
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోయినప్పటికి తానే ముఖ్యమంత్రినని ప్రకటించారు. ప్రమాణస్వీకారోత్సవానికి ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 5న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు దీదీ ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఏడు గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు.
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఏకంగా 213 సీట్లను కైవసం చేసుకుంది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment