ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. -
విశాఖలో టీడీపీ నేతల భుకబ్జాలు
-
Palla Srinivasa Rao: కబ్జాచేసి.. లీజుకిచ్చి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ భూములను చెరబట్టిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భూ దందాలు, ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ హయాంలో ఏకంగా 56 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పల్లా అండ్ కో కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో నిగ్గు తేలింది. వ్యవసాయ, వ్యవసాయేతర, పారిశ్రామిక భూములు, రోడ్లు, చెరువులు.. ఇలా కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా గాజువాక పరిసర ప్రాంతాల్లో కనిపించి న భూములన్నింటినీ పల్లా మింగేశారు. సాక్షి వరుస కథనాలతో.. పల్లా కుటుంబం భూ దందాలు, అక్రమాలను ‘సాక్షి’ వరుస కథనాలతో ఏప్రిల్‌లోనే వెలుగులోకి తేవడంతో స్పందించిన జిల్లా అధికార యంత్రాం గం విచారణ చేపట్టింది. జాయింట్ కలెక్టర్ (ఆర్బీ అండ్ ఆర్) ఆదేశాల మేరకు గాజువాక తహసీల్దార్ ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు సమగ్ర విచారణ జరిపా రు. రెవెన్యూ అధికారులు దాదాపు నెలన్నర పాటు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబం భూ కబ్జాలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. ఖాళీ స్థలాలతో పాటు రోడ్లు, చెరువులను సైతం ఆక్రమించినట్లు విచారణలో స్పష్టమైంది. గాజువాక మండలం తుంగ్లాంలో వివిధ సర్వే నంబర్లలో 56.07 ఎకరాలు కబ్జా చేసినట్లు గుర్తించారు. కబ్జా భూములను లీజుకిచ్చి.. పల్లా కుటుంబ సభ్యులు రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు లీజులకు ఇచ్చి నట్లు అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. హెచ్‌పీసీఎల్, ఎల్ అండ్ టీ లాంటి బడా సంస్థలతో పాటు చిన్న ప్రైవేట్ కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారులకు విచారణ నివేదిక పల్లా కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలపై గాజువాక తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది స్పష్టమైన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించా రు. సర్వే నెంబర్ల ప్రకారం ఆ స్థలం ఏ విభాగం కిందకు వస్తుంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి, ఎవరి ఆధీనంలో ఉంది? అనే విషయాలతో సమగ్ర నివేదిక రూపొందించారు. పల్లా భూ కబ్జాల బాగోతం.. ► తుంగ్లాం సర్వే నంబర్ 9/6లో ఉన్న 56 సెంట్ల పోరంబోకు స్థలం పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకరరావు ఆక్రమణలోనే ఉందని అధికారులు నిర్ధారించారు. ► సర్వే నంబర్ 10/2లో 36 సెంట్ల పోరంబోకు భూమిని పల్లా శంకరరావు కబ్జా చేశారు. ఈ స్థలంలో ఏసీసీ షెడ్లు వేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ► సర్వే నంబర్ 14/1లో 14.5 ఎకరాల భూమిని పల్లా శంకరరావు ఆక్రమించినట్లు నిర్ధారించారు. ఇందులో 1.75 ఎకరాలను హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇవ్వడంతో గోడౌన్ నిర్మించినట్లు గుర్తించారు. మరో 10 సెంట్ల స్థలంలో జూబ్లీ ఇంజనీరింగ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షెడ్డు ఉంది. ► సర్వే నంబర్ 14/2లో 28 సెంట్ల రైత్వారీ భూమి పల్లా కబ్జాలో ఉన్నట్లు తేల్చారు. ► సర్వే నంబర్ 28లో ఉన్న 40 ఎకరాల చెరువు పల్లా శంకరరావు ఆధీనంలో ఉన్నట్లు తేల్చారు. ఇందులో 92 సెంట్లలో కాంపౌండ్ వాల్‌తో షెడ్డు ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ స్థలాన్ని ఏపీఐఐసీ నుంచి సేకరించగా రైల్వే శాఖకు అప్పగించినట్లు ఉంది. ► సర్వే నంబర్ 33/4లో 13 సెంట్ల పోరంబోకు స్థలాన్ని పల్లా కబ్జా చేశారు. ఆ స్థలంలో హెచ్‌పీసీఎల్ గోడౌన్ ఉంది. ► సర్వే నంబర్ 34/2లో ఉన్న 24 సెంట్ల పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి హెచ్‌పీసీఎల్‌కు లీజుకు ఇచ్చారు. సదరు సంస్థ ఈ స్థలంలో షెడ్డు నిర్మించింది. -
పల్లా.. ఇక చాలు: టీడీపీలో ముసలం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కార్పొరేటర్లలో అప్పుడే ముసలం బయలుదేరింది. ఏకంగా ముప్పై మంది కార్పొరేటర్లు గెలిచినా ఇప్పటికీ సరైన నిర్దేశం లేకపోవడంతో ఎవరికి వారు అన్నట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. దీనికి తోడు టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిపోతున్నారని అంటున్నారు. కరోనా కష్ట సమయంలో కూడా జీవీఎంసీ తీరు సమర్ధనీయంగానే ఉన్నా.. లేనిపోని ఆరోపణలు ఎక్కుపెట్టి నానాయాగీ చేయాలని పల్లా అదే పనిగా నగర కార్పొరేటర్లకు నూరిపోస్తూ వచ్చారు. ఇక టీడీపీ అధిష్టానం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలని, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఓ వారం రోజుల పాటు షెడ్యూల్ విడుదల చేసింది. దరిమిలా.. జీవీఎంసీపై విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు, అధిష్టానం ఆదేశాలను అనుసరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పల్లా భావించారు. ఆ మేరకు శనివారం రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ కార్పొరేటర్లు, నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. కానీ సదరు సమావేశానికి ముగ్గురే ముగ్గురు కార్పొరేటర్లు హాజరయ్యారు. నలుగురు కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో నిజంగా లోపాలుంటే ఎత్తి చూపాలి కానీ చీటీకి మాటికీ విమర్శలు, నిందారోపణలు చేస్తే ప్రజల్లో పలుచన అయిపోతామని ఓ సీనియర్ కార్పొరేటర్ చెప్పినా వినిపించుకోకుండా మీటింగ్ పెట్టారని అంటున్నారు. అందుకే ఆ మీటింగ్‌ను చాలా ’లైట్’ తీసుకున్నామని టీడీపీ నేత ఒకరు చెప్పుకొచ్చారు. అడ్డగోలుగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టేది లేదని తెగేసి చెప్పినట్టు స్పష్టం చేశారు. సమన్వయకర్తను పల్లా ఎలా నియమిస్తారు వాస్తవానికి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలను నియమించే బాధ్యత టీడీపీ అధిష్టానానిదే. కానీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా పల్లా శ్రీనివాసరావు తన మేనల్లుడైన ప్రసాదుల శ్రీనివాస్‌ను నియమించుకోవడంపై ఆ పార్టీలోనే వివాదం రేగుతోంది. పార్టీ అధిష్టానానికి సంబంధం లేకుండా ఏకపక్షంగా తన బంధువుని గాజువాక సమన్వయకర్తగా నియమించుకోవడం పల్లా ఏకపక్ష ధోరణికి పరాకాష్ట అని టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు. చదవండి: వలపు వల.. బెజవాడలో మాయలేడీ మోసాలు టీడీపీ నేత సోమిరెడ్డిపై కేసు నమోదు -
సాక్షి ఎఫెక్ట్: అక్రమాల కోటలు కూలుతున్నాయ్..
