ఖర్గేకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికా ర్జునఖర్గేను కోరారు. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీలో ఖర్గేతో రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీకి కొత్త «అధ్యక్షుడిగా ఎవరిని నియ మించినా కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ చెప్పినట్టు సమాచారం.
త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర ఆంశాలపైనా చర్చించినట్టు తెలిసింది. పదవుల భర్తీల్లో భాగంగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా అవకాశా లపైనా మంతనాలు జరిపినట్టు సమాచారం. రైతు రుణమా ఫీ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించనున్న కృతజ్ఞత సభ, సచివాలయంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై కూడా చర్చించి, ఆహ్వానించినట్టు తెలిసింది. అనంతరం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధానకార్యదర్శి కేసీ.వేణుగోపాల్ తోనూ రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
రేవంత్‌తో సింఘ్వీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వీని ప్రకటించాక మొదటిసారి ఉభయులూ సమావేశమయ్యారు. సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఈ నెల 21న నామినేషన్ దాఖలు సహా వివిధ అంశాలపై లోతుగా చర్చించినట్టు అభిషేక్ మను సింఘ్వీ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment