
ఉపాధ్యక్షుడిగా మాజీ అధ్యక్షుడు విడొడొ కుమారుడు రకా
జకార్తా: ఇండోనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబొవో సుబియాంతో(73) ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో సుబియాంతో తోపాటు ఉపాధ్యక్షుడిగా గిబ్రాన్ రకబుమింగ్ రకా(37) ప్రమాణం చేశారు.
మాజీ అధ్యక్షుడు విడొడొ కుమారుడైన రకా సుకార్తా మేయర్‌గా సైతం పనిచేశారు. ప్రమాణ స్వీకారం ఓపెన్ టాప్ వ్యాన్‌లో వచ్చిన సుబియాంతోకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలతో పార్లమెంట్ భవనం, అధ్యక్ష భవనం రహదారి కిక్కిరిసింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. సుబియాంతో ఖురాన్ సాక్షిగా ప్రమాణం చేశారు.