
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో దేశ, విదేశీ నేతలు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హజరు కానున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మంత్రులచే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో భారత్ సహా బిమ్స్‌టెక్ సభ్యదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాధినేతలు పాల్గొంటారని అధికారులు తెలిపారు.
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి పాల్గొంటామని నిర్ధారించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. మయన్మార్ అధ్యక్షుడు యువిన్ మైంట్, భూటాన్ ప్రధాని లోటె షెరింగ్‌ల రాక కూడా ఖరారైందని చెప్పారు. ఇక థాయ్‌లాండ్ తరపున ప్రత్యేక రాయబారి గ్రిసాద బూన్‌రాక్ హాజరు కానున్నారు. మరోవైపు మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాధ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment