
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నేడు పగ్గాలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది.
కార్యాలయానికి వెళ్లే దారి వెంట.. పార్టీ ఆఫీస్ బయట రాహుల్ గాంధీ పోస్టర్లు, హోర్డింగ్‌లు వెలిశాయి. నిన్నటి నుంచే యువ, వివిధ విభాగాల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యాక్రమాలతో సందడి నెలకొంది. ఇక రాహుల్ గాంధీ ప్రమాణస్వీకార నేపథ్యంలో పలువురు నేతలు ఢిల్లీకి క్యూ కట్టడంతో కోలాహలం నెలకొంది. 2014 ఎన్నికల తర్వాత కుదేలైన పార్టీని తిరిగి పుంజుకునేలా చేస్తాడని సీనియర్లతోసహా అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ మీడియాతో మాట్లాడారు. ‘‘రాహుల్ ఏకగ్రీవ ఎంపిక.. లక్షలాది మంది కార్యకర్తల కోరిక. 2019లో బీజేపీకి పోటీ పార్టీ కాంగ్రెస్ మాత్రమే. రాహుల్ గాంధీ నేతృత్వంలో మరింత శక్తితో ముందుకు సాగుతుంది’’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Visuals from outside Congress HQ in Delhi; sweets brought in, supporters continue to celebrate & raise slogans ahead of Rahul Gandhi's takeover as party President. pic.twitter.com/e62Fgumr7t
— ANI (@ANI) December 16, 2017