సాక్షి, విశాఖపట్నం: ఆదివారం ఉదయం.. బుల్డోజర్లు కదులుతుంటే.. అక్రమార్కుల గుండెలదిరాయి. అనధికార నిర్మాణాలను జేసీబీలతో కూలగొడుతుంటే.. టీడీపీ నేతల వెన్నులో వణుకుపుట్టింది. అడ్డగోలుగా ఫుట్‌పాత్ ఆక్రమించేసి ఏర్పాటు చేసిన దుకాణాల్ని తొలగిస్తుంటే... కబ్జాదారులకు చెమటలు పట్టాయి. ఐదేళ్ల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు అధికార దర్పం ప్రదర్శించారు. నిబంధనలు మీరి అక్రమాల పునాదులపై అడ్డగోలుగా నిర్మించినవి కొన్నైతే.. స్థలాలు కబ్జా చేసి దర్జాగా కట్టిన కోటలు ఇంకొన్ని.. వెరసి టీడీపీ నేతల దాష్టీకాలపై అధికారులు పంజా విసిరారు. ‘సాక్షి’ దినపత్రికలో వరుసగా ప్రచురితమవుతున్న తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాల సిత్రాలు.. నగరంలో సంచలనంగా మారాయి. పల్లా ఆక్రమణలకు మాస్టర్‌ప్లాన్ రోడ్డు చిన్నబోయి అక్రమాల కంచెలో ఇరుక్కుపోయింది. ఇప్పుడా కబ్జా కంచెను కత్తిరించేశారు. ప్లాన్‌కు విరుద్ధంగా చేపడుతున్న అడ్డగోలు నిర్మాణాన్ని జీవీఎంసీ పెకలించేసింది. మరోవైపు వెలగపూడి బ్యాచ్ ఫుట్‌పాత్ ఆక్రమణలపైనా జీవీఎంసీ ఉక్కుపాదం మోపింది. రెండు కిలోమీటర్ల వ్యవధిలో ఏకంగా 70 దుకాణాలను ఫుట్‌పాత్‌లపైనే ఏర్పాటు చేసి దందా సాగించిన పచ్చ రాబందుల రెక్కలు విరిచేశారు. పల్లా అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ కొరడా గాజువాక: మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని కూలి్చవేశారు. దీనిపై తొలుత కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నప్పటికీ సంబంధిత, అధికారులు, పోలీసులు చొరవ తీసుకోవడంతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది తమ పని పూర్తిచేశారు. గాజువాకకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాతగాజువాక జంక్షన్‌లోని 1033 చదరపు గజాల (864.33 చదరపు మీటర్ల) స్థలంలో ఒక వాణిజ్య సముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. 227.84 చదరపు మీటర్ల వరకు రోడ్డు విస్తరించి ఉంది. దీంతో ఆయనకు 636.49 చదరపు మీటర్లు మిగిలింది. ఇందులో నిబంధనల ప్రకారం మినహాయింపులు పోనూ 221.45 చదరపు మీటర్ల స్థలంలో ఈ సముదాయ నిర్మాణానికి జీవీఎంసీ నుంచి అనుమతులు పొందారు. సెల్లార్+జి+4 భవన నిర్మాణానికి అనుమతి పొందగా, ప్రస్తు తం సెల్లార్+జి+1 అంతస్తుల శ్లాబులు పూర్తిచేశారు. అయితే అనుమతులకు విరుద్ధంగా నిర్మా ణం సాగుతోందని జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో పరిశీలించిన అధికారులు నిజమేనని నిర్ధారించారు. ఈ నిర్మాణంలో మాస్టర్ ప్లాన్ రోడ్లో 25.46 చదరపు మీటర్ల ఏరియా కూడా ఆక్రమణకు గురవడంతోపాటు సెట్ బ్యాక్లను కూడా ఉంచలేదని గుర్తించారు. ఒక అంతస్తుకు 221.45 చదరపు మీటర్ల అనుమతి పొందగా 369.86 చదరపు మీటర్ల చొప్పున నిర్మాణం సాగిస్తున్నట్టు నిర్ధారించారు. ఒక్కో అంతస్తుకు 148.41 చదరపు మీటర్ల చొప్పున అదనపు భాగాన్ని నిర్మిస్తున్నట్టు గుర్తించిన అధికారులు అదనంగా చేపట్టిన నిర్మాణాన్ని ఆదివారం తొలగించారు. తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు అదనపు నిర్మాణాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని తొలగింపును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తాను అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టానంటూ టౌన్‌ప్లానింగ్ అధికారి నరేంద్రనాథ్‌రెడ్డి తదితరులతో వాదనకు దిగారు. దీంతో వారు మాస్టర్ ప్లాన్ రోడ్డు, సెట్ బ్యాక్‌లు లేకపోవడం, అనుమతి పొందినదానికంటే అదనంగా నిర్మించడం తదితర విషయాలను వివరించారు. గాజువాక పోలీసుల సూచన మేరకు అక్కడి నుంచి పల్లా శ్రీనివాసరావు వెళ్లిపోవడంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు అనధికార నిర్మాణాన్ని తొలగించారు. ఈ వ్యవహారం పల్లా మీడియాతో మాట్లాడారు. తనకు హైకోర్టులో ఊరట లభిస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జీవీఎంసీ అధికారులు తన భవనాన్ని తొలగించడం అన్యాయమన్నారు. వెలగపూడి ‘దుకాణాలు’ క్లోజ్.. కొమ్మాది (భీమిలి): ప్రశాంత విశాఖ నగరంపై దందాల సంతకం చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి..