తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డికే పట్టం | Telangana elections Live Updates: Govt Formation Dec 05th Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డికే పట్టం.. అప్‌డేట్స్‌

Published Tue, Dec 5 2023 7:59 AM | Last Updated on Tue, Dec 5 2023 8:19 PM

Telangana elections Live Updates: Govt Formation Dec 05th Updates - Sakshi

Telangana CM Announcement Live Updates

9న తెలంగాణ కాంగ్రెస్‌ కృతజ్ఞత సభ

  • డిసెంబర్‌ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ కృతజ్ఞత సభ
  • అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తెలియజేయనున్న కాంగ్రెస్‌
  • అంతకు ముందే కొలువు దీరనున్న తెలంగాణ కేబినెట్‌
  • డిసెంబర్‌ 7వ తేదీనే ప్రమాణం చేయనున్న రేవంత్‌రెడ్డి
  • రేవంత్‌తో పాటు మరికొందరు మంత్రులుగా కూడా!
  • ఆరు గ్యారెంటీలపై కృతజ్ఞత సభలో కీలక ప్రకటన చేసే అవకాశం


సీనియర్లు సీఎం పదవి ఆశించడం సహజం: పొన్నం కామెంట్స్‌

  • హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ
  • సీఎం పదవిని సీనియర్లు ఆశించడం సహజం
  •  పార్టీ అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఉంటాం
  • ఎన్నికైన ఎమ్మెల్యేలమంతా ఏకవాక్య తీర్మానంతో సీఎం అభ్యర్థి నిర్ణయించే అధికారం అధిష్టానానికి అప్పగించాం
  • అధిష్టాన నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటే కొందరు రాజకీయం చేస్తున్నారు
  • కాంగ్రెస్ లో అప్పుడే డిల్లీ నిర్ణయాలు మొదలయ్యాయని ప్రచారం చేశారు
  • ఏనాడైనా కేసిఆర్ ను ఇలా ప్రశ్నించారా?
  • కేసిఆర్ బీసీలను ఎప్పుడు పట్టించుకోలేదు
  • రేవంత్ రెడ్డిని సీఎంగా నిర్ణయించడం స్వాగతిస్తున్నాం.
  • 7న సీఎంతో పాటు పూర్తిస్థాయి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుంది.
  • మంత్రివర్గంలో నాకు చోటు దక్కొచ్చని అనుకుంటున్నా
     

రేవంత్‌రెడ్డికి ప్రముఖుల శుభాకాంక్షలు

  • తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి
  • ప్రముఖుల స్పందన
  • సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షల వెల్లువ
  • శుభాకాంక్షలు తెలియజేసిన సీనియర్‌ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 
  • రేవంత్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన బండ్ల గణేష్‌

     

రేవంత్‌తో చర్చించాకే మంత్రివర్గ కూర్పు

  • తెలంగాణ మంత్రి వర్గ కూర్పుపై దృష్టిసారించిన కాంగ్రెస్‌ అధిష్టానం
  • ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన రేవంత్‌రెడ్డి
  • ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి అ‍గ్రనేతల్ని వ్యక్తిగతంగా ఆహ్వానించనున్న రేవంత్‌
  • రేపు కూడా ఢిల్లీలోనే రేవంత్‌?
  • రేవంత్‌తో చర్చించాకే మంత్రి వర్గం కూర్పును ఖరారు చేయనున్న హైకమాండ్‌
  • కాంగ్రెస్‌ అధిష్టానం కనుసన్నల్లోనే కీలక పదవులు, నిర్ణయాలు

 
 


మా రేవంత్‌ పటేల్‌ ఇక సీఎం: కొండారెడ్డిపల్లి గ్రామస్తులు

  • సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు ప్రకటన తర్వాత కొండారెడ్డిపల్లి గ్రామంలో సంబురాలు
  • ఢిల్లీకి రాజు అయినా.. తల్లికి కొడుకే: గ్రామస్తులు
  • రేవంత్‌ అప్పటికీ.. ఇప్పటికీ మా మంచి పటేల్‌ : గ్రామస్తులు
  • ఇకపై మా ఊరు కొండారెడ్డిపల్లి కాదు.. సీఎం ఊరు: గ్రామస్తులు 
  • ఎప్పుడు ఊరికి వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు: గ్రామస్తులు



అందరికీ ధన్యవాదాలు: రేవంత్‌రెడ్డి

  • అందరికీ ధన్యవాదాలు తెలిపిన రేవంత్‌రెడ్డి
  • సీఎల్పీ నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు
  • ఎంపిక చేసిన ఖర్గేకు కృతజ్ఞతలు
  • పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ధన్యవాదాలు
  • నాకు మద్దతుగా నిలిచిన సోనియా, రాహుల్‌, ప్రియాంకలకు ధన్యవాదాలు
  • మద్ధతుగా నిలిచిన కాంగ్రెస్‌ పెద్దలందరికీ ధన్యవాదాలు

పాలమూరు గడ్డ నుంచి మరో సీఎం

  • తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి
  • రేవంత్‌ సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌
  • గతంలో హైదరాబాద్‌ స్టేట్‌కు సీఎం(రెండో, ఆఖరి కూడా..)గా పని చేసిన బూర్గుల రామకృష్ణారావు
  • బూర్గుల స్వస్థలం కల్వకుర్తి(ఉమ్మడి మహబూబ్‌నగర్‌)
  • పాలమూరు నుంచి రెండో సీఎంగా ఇప్పుడు రేవంత్‌రెడ్డి

 


ప్రమాణ స్వీకారానికి అగ్రనేతలకు ఆహ్వానం

  • తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి
  • అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేయనున్న రేవంత్‌
  • ఎల్లుండి డిసెంబర్‌ 7వ తేదీన సీఎంగా ప్రమాణం
  • సోనియా, ఖర్గే, రాహుల్‌ గాంధీలతో పాటు పలువురు ఏఐసీసీ నేతలకు రేవంత్‌ ఆహ్వానం

రేవంత్ రెడ్డి గురించి..

  • 1969 నవంబరు 8న జననం
  • అనుముల రేవంత్‌రెడ్డి స్వస్థలం నాగర్‌కర్నూల్(ప్రస్తుతం.. పూర్వపు మహబూబ్‌నగర్‌) జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామం
  • విద్యార్థి దశలో ఏబీవీపీతో అనుబంధం
  • 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం
  • 2007లో స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక
  • 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్  ఎమ్మెల్యేగా గెలుపు
  • 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్
  •  2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌
  • 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా
  •  2017లో  కాంగ్రెస్‌ పార్టీలో చేరిక
  • 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
  • 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి
  • 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం
  •  2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్
  • 2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం
  • 2023 డిసెంబర్‌ 3.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొండగల్‌ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక, కామారెడ్డి నుంచి ఓటమి
  • 2023 డిసెంబర్‌ 5వ తేదీ సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ పేరు ప్రకటించిన కేసీ వేణుగోపాల్‌
  • 2023 డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

  • అధికారికంగా ప్రకటించిన  కాంగ్రెస్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్
  • ఎల్లుండి సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
  • రేవంత్‌ నివాసం దగ్గర భద్రత పెంపు
  • సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక
  • కొత్త సీఎల్పీ నేత ఎంపికపై నిన్న భేటీ జరిగింది: కేసీ వేణుగోపాల్
  • కాంగ్రెస్ విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం

ఢిల్లీ రావాలని రేవంత్‌రెడ్డికి అధిష్టానం పిలుపు

  • అధిష్టానం పిలుపుతో ఢిల్లీ బయల్దేరిన రేవంత్‌రెడ్డి
  • కాసేపట్లో కేసీ వేణుగోపాల్‌ ప్రెస్‌మీట్‌

ఢిల్లీలో ముగిసిన భేటీ

  • ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల భేటీ
  • ముగిసిన భేటీ
  • భట్టి, ఉత్తమ్‌లతో చర్చలు జరిపిన అధిష్టానం
  • చర్చకు హాజరైన డీకే శివకుమార్‌, మాణిక్‌రావ్‌ థాక్రే
  • సీఎం అభ్యర్థి ఎంపికతో పాటు కేబినెట్‌ కూర్పు పైనా చర్చా?
  • అధిష్టాన నిర్ణయంపై ఉత్కంఠ
  • తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌

రేవంత్‌రెడ్డితో సీపీఐ నేతలు భేటీ

  • హోటల్‌ ఎల్లాలో రేవంత్‌రెడ్డితో సీపీఐ నేతలు నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు భేటీ
  • రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాం: కూనంనేని సాంబశివరావు 
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో అభినందనలు తెలిపాం
  • మంత్రివర్గంలో సీపీఐ చేరడం లేదు
  • కాంగ్రెస్ ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన వారికే మా ఓటు
  • సీఎం ఫలానా వ్యక్తి కావాలని సీపీఐ కోరుకోవడం లేదు
  • సీఎం ఎవరనేది నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానం

కాంగ్రెస్‌  ప్రభుత్వానికి కామారెడ్డి ఎమ్మెల్యే హెచ్చరిక

  • ఏడాదికోసారి రేషన్‌, పింఛన్లను అప్‌డేట్‌ చేయాల్సిందే: బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
  • కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందిస్తా
  • ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తా
  • కామారెడ్డిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తా
  • విజయం అందించిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు

ఢిల్లీ: కేసీ వేణుగోపాల్‌ నివాసంలో కీలక భేటీ
►కేసీ వేణుగోపాల్‌తో డీకే శివకుమార్‌, థాక్రే, భట్టి విక్రమార్క సమావేశం

కాంగ్రెస్‌లోనే ఉన్నా.. బయటి నుంచి రాలేదు: ఉత్తమ్‌

  • పార్లమెంట్‌ సమావేశాల కోసం ఢిల్లీకి వచ్చాను
  • కాంగ్రెస్‌ పెద్దలను కలిసి చెప్పాల్సింది చెప్పాను
  • ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను
  • మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నా
  • పార్టీని ఎప్పుడూ వీడలేదు.. బయటి నుంచి రాలేదు
  • నేనూ నా భార్య ఎప్పుడూ క్షేత్రస్థాయిలో పని చేస్తుంటాం
  • నాకిచ్చిన పనిని సమర్థవంతంగా చేస్తుంటా
  • ప్రతీ ఎన్నికలకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి
  • నేను టీపీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌పై ఇంత ప్రజా వ్యతిరేకత లేదు
  • ఇప్పుడు బాగా పెరిగింది
  • అందుకే ఈ ఎన్నికల్లో 70 సీట్ల దాకా వస్తాయి అనుకున్నాం
  • కానీ, 64 దగ్గరే ఆగిపోవడం నిరాశపర్చింది
  • తెలంగాణ ప్రజల్లో గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది
  • ఏది ఏమైనా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాం
  • మీడియాతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు


సీఎం పదవిపై శ్రీధర్‌బాబు కామెంట్స్‌

  • గెలిచిన 64 మందిలో ఎవరైనా సీఎం కావొచ్చు.. శ్రీధర్‌బాబు
  • ఐదుసార్లు నెగ్గాను
  • కానీ, సీఎం అభ్యర్థి విషయం లో అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌

రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ హోటల్ ఎల్లా ముందు పెట్రోల్ పోసుకుని ఓయూ విద్యార్థి నేత ప్రతాప్ రెడ్డి ఆత్మహత్యాయత్నం  

హోటల్ ఎల్లాకు చేరుకున్న సీపీఐ నారాయణ, చాడ వెంకట్ రెడ్డి

  • రేవంత్ రెడ్డితో భేటీ కానున్న సీపీఐ నేతలు..

కాసేపట్లో హైదరాబాద్ బయలుదేరనున్న డీకే 

  • తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై ముగిసిన కసరత్తు
  • మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి బయటికి వచ్చిన డీకే శివకుమార్ , మాణిక్ రావ్ థాకరే
  • అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థిని సీల్డ్ కవర్‌లో తీసుకెళ్తున్న డీకే
  • సాయంత్రం హైదరాబాద్‌లో సీఎల్పీ సమావేశంలో అధిష్టానం నిర్ణయాన్ని వెల్లడించనున్న డీకే

ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలు 

  • కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రుల పంచాయతీ
  • మేమంటే మేము సీఎం అంటున్న సీనియర్ నేతలు
  • రేసులో ఉన్నామంటున్న భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు
  • ఇప్పటికే డీకే , ఠాక్రే తో విడివిడిగా భేటీ అయిన సీనియర్ నేతలు
  • ఢిల్లీ పెద్దలతో లాబీయింగ్ నిర్వహిస్తున్న భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు
     

రేవంత్‌ను సీఎం చేయాలంటూ నినాదాలు

  • గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద కార్యకర్తల హంగామా
  • హోటల్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలు
  • ఆందోళన చేసిన కార్యకర్తలను నిలువరించి బయటికి పంపించిన పోలీసులు

రేవంత్‌ పేరు ఖరారు..?

  • ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం 
  • బయటికి వచ్చిన రాహుల్‌ గాంధీ 
  • సీఎం పదవికి రేవంత్‌ పేరు ఫైనల్‌ అయిందని ప్రచారం
  • కాసేపట్లో అధికారిక ప్రకటన

ఢిల్లీలో కొనసాగుతున్న డీకేఎస్‌, ఖర్గే భేటీ 

  • కాసేపట్లో సీఎం ఫైనల్‌ అయ్యే అవకాశం
  • భేటీలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, ఠాక్రే
  • ప్రత్యేక నివేదిక అందించిన డీకే శివకుమార్‌ 

ఢిల్లీలో వరుస సమావేశాలు

  • ఖర్గే నివాసానికి రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌
  • డీకేతో  సమావేశమైన ఉత్తమ్‌, భట్టి 
  • కాసేపట్లో ఖర్గేతో భేటీ కానున్న డీకే శివకుమార్‌ 

కాసేపట్లో ఖర్గేతో డీకేఎస్‌, ఠాక్రే భేటీ

  • ఏఐసీసీచీఫ్‌తో భేటీ అవనున్న డీకేఎస్‌, ఠాక్రే భేటీ
  • సీఎం పదవిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్‌

డీకేఎస్‌తో ఉత్తమ్‌ భేటీ 

  • డీకే శివకుమార్‌తో ఉత్తమ్‌ కుమార్‌ భేటీ 
  • కాసేపట్లో ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేతో డీకేఎస్‌ సమావేశం
  • ఢిల్లీలోనే ఉన్న భట్టి విక్రమార్క

ఢిల్లీలో ఉత్తమ్‌, భట్టి 

  • ఎంపీ పదవికి రిజైన్‌ చేయనున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
  • ఢిల్లీ చేరుకున్న ఉత్తమ్‌కుమార్‌, భట్టి

ఢిల్లీ:

  • తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది నేడు నిర్ణయిస్తాం
  • మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు

మధ్యాహ్నం సీఎం పేరు వెల్లడి

  • మధ్యాహ్నం సీల్డ్ కవర్‌తో హైదరాబాద్‌కు డీకే శివకుమార్‌ 
  • సీల్డ్ కవర్‌లో ముఖ్యమంత్రి  పేరు 
  • సీఎం పదవిపై ఇవాళ సాయంత్రానికి సస్పెన్స్‌కు తెర

ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్‌ సీనియర్లు

  • ఢిల్లీకి బయలుదేరిన భట్టి విక్రమార్క ,ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • మధ్యాహ్నం ఖర్గేను కలవనున్న ఉత్తమ్ ,భట్టి‌‌ 

12 గంటలకు ఖర్గేతో డీకే శివకుమార్‌ భేటీ

  • మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ కానున్న డీకే శివకుమార్‌
  • తెలంగాణ సీఎం అభ్యర్థి పై చర్చించనున్నఏఐసీసీ పరిశీలకులు
  • ఖర్గేతో భేటీ తర్వాతే తదుపరి కార్యాచరణ

కాంగ్రెస్‌ అధిష్టానం కోర్టులోకి సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం 

  • ఈ అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ సీఎల్పీ ఏకవాక్య తీర్మానం 
  • డీకే శివకుమార్‌ పర్యవేక్షణలో హైదరాబాద్‌లో సమావేశం.. హాజరైన 64 మంది కొత్త ఎమ్మెల్యేలు 
  • అంతకుముందు డీకేతో భట్టి, ఉత్తమ్, దామోదర, రాజగోపాల్, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు భేటీ
  • హడావుడిగా వద్దని, అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి 
  • సీఎల్పీ భేటీ తర్వాత ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడిన పరిశీలకులు 
  • ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్న దానిపై అభిప్రాయ సేకరణ 
  • అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఓకే అన్న ఎమ్మెల్యేలు 
  • ఇంతలో ఢిల్లీకి రావాలంటూ డీకే టీమ్‌కు పిలుపు.. నేడు ఏఐసీసీ పెద్దలతో సమాలోచనలు 
  • ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో భట్టి, ఉత్తమ్‌,  శ్రీధర్‌ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి
  • తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాలు నలుగురు పరిశీలకులు కూడా ఢిల్లీకి
  • సీఎం ఎంపికపై నిర్ణయం.. తర్వాత సీఎల్పీ భేటీలో లాంఛనంగా ఆమోదం 

సీఎం ఎవరైతే బాగుంటుంది? 

  • ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలందరితో విడివిడిగా సమావేశమై.. సీఎం ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలు 
  • ఈ క్రమంలో కొందరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ పేరు చెప్పగా, మరికొందరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల పేర్లు తెరపైకి వచ్చాయి.
  • ఇంకొందరు మాత్రం ఏఐసీసీ ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. 
  • డీకే బృందం ఈ అభిప్రాయాలను వెంటనే ఢిల్లీకి చేరవేసింది. వాటిని హైకమాండ్‌ పరిశీలించి ఏం చెప్తుందోనని సాయంత్రం వరకు ఎదురుచూపులు

ఆ కథనాల్ని నమ్మొద్దు: భట్టి 

►హైదరాబాదులో   సీఎల్పీ సమావేశం జరిగింది
►ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది
►పార్టీ అధిష్టానం సిఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుంది
►ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమే.. వాటిని ఎవరు నమ్మొద్దు.

తేలేదాకా హోటల్‌లోనే.. 

►హైదరాబాద్‌ ఎల్లా హోటల్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే లు
►అదిష్టానం సీఎం అభ్యర్థి ని ప్రకటించే వరకు హోటల్ కే పరిమితం కానున్న ఎమ్మెల్యేలు
►అదిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు
►డీకే శివకుమార్‌ ద్వారా నిర్ణయం వెల్లడించనున్న కాంగ్రెస్‌ అధిష్టానం
► అధిష్టానం చెంతక చేరడంతో సీఎం అభ్యర్థి ఉత్కంఠ వీడుతుందా? అనే అనుమానంలో కాంగ్రెస్‌ శ్రేణులు

కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుంది: మాణిక్యం ఠాగూర్

►తెలంగాణ పరిణామాలపై AICC స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్‌
►తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు చేరింది
►రేపు ఖర్గే ఏఐసీసీ పరిశీలకులతో భేటీ అవుతారు
►సీఎం అభ్యర్థి ఎవరనేది ఆయనే ప్రకటిస్తారు
►కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుంది
►సరైన అభ్యర్థినే సీఎంగా హైకమాండ్‌ ప్రకటిస్తుంది 

‘తెలంగాణ సీఎం అభ్యర్థి’పై సోనియా చర్చ!

►కాంగ్రెస్‌ పార్లమెంటరీ స్ట్రాటజీ సమాశంలో తెలంగాణ సీఎం అభ్యర్థి పై నో చర్చ 
►కానీ, ఆ తర్వాత సోనియా గాంధీ మరో సమావేశం
►ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన సోనియా
►తెలంగాణ ఫలితాలు, సీఎం అభ్యర్థిపై చర్చించిన సోనియా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement