సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి అధికార పగ్గాలు అందుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అప్పుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు నిధులు సమీకరించుకుంది. ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,400 కోట్ల మేర రుణ సమీక రణ చేసింది.
ఆర్‌బీఐ ఆ«ధ్వర్యంలో సెక్యూరిటీ బాండ్లను వేలం వేయడం ద్వారా ఈ నెల 12న రూ.500 కోట్లు, ఈ నెల 19న రూ. 900 కోట్ల మేర అప్పు తెచ్చుకుంది. ఇందులో రూ. 500 కోట్ల అప్పును 7.70 శాతం వడ్డీకి 15 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించేలా, రూ. 900 కోట్లను 7.58 శాతం వడ్డీకి 18 ఏళ్లలో చెల్లించేలా సమకూర్చుకుంది.
గత ప్రభుత్వ హయాంలోనే రుణ షెడ్యూల్..
వాస్తవానికి బహిరంగ మార్కెట్‌లో రుణాలు తీసుకొనే ప్రక్రియలో భాగంగా ఆర్‌బీఐ ద్వారా బాండ్లను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలలకోసారి షెడ్యూల్ సమర్పిస్తాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికానికి చెందిన షెడ్యూల్‌ను ఆర్‌బీఐ ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ మేరకు డిసెంబర్‌లో రెండు దఫాలుగా ప్రభుత్వం రూ. 1,400 కోట్లు సమకూర్చుకుందని ఆర్థిక వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment