
న్యూఢిల్లీ: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) నూతన అధ్యక్షుడిగా నీరజ్ కుందన్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ అధ్యక్షబాధ్యతల నుంచి గత ఏడాది అక్టోబర్‌లో వైదొలగిన సంగతి తెల్సిందే. గతంలో ఎన్‌ఎస్‌యూఐ జమ్మూ కశ్మీర్ చీఫ్‌గా పనిచేసిన కుందన్ రెండేళ్ల క్రితం ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి అయ్యారు. ఎలాంటి రాజకీయ వారసత్వంలేని కుందన్ విద్యార్థి కార్యకర్తగా రాజకీయజీవితం ప్రారంభించారు.