
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) నూతన అధ్యక్షుడిగా అమరీందర్‌సింగ్ రాజా వారింగ్‌ను పార్టీ అధినేత సోనియా గాంధీ శనివారం నియమించారు. ప్రతాప్‌సింగ్ బాజ్వాను అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష(సీఎల్పీ) కొత్త నాయకుడిగా నియమించారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నవజోత్‌సింగ్ సిద్ధూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత రాజీనామా చేశారు. అమరీందర్‌సింగ్ రాజా వారింగ్ పంజాబ్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment