
బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా టెమర్
బ్రెజిల్ దేశాధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ పదవీచ్యుతురాలైన నేపథ్యంలో దేశ నూతన అధ్యక్షుడిగా పీఎండీబీ పార్టీకి చెందిన మిచెల్ టెమర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
బ్రెజిల్: బ్రెజిల్ దేశాధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ పదవీచ్యుతురాలైన నేపథ్యంలో దేశ నూతన అధ్యక్షుడిగా పీఎండీబీ పార్టీకి చెందిన మిచెల్ టెమర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం బ్రెజిల్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెంక్కించగల సమర్థుడిగా మిచెల్ టెమర్‌ను సెనేటర్లు నమ్ముతున్నారు. తనను తప్పించడం వెనుక విపక్షాల కుట్ర దాగుందని రౌసెఫ్ వ్యాఖ్యానించారు.