లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్ ఫైల్ ఫోటో
గ్లోబల్ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ కు చెందిన యంగ్ తరంగ్ చేతికి కొత్త పగ్గాలను అందించింది. కంపెనీ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ కుమారుడు, కంపెనీలో ఇప్పటికే కీలక బాధ్యతల్లో ఉన్న ఆదిత్య మిట్టల్(42)కు కొత్తగా ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించింది. యూరప్ గ్రూప్ సీఈవో, సీఎఫ్‌వోగా ఆయన ప్రస్తుత బాధ్యతలకు అదనంగా దీన్ని అప్పగించింది. ఆదిత్యమిట్టల్ ఆర్సెలర్ మిట్టల్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించ నున్నారని లక్సెంబర్గ్ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నియామకం ద్వారా గ్రూప్ అంతటా పెరుగుతున్న ప్రపంచ వ్యూహాత్మక పాత్రను ప్రతిబింబించడంతోపాటు, సంస‍్థ చైర్మన్ అండ్ సీఈవో లక్ష్మీ మిట్టల్‌కు భారీ మద్దతు లభించనుందని పేర్కొంది. యూరప్ కార్యకలాపాల్లో సీఈవోగా బాధ‍్యతల నిర్వహణలో ఆదిత్య తన ప్రతిభను నిరూపించుకున్నారని, గ్రూపు భవిష్యత్ వ్యూహాత్మక దిశను రూపొందించడంలో తనతో పాటు పని చేస్తారని లక్ష్మీ మిట్టల్ ప్రకటించారు.
కాగా ఆర్సెలర్ మిట్టల్ ప్రపంచంలోనే ప్రముఖ ఉక్కు మైనింగ్ కంపెనీ. దాదాపు 60 దేశాల్లో ఉనికితోపాటు, పారిశ్రామింగా 18దేశాల్లో తనదైన ముద్రను కలిగిఉంది. ప్రధాన ప్రపంచ ఉక్కు మార్కెట్లకు ఆటోమోటివ్, నిర్మాణ, గృహ ఉపకరణం , ప్యాకేజింగ్ సహా నాణ్యత ఉక్కును సరఫరా చేస్తుంది. మరోవైపు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్సార్ స్టీల్‌ను కొను గోలు చేయడానికి జపాన్‌కు చెందిన నిప్పన్‌తో జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అర్సెలర్ మిట్టల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment