సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది నూతన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈమేరకు సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ డా.పిపికె.రామాచార్యులు నూతన ఎమ్మెల్సీల పేర్లను వరుస క్రమంలో పిలవగా శాసన మండలి అధ్యక్షులు మోషేన్ రాజు వారిచే ప్రమాణం చేయించారు.
ఎమ్మెల్సీలుగా కడప స్థానిక సంస్థల నుండి ఎన్నికైన పి.రామసుబ్బా రెడ్డి,నెల్లూరు స్థానిక సంస్థల నుండి మేరిగ(Meriga) మురళీధర్, పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల నుండి కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాధ్, తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుండి కుడిపూడి సూర్యనారాయణ రావు,శ్రీకాకుళం స్థానిక సంస్థల నుండి నర్తు రామారావు, చిత్తూరు స్థానిక సంస్థల నుండి సుబ్రహ్మణ్యం సిఫాయి, కర్నూల్ స్థానిక సంస్థల నుండి డా.ఎ. మధుసూదన్ ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు,రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాద రావు,రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,బిసి సంక్షేమం,సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ,రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామాత్యులు మేరుగు నాగార్జున,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట శాసన సభ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు,రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు,ప్రభుత్వ విప్ జంగా కృష్ణ మూర్తి,మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్,ఎంఎల్ఏ వరప్రసాద్,పలువురు ఎంఎల్సిలు పాల్గొన్నారు.ఇంకా కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి ఓఎస్డి సత్యానారాయణ రావు,శాసన మండలి ఉప కార్యదర్శి విజయ రాజు ఇంకా పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: చంద్రబాబుకు భారీ షాక్..
Comments
Please login to add a commentAdd a comment