సాక్షి, సిటీబ్యూరో: జలాశయాల పరిరక్షణపై కొత్త సర్కారు దృష్టి పెట్టడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. నగరంలోని వివిధ చెరువులను పరిరక్షించడంతో పాటు వాటి ప్రధాన ఛానళ్ల (ఇన్‌లెట్స్, ఔట్ లెట్స్)ను పటిష్టపర్చాలని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ నగరం, దాని చుట్టుపక్కల్లోని చెరువులు, వాటి డ్రె యిన్ ఛానళ్ల పరిరక్షణకు అధికార యంత్రాంగం న డుం బిగించింది.
ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి జోషి ఆధ్వర్యంలో సోమవా రం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రత్యేకం గా సమావేశమై జలాశయాల సంరక్షణపై సుదీర్ఘం గా చర్చించారు. వివిధ చెరువుల్లో కలిసే ప్రధాన డ్రె యిన్ ఛానల్స్(నాలాలు), వాటికి అనుసంధానంగా గొలుసుకట్టుగా ఉన్న చిన్న ఛానళ్లను సర్వే అఫ్ ఇండియా మ్యాపుపై గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరి జోషి అధికారులను ఆదేశించారు. దీని వల్ల చెరువుల సంరక్షణతో పాటు వాటికి వరదనీటి వాహకాలుగా ఉన్న ఛానళ్లను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధాన చెరువుల ఇన్‌లెట్స్/ఔట్‌లెట్స్ పటిష్టానికి సత్వరం చర్యలు చేపట్టాలని సూచించారు.
తొలిదశలో..
ఆయా చెరువులకు కలిసే డ్రెయిన్ ఛానళ్ల (నాలాల) వివరాలను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో పొందు పర్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. తొలిదశలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 168 చెరువుల వివరాలను మ్యాపుల్లో పొందుపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్క నాలాకు ఇన్‌ఫ్లో ఛానళ్లు ఎన్ని ఉన్నా యో గుర్తించి వాటిని పటిష్టపర్చేందుకు చర్యలు చేపడతారు.
మలిదశలో హెచ్‌ఎండీఏ పరిధిలోని వివిధ చెరువుల ప్రధాన ఛానళ్లను కూడా మ్యాప్‌లో పొం దుపర్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఎన్ని చెరువులు ఉన్నాయన్న దానిపై ఓ ప్రైవేటు ఏజెన్సీతో హెచ్‌ఎండీఏ సర్వే నిర్వహిస్తోంది.
ఇప్పటికే 200 చెరువులకు డీ మార్కేషన్ పూ ర్తి చేసిన సర్వే సంస్థ అందులో 100 చెరువులకు సం బంధించి మ్యాపులు రూపొందించేందుకు డేటాను సిద్ధం చేసింది. మిగతా చెరువుల లెక్కలూ తేల్చాక సంరక్షణ చర్యలపై నివేదిక రూపొందించనుంది. అ యితే, జలాశయాల సంరక్షణకు అవసరమయ్యే ని ధులెలా సమకూర్చుకోవాలన్నది ఇప్పుడు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల మదిని తొలుస్తున్న ప్రశ్న.
గ్రేటర్‌కు ఇక జలసిరి..!
Published Tue, Jun 10 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM
Advertisement
Advertisement