అధికారాన్ని అడ్డంపెట్టుకొని విషపు సంస్కృతిని వ్యాపింపజేశారు. తూర్పు నియోజకవర్గంలో మొదలుపెట్టి.. భీమిలి నియోజకవర్గంలోనూ పాగా వేశారు. ఆక్రమణల పర్వాన్ని అడ్డగోలుగా సాగించి ఫుట్‌పాత్‌లను సైతం మింగేశారు. అనుచరులకు నచ్చిన చోట ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణాలు పెట్టించేసి దందా సాగించారు. దుకాణాలను తొలగిస్తున్న జేసీబీ.. అడ్డగోలుగా 70 దుకాణాలు.. జీవీఎంసీ 8వ వార్డు గీతం కాలేజీ డౌన్ నుంచి చిన్న రుషికొండ మీదుగా పెద్ద రుషికొండ వరకు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 దుకాణాలు అడ్డగోలుగా పెట్టించారు. సుమారు రెండు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్న ఈ ఆక్రమణల్లో వెలసిన ఒక్కో దుకాణం నుంచి ఏడాదికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేసేవారు. ‘సాక్షి’ కథనాలతో బ్రేక్! అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానన్న ధైర్యంతో ఆక్రమణల పర్వం కొనసాగించాలనుకున్న వెలగపూడి బ్యాచ్ ఆగడాలకు ‘సాక్షి’ వరుస కథనాలు బ్రేక్ వేశాయి. సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలకు జీవీఎంసీ అధికారులు స్పందిస్తూ వెలగపూడి దుకాణాలను బంద్ చేయించారు. మూడు రోజులుగా ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగిస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు వెలగపూడి అండ్ కో ఆక్రమించేసుకున్న బీచ్‌రోడ్డు ఫుట్‌పాత్‌లపై చర్యలకు ఉపక్రమించారు. రైట్ టు వాక్ పేరుతో ఆక్రమణల తొలగింపు బీచ్‌రోడ్ వెంబడి ఫుట్‌పాత్‌లపై వెలగపూడి, టీడీపీ అనుచరులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న ఫుడ్‌స్టాళ్లు, దుకాణాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆదివారం తొలగించారు. తెల్లవారు జామున 5 గంటల నుంచి పోలీసు బందోబస్తు నడుమ 70 బడ్డీలను తొలగించారు. ఫుట్‌పాత్‌లను కేవలం పాదచారులకు మాత్రమే వినియోగించేలా జీవీఎంసీ నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం ‘రైట్ టు వాక్’ పేరుతో ఆక్రమణలను తొలగిస్తున్నట్టు జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ డీసీపీ రాంబాబు వెల్లడించారు. దీనికితోడు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ బీచ్ రోడ్డు విస్తరణ, సుందరీకరణ పనులు త్వరలోనే చేపట్టనున్న నేపథ్యంలో కమిషనర్ ఆదేశాల మేరకు తాత్కాలిక ఆక్రమణలను తొలగిస్తున్నామని ఆయన వివరించారు. ఆక్రమణదారుల ఆందోళన.. ఫుట్‌పాత్‌పై అక్రమంగా వెలసిన బడ్డీల తొలగింపునకు నిరసనగా ఫుట్‌పాత్ ఆక్రమణదారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బడ్డీలను తొలగిస్తున్నారని, కనీసం బడ్డీల్లోని సామగ్రిని తీసుకునే సమయం ఇవ్వనదున తీవ్రంగా నష్టం పోతున్నామని వాపోయారు. వీరితో టీడీపీ కార్యకర్తలు కలిసిపోయి గందరగోళం సృష్టించేందుకు ప్రయతి్నంచారు. పీఎంపాలెం సీఐ రవికుమార్ ఆక్రమణదారులతో మాట్లాడి సామాన్లు తీసుకెళ్లేందుకు సమయం ఇచ్చారు. వారంతా దుకాణాల్లోని సామగ్రిని తీసుకెళ్లిపోయారు. అనంతరం షాపుల తొలగింపు ప్రక్రియను సాయంత్రం వరకూ నిర్వహించారు. టౌన్‌ప్లానింగ్ టీపీవోలు రఘునాథరావు, ప్రసాద్ పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బడ్డీలను తొలగించారు. చదవండి: మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా అక్రమ నిర్మాణం కూల్చివేత
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని విశాఖ మహానగర పాలకసంస్థ (జీవీఎంసీ) అధికారులు ఆదివారం కూల్చివేశారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆక్రమణలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన జీవీఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పాత గాజువాక జంక్షన్‌లోని 1,033 చదరపు గజాల స్థలంలో ఒక వాణిజ్య సముదాయ నిర్మాణానికి నిబంధనల ప్రకారం మినహాయింపులు పోను 221.45 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించేందుకు జీవీఎంసీ నుంచి అనుమతులు పొందారు. సెల్లార్+జీ+4 భవన నిర్మాణానికి అనుమతి పొందిన ఆయన ప్రస్తుతం సెల్లార్+జీ+1 అంతస్తులకు శ్లాబులను పూర్తిచేశారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం సాగుతుండటంతో.. పరిశీలించిన అధికారులు నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. మాస్టర్‌ప్లాన్ రోడ్డును సైతం ఆక్రమించి ఎలాంటి సెట్బ్యాక్లు లేకుండా అడ్డగోలుగా కడుతున్నట్లు నిర్ధారించారు. ఆదివారం తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అదనపు నిర్మాణాల్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు కాసేపు హడావుడి చేశారు. పోలీసుల రంగప్రవేశంతో పల్లా అక్కడ నుంచి నిష్క్రమించారు. దీంతో అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు మరోవైపు..నగరంలోని ఫుట్పాత్లన్నింటినీ టీడీపీ నేతలు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు.. ‘రైట్ టు వాక్’ పేరుతో తొలగింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల్లో ఫుట్‌పాత్‌లపై ఉన్న 305 దుకాణాలు తొలగించారు. బీచ్‌రోడ్డులో అడ్డగోలుగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఏర్పాటు చేసిన 70 దుకాణాల్ని జీవీఎంసీ అధికారులు ఆదివారం తొలగించారు. -
టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత..
-
టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత..
సాక్షి, విశాఖపట్నం: పాత గాజువాకలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న మూడంతస్తుల భవనాన్ని అధికారులు తొలగించారు. కూల్చివేత సమయంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, అధికారం అడ్డుపెట్టుకుని నాడు తెలుగుదేశం హయాంలో అడ్డగోలుగా కాజేసిన పల్లా అండ్ కో భూ దందాల లెక్కలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆ కబ్జాల్లో చెరువులు, గయాళు వంటి ప్రభుత్వ భూములు సైతం ఇరుక్కొన్నాయి. చేతికి మట్టి అంటకుండా అందిన కాడికి భూములను మింగేసిన పల్లా అండ్ కో బాగోతంపై ఎట్టకేలకు అధికారులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చదవండి: గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ భూ అక్రమాలు నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ భూ అక్రమాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : అధికారం అడ్డుపెట్టుకుని నాడు తెలుగుదేశం హయాంలో అడ్డగోలుగా కాజేసిన పల్లా అండ్ కో భూ దందాల లెక్కలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆ కబ్జాల్లో చెరువులు, గయాళు వంటి ప్రభుత్వ భూములు సైతం ఇరుక్కొన్నాయి. చేతికి మట్టి అంటకుండా అందిన కాడికి భూములను మింగేసిన పల్లా అండ్ కో బాగోతంపై ఎట్టకేలకు అధికారులు దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూబాగోతంపై గురువారం ‘సాక్షి’లో ‘పల్లా భూదాహం’ శీర్షికన కథనం వెలువడిన సంగతి తెలిసిందే. జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన గాజువాక రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితి చూసి విస్తుబోయారు. శుక్రవారం మరోసారి గ్రౌండ్ సర్వే చేయాలని నిర్ణయించారు. తుంగ్లాం సర్వే నంబర్ 30/12లో 1 ఎకరా 10 సెంట్ల ప్రభుత్వ భూమి, సర్వే నంబర్ 30/13లో 27 సెంట్ల ప్రభుత్వ భూమి, సర్వే నంబర్ 30/15లో 68 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు సర్వే చేయాలని నిర్ణయించారు. తుంగ్లాం సర్వే నంబర్ 34/2లోని 1 ఎకరా 34 సెంట్లు, సర్వే నంబర్ 34/4లోని 13 సెంట్లు, సర్వే నంబర్ 34/2లోని 24 సెంట్ల రస్తా భూమి కబ్జాల్లో కలిసిపోయినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనిపై కూడా సర్వే నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రూ.20 కోట్ల విలువైన భూమిని మింగేసి... గాజువాక పట్టణానికి నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువులు ఆక్రమించారు. అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని గాజువాక సర్వే నంబర్ 87లో ఉన్న వెయ్యి గజాల స్థలంలో తాత్కాలిక దుకాణాలను నిర్మించి అద్దెలకు ఇచ్చారు. హౌస్ కమిటీ పరిధిలోని కొత్తగాజువాక జంక్షన్లో మెయిన్ రోడ్డుకు, హైస్కూల్ రోడ్డుకు కార్నర్లో ఉన్న ఈ భూమి ధర అక్షరాలా రూ.20కోట్లు. ప్రస్తుతం ఇక్కడ బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చదరపు గజం ధర రూ.2 లక్షలు పలుకుతోంది. 20 ఏళ్ల క్రితమే ఈ స్థలంపై కన్నేసిన పల్లా కుటుంబం ఏడేళ్ల కితం టీడీపీ అధికారం చేతిలోకి రాగానే దాన్ని ఆక్రమించి జీవో 301 ప్రకారం క్రమబదీ్ధకరణ కూడా చేసేసుకున్నారు. గాజువాక సర్వే నంబర్ 5/1 లో 714 చదరపు గజాల హౌస్ కమిటీ స్థలానికి తన పేరున, తన సోదరుడి పేరున క్రమబదీ్ధకరణ పట్టాలను పొందడం వివాదాస్పదమైంది. దీనిపై జెన్యూనిటీ సరి్ట ఫికెట్ మంజూరు చేయడానికి సైతం గాజువాక తహసీల్దార్ నిరాకరించారు. దరఖాస్తుదారుల సంతకాలు లేకుండానే ఈ పట్టాలను పొందినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులు వెల్లడించినట్టు తెలిసింది. దీనిపై కూడా ప్రస్తుతం విచారణ చేపట్టినట్టు సమాచారం. రికార్డులు మార్చేసి... దువ్వాడలో మూడున్నర కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి పల్లా బినామీలు రికార్డులు మార్చేసి కబ్జా చేశారు. ఆ భూమి తనదంటూ కోర్టుకెక్కిన ఒక వ్యక్తి నుంచి గతంలో భూమిని కాపాడుకున్న రెవెన్యూ అధికారులే టీడీపీ హయాంలో పల్లా బినామీలకు అప్పనంగా అప్పగించారు. కూర్మన్నపాలెం సర్వే నంబర్ 8/6లో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి తనదంటూ గతంలో ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. తనకు అసైన్మెంట్ పట్టా ఉందని వాదించాడు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ పట్టాను రద్దు చేశామని కోర్టుకు వివరిస్తూ అది ప్రభుత్వ భూమేనని స్పష్టం చేశారు. దీంతో ఆ భూమిని స్వాదీనం చేసుకోవాల్సిందిగా రెవెన్యూ అధికారులకు హైకోర్టు సూచించింది. అప్పట్నుంచీ అధికారులు తమ పర్యవేక్షణతో దాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ క్రమంలో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిలో 42 సెంట్ల భూమిని కోర్టుకెక్కిన వ్యక్తి పేరుమీద మార్చేసి సర్వే నంబర్ 8/6బి పేరుతో ఆన్లైన్లో కూడా పెట్టేశారు. దీంతో సదరు వ్యక్తి తమకు అమ్ముతున్నట్టు స్థానిక పల్లా సన్నిహిత అనుచరుడి పేరుమీద సేల్ అగ్రిమెంట్‌ను కూడా రాయించుకున్నారు. ఇక రిజి్రస్టేషనే తరువాయి అనుకున్న సమయంలో స్థానిక సొసైటీ ప్రతినిధులు అడ్డు తగలడంతో ఆగిపోయింది. అయినప్పటికీ అధికార బలాన్ని ఉపయోగించిన పల్లా ఆ స్థలాన్ని తన ఆ«దీనంలోకి తీసుకున్నారు. కదిలిన రెవెన్యూ యంత్రాంగం అక్కిరెడ్డిపాలెం(గాజువాక): మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ‘భూదాహం’పై గాజువాక రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. తహసీల్దార్ లోకేశ్వరరావు, ఆర్ఐ మంగరాజు, సర్వేయర్ ఎం.వెంకన్న గురువారం జగ్గరాజుపేట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 12, 14, 28తో పాటు 32, 36లో అక్రమణలకు సంబంధించి వివరాలు సేకరించారు. సర్వే నంబర్ 12లో ఎల్అండ్టీ సంస్థ కాంట్రాక్ట్ పనులు చేపడుతున్న ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించారు. ‘‘సర్వే నంబర్లు 12, 14, 28కు సంబంధించి రికార్డులను బయటకు తీస్తాం.. ఆక్రమణలు జరిగినట్లు రుజువైతే.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని తహసీల్దార్ లోకేశ్వరరావు తెలిపారు. -
గాజువాకలో టీడీపీ, జనసేన కుమ్మక్కు
సాక్షి, గాజువాక: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేస్తోన్న గాజువాక నియోజకవర్గంలో టీడీపీ, జనసేనలు కుమ్మక్కు అయ్యాయి. పవన్ కల్యాణ్‌ను గెలిపించడానికి మరోసారి పచ్చ కుట్ర జరుగుతోంది. పవన్ కల్యాణ్‌ను గెలిపించడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను బలి పశువు చేస్తున్నారంటూ పల్లా శ్రీనివాస రావు మదనపడిపోతున్నారు. గాజువాకలో ప్రచారానికి రాకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మెలికలు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. బాబు ప్రచారానికి రాకపోతే ఎలా అని గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస రావు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న హర్షవర్ధన్‌తో కలిసి పల్లా శ్రీనివాస రావు, చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలిసింది. పవన్ కల్యాణ్ గెలుపు కోసమే చంద్రబాబు గాజువాక ప్రచారానికి రావడం లేదని పల్లా శ్రీనివాస రావు స్పందించినట్లుగా తెలిసింది. తనకు ఎవరు ప్రచారం చేయకపోయినా ఫర్వాలేదని, తన సొంత సైన్యంతోనే గెలుస్తా అంటూ బాబుపై అలిగి వెళ్లినట్లుగా సమాచారం అందింది. పల్లా శ్రీనివాస రావును చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడంతో తెలుగు దేశం కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. -
జెట్టీ నిర్మాణంపై ఉత్తుత్తి హామీ
సాక్షి, గాజువాక: చేపల వేట సాగించడం కోసం జెట్టీ లేకపోవడంతో గంగవరం మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. గంగవరం పోర్టు ప్రహరీ నిర్మాణానికి గ్రామాన్ని ఆనుకొని తీరం ఉండేది. పోర్టు ప్రహరీ తరువాత వారికి జెట్టీ లేకుండా పోయింది. యారాడలో ప్రారంభించిన జెట్టీ నిర్మాణం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. తనను గెలిపిస్తే జెట్టీ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చినా దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా మత్స్యకారులు ఉపాధి లేకుండా మిగిలిపోయారు. ఉపాధి చూపించే వరకు జీవన భృతి కొనసాగించాల్సి ఉన్నప్పటికీ నిలిచిపోయింది. తాను జీవన భృతిని ఇప్పిస్తానని పల్లా ఇచ్చిన హామీ గొంగలి సామెతను తలపించింది. దీనిపై ఇటీవల కాలంలో జీవో వచ్చిందంటూ హడావుడి చేయడం తప్ప మత్స్యకారులకు మాత్రం ప్రయోజనం అందలేదు. తమ గ్రామ దేవత పెద్ద అమ్మోరుతల్లిపై ప్రమాణం చేసిన పల్లా శ్రీనివాసరావు గెలిచిన తరువాత తమను మోసం చేశాడని, ఈ సారి ఎన్నికల్లో తమ ఓట్లు అడిగితే తగిన విధంగా స్పందిస్తామంటూ గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పల్లాకు షాక్, టీడీపీకి 2600 మంది రిజైన్
సాక్షి, గాజువాక: ఎన్నికలు సమీపిస్తున్న వేళ గాజువాక నియోజకవర్గంలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. పార్టీలో సీనియర్లకు అవమానం జరుగుతుందంటూ కొద్దిరోజుల క్రితం వ్యతిరేక గళం విప్పిన ఆ పార్టీ అర్బన్ జిల్లా కార్యదర్శి దొడ్డి రమణ నేతృత్వంలో 50వ వార్డుకు చెందిన సుమారు 2,600 మంది కార్యకర్తలు, నాయకులు నిన్న (బుధవారం) మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పార్టీ కోసం 30 ఏళ్లుగా కష్టపడుతున్న తమకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కనీస గుర్తింపు, గౌరవం లేకుండా చేశారంటూ కంటతడి పెట్టుకున్నారు. స్థానికంగా ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలోను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోను, స్థానిక సమస్యలను పరిష్కరించడంలోను, జన్మభూమి కమిటీ సభ్యుల అవినీతి, అక్రమాలను నిరోధించడంలోను, మహిళా కార్యకర్తలను గౌరవించడంలోను ఆయన ఘోరంగా విఫలమయ్యారని అసమ్మతి నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దొడ్డి రమణ మాట్లాడుతూ.. ‘పార్టీని వీడటం చాలా బాధగా ఉంది. ఇన్నేళ్లుగా పార్టీలో ఉన్న మాకు ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించుకోలేదు. ఈ వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడుకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోలేదు’ అని కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీ మహిళ నాయకురాలు మాట్లాడుతూ... ‘నేను రామారావుగారు చనిపోయినప్పుడు ఏడ్చాను. మళ్లీ ఇప్పుడు ఏడుస్తున్నా.. పల్లా ఒంటెద్దు పోకడ వల్లే పార్టీని వీడుతున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గాజువాక నియోజకవర్గంలో సీనియర్లను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వివక్షకు గురి చేస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందినవారిని, సెటిల్మెంట్ బ్యాచ్‌లను మాత్రమే తనతో తిప్పుకొంటున్నారంటూ కొద్దికాలం క్రితం కొంతమంది నాయకులు ఆయనకు ఎదురు తిరిగిన విషయం తెలిసిందే. దొడ్డి రమణ నేతృత్వంలో మొదలైన అసమ్మతి గళం మొత్తం గాజువాక నియోజకవర్గమంతా వ్యాపించింది. దీంతో 58వ వార్డు మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు కూడా అసమ్మతివర్గంలో చేరి ఆ వర్గానికి నాయకత్వం కూడా వహించారు. పల్లా శ్రీనివాసరావును ఓడించడం కోసం తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని నియోజకవర్గమంతా తిరిగి అసమ్మతి నేతలు, కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇటీవల ఆయన నామినేషన్‌కు దొడ్డి రమణ అన్నీ తానై వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి భారీ ర్యాలీతో కోటేశ్వరరావు నామినేషన్ కూడా వేశారు. దీన్ని గమనించిన టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్.. కోటేశ్వరరావుతో పల్లా శ్రీనివాసరావుకు సయోధ్య కుదిర్చారు. ఈ సయోధ్య కోసం కోట్ల రూపాయల్లో డీల్ కుదిర్చారనే ప్రచారం కూడా ఉంది. కోటేశ్వరరావు తమను మోసం చేశాడని అసమ్మతి నాయకులు కొంతమంది బాహాటంగానే విమర్శలు కొనసాగిస్తున్నారు. అసంతృప్తి ఉన్నప్పటికీ టీడీపీని గెలిపించాలనే ఉద్దేశంతో పల్లా శ్రీనివాసరావుకు సహకరించాలని నిర్ణయించుకున్న 50వ వార్డు నాయకులు, కార్యకర్తలు తమ వార్డులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం పల్లాకు కబురు పంపించారు. వార్డులో సుమారు 4వేల మందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి హాజరు కావాల్సిందిగా పల్లాను ఆహ్వానించారు. ‘మీరు వద్దు, మీ కార్యకర్తలు వద్దు.. మీరు వేరే పార్టీతో కుమ్మక్కయ్యారంటూ వారిని తిరస్కరించడంతో మనస్తాపం చెందారు. ఆ వార్డులో చేపడుతున్న కార్యక్రమాలకు కూడా వారిని ఆహ్వానించకపోవడంతో చివరకు రాజీనామా చేసి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. దీంతో సీనియర్ నాయకులు దొడ్డి రమణ, పాండ్రంగి జయరాజు, దేవుపల్లి సీతారామ్, ప్రభావతి, మంత్రి మంజుల, రమణమ్మ, కరణం సతీష్, గంటిబిల్లి అమ్మోరు, సూద అమ్మోరు, వెల్లుస్వామి, హరిపిల్లి ధనరాజ్, నొల్లి పోలరాజు, కంబాల నూకరాజు, రాజు, కదిరి పెంటారావు, కనకరాజు, వెంకటేష్, కంబాల బాపణయ్య, పెంటారావు తదితర నాయకుల ఆధ్వర్యంలో వార్డు నాయకులు, కార్యకర్తలు బీసీ రోడ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాజీనామాలు చేశారు. అంతకుముందు దొడ్డి రమణ ఇంటి నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఇన్ని వేలమంది రాజీనామా చేయడం టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఎన్నికల సర్వేలో వెనుకబడిన పల్లాపై ఈ పరిణామం మరింత ప్రభావం చూపుతుందని విమర్శకులు పేర్కొంటున్నారు. -
ఎమ్మెల్యే పల్లా.. కబ్జా లీల
ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకనియోజక వర్గాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని ఇచ్చినహామీలను పక్కనపెట్టి భూఅక్రమాల్లో దూసుకుపోతున్నారుఅధికార పార్టీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.మీకు మేము తక్కువ కాదంటూ అతనిఅనుచరులు ఎమ్మెల్యే చూపిన దారిలోఅక్రమాల బాట పట్టారు.రూ.కోట్ల విలువైన భూములనుపక్కా స్కెచ్‌తో అక్రమించి కలిసికొల్లగొట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటేఅధికారాన్ని అడ్డుపెట్టుకునిఅందినంత దోచుకున్నారు. విశాఖపట్నం, గాజువాక: గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కన్ను సర్కారు భూములపై పడింది. పదవిని అడ్డుపెట్టుకొని ఖరీదైన భూములను కబ్జా చేయడం, వివాదాస్పద భూములను రెగ్యులరైజ్ చేసుకోవడం, దారిలేని భూములకు అభివృద్ధి పనుల మాటున రహదారి వేసుకుని దందా సాగిస్తున్నారు. ఈయన అక్రమాలపై అధికారులకు ఫిర్యాదులొచ్చినా, ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నా.. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆక్రమణలపై చర్య తీసుకోవడానికి అధికారులు వెనకడుగు వేస్తున్నారు. వెయ్యి గజాలు దురాక్రమణ : గాజువాక పట్టణానికి నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలాన్నిఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువులు ఆక్రమించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వెయ్యి గజాల స్థలంలో తాత్కాలిక దుకాణాలను నిర్మించి అద్దెలకు ఇచ్చారు. కొత్తగాజువాక జంక్షన్లో మెయిన్ రోడ్డుకు, హైస్కూల్ రోడ్డుకు కార్నర్లో ఉన్న ఈ భూమి ధర అక్షరాలా రూ.20 కోట్లు. ప్రస్తుతం ఇక్కడ బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చదరపు గజం ధర రూ.2లక్షలు పలుకుతోంది. ఈ విలువైన స్థలంపై కన్నేసిన పల్లా కుటుంబం అధికారం చేతిలోకి రాగానే దాన్ని ఆక్రమించి జీవో 301 ప్రకారం క్రమబద్ధీకరణ కూడా చేసేసుకున్నారు. 20 ఏళ్ల కిందటే కన్ను గాజువాక సర్వే నంబర్ 87లో ఉన్న ఈ భూమిపై ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం, అతడి సమీప కుటుంబ సభ్యులు 20 ఏళ్ల కిందటే కన్నేశారు. అందులో నిర్మాణానికి ఉపక్రమించడంతో అప్పటి రెవెన్యూ అధికారులు అడ్డుకొన్నారు. అప్పటికే గాజువాక భూములపై 1995లో అప్పటి ముఖ్య మంత్రి ఎన్.టి.రామారావు హౌస్ కమిటీ ఏర్పాటు చేయడంతో ఈ విషయం కమిటీ దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణకు రావాల్సిందిగా కమిటీ చైర్మన్ అప్పట్లో పల్లా కుటుంబాన్ని ఆదేశించారు. సింహాచలంతోపాటు అతడి ఇద్దరు సోదరులు తాము ఆ స్థలాన్ని ఒక్కొక్కరు 330 చదరపు గజాల చొప్పున కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లను కమిటీ చైర్మన్‌కు చూపించారు. డాక్యుమెంట్లను పరిశీలించిన హౌస్ కమిటీ డాక్యుమెంట్లలో సర్వే నంబర్‌కు, స్థలానికి ఎలాంటి సంబంధం లేదంటూ పల్లా కుటుంబ సభ్యుల వాదనను కొట్టేసింది. ఆ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా అప్పటి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా వేశారు. హైకోర్టులో చుక్కెదురైనా.. ఆక్రమిత భూమి వ్యవహారంలో వ్యతిరేకంగా నిర్ణ యం రావడంతో హైకోర్టుకు వెళ్లిన పల్లా కుటుం బ సభ్యులు హైకోర్టు ఆశ్రయించారు. అక్కడ కూడా చుక్కెదురైంది. 2014లో పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థలంపై మళ్లీ పావులు కదిపారు. స్థానిక రెవెన్యూ అధికా రుల అండతో స్థలాన్ని కబ్జా చేసి తాత్కాలిక దుకా ణాలు నిర్మించారు. గాజువాక హౌస్ కమిటీ భూ ముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 301 ప్రకారం సంబంధిత వెయ్యి గజాల స్థలానికి క్రమబద్ధీకరణ పట్టాలను తీసుకున్నారు. నిర్వాసితులకు స్థలాల వెనుకఅసలు కథ ఇదేనా? దారీతెన్నూలేని తన భూమికి రహదారి వేసుకోవడం కోసం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఏపీఐఐసీ నిర్వాసితుల స్థలాల సమస్యను తెరపైకి తెచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటలో ఎమ్మెల్యే కుటుంబానికి సుమారు 25 ఎకరాల భూమి ఉంది. అందులో 7.5 ఎకరాలను గతంలోనే విక్రయించగా, మరికొంత భూమి ఓ కార్పొరేట్ సంస్థకు లీజుకిచ్చినట్టు సమాచారం. ఇంకా మిగిలి ఉన్న భూమికి రహదారి సౌకర్యం లేకపోవడంతో దానివైపు ఎవరూ చూడటం లేదు. ఈ నేపథ్యంలోనే నాలుగు గ్రామాల ఏపీఐఐసీ నిర్వాసితులకు కేటాయించాల్సిన ఇళ్ల స్థలాల సమస్యను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెరపైకి తెచ్చినట్టు చెబుతున్నారు. ఫకీర్‌తక్యా, వడ్లపూడి, గొల్లజగ్గరాజుపేట, తుంగ్లాం గ్రామాలకు చెందిన ఏపీఐఐసీ నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కోసం గతంలో ఐదెకరాల భూమిని కేటాయించారు. అప్పటికి 550 మంది ఉన్న నిర్వాసితుల సంఖ్యను ఇప్పుడు 750కి పెంచి ప్రభుత్వం నుంచి అదనంగా పదెకరాల స్థలాన్ని కేటాయించే విధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు ఆ 15 ఎకరాల్లో లే అవుట్ వేసి నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను ఇస్తే తన భూమికి రహదారి వేసుకోవచ్చునని భావించిన పల్లా ఆగమేఘాలపై ఆ పని మొదలు పెట్టించారు. తన అభివృద్ధి నిధుల నుంచి రూ.40 లక్షలు మంజూరు చేసి లే అవుట్ పనులకు ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. తద్వారా తన భూమికి రహదారి ఏర్పాటు చేసుకోవడానికి మార్గం సుగమం చేసుకున్నారు. బినామీతో 42 సెంట్ల ప్రభుత్వభూమి హాంఫట్ దువ్వాడలో మూడున్నర కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి ఎమ్మెల్యే బినామీలు రికార్డులు మార్చేసి కబ్జా చేశారు. ఆ భూమి తనదంటూ కోర్టుకెక్కిన ఓ వ్యక్తి నుంచి భూమిని కాపాడుకున్న రెవెన్యూ అధికారులే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధికి పల్లెంలో పెట్టి అప్పగించారు. ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి పేరుతో దాన్ని కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ కూడా జరిపోయింది. ఆ భూమిపై తమకు కూడా హక్కులున్నాయంటూ స్థానికంగా ఉన్న ఓ సొసైటీ ప్రతినిధులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే అందులో షెడ్లు నిర్మించడంతో విషయం వెలుగు చూసింది. గాజువాక మండలం కూర్మన్నపాలెం సర్వే నంబర్ 8/6లో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి తనదంటూ గతంలో ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. తనకు అసైన్మెంట్ పట్టా ఉందని వాదించాడు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ పట్టాను ఏనాడో రద్దు చేశామని కోర్టుకు వివరిస్తూ అది ప్రభుత్వ భూమేనని స్పష్టం చేశారు. దీంతో ఆ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా రెవెన్యూ అధికారులకు హైకోర్టు సూచించింది. అప్పట్నుంచీ అధికారులు తమ పర్యవేక్షణతో దాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ క్రమంలో అదే వ్యక్తి గాజువాకలోని అధికార పార్టీకి చెందిన కీలకనేతను ఆశ్రయించాడు. దీంతో ఆ స్థలాన్ని అప్పనంగా కొట్టేద్దామని స్కెచ్ వేసిన సదరు నేత రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేశాడు. 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిలో 42 సెంట్ల భూమిని కోర్టుకెక్కిన వ్యక్తి పేరుమీద మార్చేసి సర్వే నంబర్ 8/6బి పేరుతో ఆన్లైన్లో కూడా పెట్టేశారు. దీంతో సదరు వ్యక్తి తమకు అమ్ముతున్నట్టు స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు గాంధీ పేరుమీద సేల్ ఎగ్రిమెంట్‌ను కూడా రాయించుకున్నారు. ఇక రిజిస్ట్రేషనే తరువాయి అనుకున్న సమయంలో స్థానిక సొసైటీ ప్రతినిధులు అడ్డు తగలడంతో ఆగిపోయింది. అయినప్పటికీ అధికార బలాన్ని ఉపయోగించి అగ్రిమెంట్ రాసి ఇచ్చిన వ్యక్తితోనే అందులో షెడ్ల వేయించి స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. -
గాజువాక ఎమ్మెల్యేకు పరాభవం
విశాఖపట్నం, గాజువాక: టీడీపీ ప్రదర్శించిన విగ్రహ రాజకీయానికి జీవీఎంసీ అధికారులు చెక్ చెప్పారు. టీడీపీ నాయకుడు పులి వెంకట రమణారెడ్డి తండ్రి, ఉక్కు నిర్వాసిత నాయకుడు భూలోకరెడ్డి విగ్రహాన్ని పెదగంట్యాడలో ఏర్పాటు చేస్తున్న సమయంలో జీవీఎంసీ అధికారులు అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి స్వయంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వచ్చి అధికారులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. తాను లేఖ ఇస్తానని, విగ్రహ ఏర్పాటుకు అనుమతించాలని ఎమ్మెల్యే కోరినా ‘ఆ విషయం ఉన్నతాధికారులతో మాట్లాడుకోండ’ని చెప్పడంతో చేసేదిలేక వెనుదిరిగారు. పెదగంట్యాడ జంక్షన్ బీసీ రోడ్డులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గాజువాక మున్సిపాలిటీ పాలకవర్గం నిర్ణయించి శంకుస్థాపన కూడా చేసింది. విగ్రహ ఏర్పాటు జాప్యం కావడంతో అదే స్థలంలో భూలోకరెడ్డి విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు పదేళ్ల క్రితం రాత్రికి రాత్రే పెట్టేశారు. దీనిపై దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో ఆ విగ్రహానికి అధికారులు ముసుగు వేసేశారు. విగ్రహాన్ని అక్కడ్నుంచి తొలగించాలని, అంబేడ్కర్ విగ్రహమే ఉండాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టలేకపోయారు. ఇదిలా ఉంటే కొంతమంది దుండగులు పెదగంట్యాడ ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి చెవులు, ముక్కు తొలగించి ఇటీవల ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆందోళనకు దిగిన దళితులకు అన్ని వర్గాలు, రాజకీయ పార్టీల నుంచి సంఘీభావం లభించింది. అయితే ఆ సానుభూతిని తనవైపు తిప్పుకోవాలని ఎమ్మెల్యే భావించి, ఆందోళన విరమిస్తే న్యాయం చేస్తానని చెప్పారు. భూలోకరెడ్డి విగ్రహాన్ని తొలగించి అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆందోళన విరమిస్తామని వారు తెగేసి చెప్పారు. దీంతో పులి వెంకట రమణారెడ్డితో చర్చించిన ఎమ్మెల్యే.. భూలోకరెడ్డి విగ్రహాన్ని అక్కడ్నుంచి తొలగించి, నిర్వాసిత భవనం వద్ద ఏర్పాటు చేసుకొనేందుకు ఒప్పించారు. దగ్గరుండి ఆ విగ్రహాన్ని తొలగించి నిర్వాసిత భవనం వద్దకు తరలించారు. దాన్ని సోమవారం ఏర్పాటు చేస్తుండగా అక్కడికి చేరుకున్న జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీదేవి అడ్డుకున్నారు. కొత్తగా విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే పల్లా అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ ఏసీపీ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎంత ప్రయత్నించినా అధికారులు ససేమిరా అనడంతో చేసేది లేక ఎమ్మెల్యే వెనుదిరిగారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చినా చర్యలు చేపట్టకపోవడం చర్చనీయాంశమైంది. భూలోకరెడ్డి విగ్రహాన్ని మూడ్రోజుల క్రితం తొలగించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్యే మాట మార్చారని దళితవర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసిన తరువాతే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆయన చెబుతున్నట్టు పేర్కొంటున్నారు. ఈ ఉదంతంతో అటు టీడీపీ శ్రేణుల్లోను, ఇటు దళితవర్గాల్లోను ఎమ్మెల్యే పరువు పోగొట్టుకున్నారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. -
గంటా సీట్ల తంటా
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుతో తెలుగుదేశం పార్టీలో కల్లోలం రేగుతోంది. పూటకో నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానంటూ ఆయన చెప్పడంతో పార్టీ అధిష్టానం తల పట్టుకుంటోంది. ఆయన రాక పార్టీకి బలుపుగా మారుతుందనుకుంటే.. అదంతా.. వాపేనని తేటతెల్లమవుతోంది. తనను నమ్ముకున్న సహచరులను ఇప్పటికే నట్టేట ముంచిన గంటా తీరు ఇప్పుడు జిల్లాలో పార్టీని కూడా అధోగతి పాల్జేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సీటు వ్యవహారం తేలక.. మిగిలిన స్థానాలను కూడా ఎవరికీ కేటాయించలేని పరిస్థితి పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి పల్లా శ్రీనివాసరావు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ ఆశలూ అడియాశలయ్యాయి. పార్టీ అధిష్టానం గంటాను విశాఖ లోక్‌సభ బరిలో దించాల న్న ప్రతిపాదనలు చేయడం.. అదే సమయంలో వైఎస్సార్ సీపీ నుంచి ఈ స్థానంలో షర్మిల బరిలో నిలుస్తారన్న వార్తల తో.. అదే జరిగితే తనకు డిపాజిట్లు కూడా దక్కవన్న భయం తో గంటా ససేమిరా అన్నట్టు తెలిసింది. అందుకే ఈ స్థానా న్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించినట్టు సమాచారం. వీటి తర్వాత పెందుర్తిపై కూడా కాస్త మనసుపడ్డారు. అదీ కుదిరేది కాదని తేలడంతో.. తాజాగా ఆయన దృష్టి భీమిలిపై పడింది. ఇదే స్థానాన్ని ఆ పార్టీ సీనియర్ నేత ఎం.వి.వి.ఎస్.మూర్తి కూడా ఆశిస్తుండడం.. గంటాకు ఆటంకంగా మారింది. గ్రామీణ జిల్లాలో ఏదో ఒక నియోజక వర్గం నుంచి బరిలో నిలుద్దామన్నా.. అక్కడ గంటాకు భరోసా ఇచ్చే కనీస క్యాడర్ కూడా దొరకని పరిస్థితి. దీంతో గంటా తన నిర్ణయాన్ని ఇప్పటికీ వెల్లడించలేకపోతున్నారు. అధినేతకూ తలనొప్పి! గంటా సీటు కేటాయింపు వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా తలనొప్పిగా మారిందని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఇప్పటికే అధినేత నుంచి పలుమార్లు గంటాకు ఫోన్ చేసినా ఆయన స్పష్టం చేయలేదని పేర్కొంటున్నారు. గంటా స్థానం తేల్చాకే మిగిలిన స్థానాలు ఖరారయ్యే అవకాశం ఉండడంతో సొంత పార్టీ నేతల నుంచి గంటా తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన్ని నమ్ముకుని పార్టీలోకి వచ్చిన చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు స్థానాలు ఎలానూ గల్లంతవడం, కన్నబాబు పరిస్థితి కూడా అదే తీరున ఉండడంతో.. భీమిలిని ఆశిస్తోన్న అవంతి శ్రీనివాస్‌కూ గంటా తీరుతో చిర్రెత్తుకొస్తోంది. తన స్థానానికి ఎసరెడితే.. తానేం చేయగలనో.. ఎన్నికల్లో నిరూపిస్తానంటూ.. అవంతి బాహాటంగానే తన అనుచరుల వద్ద చెప్తున్నట్టు సమాచారం. దీంతో గంటా ఏ స్థానం నుంచి బరిలో నిలుస్తారన్నది భేతాళ ప్రశ్నగానే మారుతోంది.