తెలంగాణ సీఎం ఎవరు?.. అప్‌డేట్స్‌ | Telangana elections Live Updates: Govt Formation Dec 04 Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎం ఎవరు?.. అప్‌డేట్స్‌

Published Mon, Dec 4 2023 5:07 PM | Last Updated on Tue, Dec 5 2023 8:02 AM

Telangana elections Live Updates: Govt Formation Dec 04 Updates - Sakshi

లైవ్‌ అప్‌డేట్స్‌.. ఎప్పటికప్పటి సమాచారం

సీఎం ఎవరు..  ఓవర్‌ టు ఢిల్లీ

►తెలంగాణలో కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం
►సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో తేలని పంచాయితీ
►ఎవరికి వారు పట్టు వీడని నేతలు
►మ్యూజికల్‌ చెయిర్‌ గేమ్‌ను తలపిస్తున్న టీ కాంగ్‌ నేతల వ్యవహారం
►ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో భట్టి, ఉత్తమ్‌,  శ్రీధర్‌ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి
► తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాలు నలుగురు పరిశీలకులు కూడా ఢిల్లీకి
 

ఆ కథనాల్ని నమ్మొద్దు: భట్టి 

►హైదరాబాదులో   సీఎల్పీ సమావేశం జరిగింది
►ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది
►పార్టీ అధిష్టానం సిఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుంది
►ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమే.. వాటిని ఎవరు నమ్మొద్దు.


తేలేదాకా హోటల్‌లోనే.. 

►హైదరాబాద్‌ ఎల్లా హోటల్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే లు
►అదిష్టానం సీఎం అభ్యర్థి ని ప్రకటించే వరకు హోటల్ కే పరిమితం కానున్న ఎమ్మెల్యేలు
►అదిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు
►రేపు డీకే శివకుమార్‌ ద్వారా నిర్ణయం వెల్లడించనున్న కాంగ్రెస్‌ అధిష్టానం
►రేపటితో సీఎం అభ్యర్థి ఉత్కంఠ వీడుతుందా? అనే అనుమానంలో కాంగ్రెస్‌ శ్రేణులు


కేసీఆర్‌ను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే

►కేసీఆర్‌ను కలిసిన తెల్లం వెంకట్రావు
►కాంగ్రెస్‌లోకి మారతారంటూ ఉదయం నుంచి ప్రచారం
►సోషల్‌ మీడియా ప్రచారాన్ని ఖండించిన తెల్లం
►సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌ వెళ్లి కేసీఆర్‌తో భేటీ

కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుంది: మాణిక్యం ఠాగూర్

►తెలంగాణ పరిణామాలపై AICC స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్‌
►తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు చేరింది
►రేపు ఖర్గే ఏఐసీసీ పరిశీలకులతో భేటీ అవుతారు
►సీఎం అభ్యర్థి ఎవరనేది ఆయనే ప్రకటిస్తారు
►కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుంది
►సరైన అభ్యర్థినే సీఎంగా హైకమాండ్‌ ప్రకటిస్తుంది 


‘తెలంగాణ సీఎం అభ్యర్థి’పై సోనియా చర్చ!

►కాంగ్రెస్‌ పార్లమెంటరీ స్ట్రాటజీ సమాశంలో తెలంగాణ సీఎం అభ్యర్థి పై నో చర్చ 
►కానీ, ఆ తర్వాత సోనియా గాంధీ మరో సమావేశం
►ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన సోనియా
►తెలంగాణ ఫలితాలు, సీఎం అభ్యర్థిపై చర్చించిన సోనియా
►రేపు డీకే శివకుమార్‌, ఇతర పరిశీలకుతో చర్చించనున్న ఖర్గే
► నిర్ణయాన్ని డీకేఎస్‌ ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పంపనున్న హైకమాండ్‌


రేపు జనగామకు మాజీ సీఎం కేసీఆర్!

►రేపు జనగామకు వెళ్లనున్న మాజీ సీఎం కేసీఆర్‌
►బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం
►సంతాప ప్రకటన వెలువరించిన కేసీఆర్‌
►తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి తన వెంట నడిచిన యువ నేత సంపత్ రెడ్డి మరణం బాధాకరమని కేసీఆర్ ఆవేదన


ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఎవరిని అడిగి చేశారు? 

►తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కాంగ్రెస్‌ సీనియర్ల గుస్సా
►సీఎం అభ్యర్థి ఎంపిక, ప్రమాణ స్వీకార ఏర్పాట్ల లీకులపైనా ఆగ్రహం
►ఎవరిని అడిగి ఏర్పాట్లు చేశారంటూ హైకమాండ్‌కు ఫిర్యాదు

ఏం జరుగుతుందో చూద్దాం: కేసీఆర్‌

►తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
►గెలిచిన ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ శుభాకాంక్షలు
►ఇంకో నెల ప్రభుత్వంలో కొనసాగే అవకాశం ఉన్నా.. ప్రజా తీర్పుతో హుందాగా తప్పుకున్నాం
►కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం
►చూద్దాం ఏం జరుగుతుందో
►త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ మీటింగ్‌ జరుపుదాం
►ఓటమిపై సమీక్ష జరుపుదాం
►శాసనసభ పక్ష నేతను ఎన్నుకుందాం



తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్‌
►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంతో ఎన్నికల కోడ్‌ ముగిసింది
►సోమవారం సాయంత్రంతో కోడ్‌ ముగిసినట్లు ఈసీ అధికారిక ప్రకటన చేసింది
►అక్టోబర్‌ 9వ తేదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
►ఆ మరుక్షణం నుంచే అమల్లోకి వచ్చిన కోడ్‌
►డిసెంబర్‌ 5 వరకు తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఈసీ నోటిఫికేషన్‌
►తాజాగా.. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కోడ్‌ ముగిసినట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం

అబ్బే.. సీఎల్పీపై చర్చించలేదు: జైరాం రమేష్‌

►సోనియా నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ స్ట్రాటజీ సమావేశంలో తెలంగాణ సీఎల్పీ అంశంపై చర్చ జరగలేదు
►డీకే శివకుమార్‌, ఇతర పరిశీలకులు ఢిల్లీ వస్తున్నారు
►పరిశీలకులతో చర్చించాల్సిన అవసరం ఉంది
►వాళ్ల అభిప్రాయం హైకమాండ్‌ తీసుకుంటుంది
►సీఎల్పీ ఖరారుపై రేపు నిర్ణయం తీసుకోవచ్చు
►మీడియాతో సీనియర్‌నేత జైరాం రమేష్‌

తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌ రాజీనామా

►తెలంగాణ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ రాజీనామా 
►అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు కూడా..
►ఫాక్స్ ద్వారా రాజీనామాను పంపిన ఏజీ, ఏడీజీ
►ప్రభుత్వం మారడంతో.. రాజీనామా బాటలో మరికొందరు అధికారులు


రాజ్‌భవన్‌ నుంచి వెళ్లిపోయిన.. 

►రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమ వాయిదా
►రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయిన జీఏడీ, పోలీస్, ప్రోటోకాల్, ఐ అండ్‌ పీఆర్‌ అధికారులు

రాజ్‌భవన్‌ వద్ద ‘సీఎం రేవంత్‌’ నినాదాలు

►సీఎల్పీ ఎవరనేది తేల్చని ఏఐసీసీ
►రేపటి వరకు కొనసాగనున్న ఉత్కంఠ
►సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా
►రాజ్‌భవన్‌ వద్ద నుంచి కాంగ్రెస్‌ శ్రేణుల్ని ఖాళీ చేయిస్తున్న పోలీసులు
►రాజ్ భవన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తల హంగామా
►సీఎం రేవంత్ అంటూ రేవంత్‌ అభిమానుల నినాదాలు
►ఢిల్లీకి పయనమైన డీకే శివకుమార్‌ 
►డీకేఎస్‌ వెంట భట్టి, దామోదర, ఉత్తమ్‌లు
►రేపు ఖర్గేతో భేటీ తర్వాతే సీఎం అభ్యర్థిపై అధికారిక ప్రకటన

 

వంద కోట్ల ఖర్చుతో నన్ను ఓడించారు: దుర్గం చిన్నయ్య 

►బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంచలన వ్యాఖ్యలు
►కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేగా నెగ్గారంటూ గడ్డం వినోద్‌పై ఆరోపణలు
►గడ్డం కుటుంబం.. వేల కోట్ల రూపాయలు ఉన్న కుటుంబం
►నన్ను ఓడగొట్టడానికి కుట్ర చేసింది
►అధర్మంగా యుద్ధం చేసి నాపై గెలిచారు 
►ఏడాది కాలంగా నాపై ఎన్నో అసత్య ప్రచారాలు తెరపైకి తెచ్చారు
►కుట్రలతో నన్ను దెబ్బ తీశారు
►డబ్బు మందు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసి గెలిచారు
►బెల్లంపల్లిలో వంద కోట్లు ఖర్చు చేసి గెలిచారు
►నైతికంగా మేము గెలిచినాం. వాళ్లు గెలిచినా ఓడిపోయినట్టే!
►బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్ వాళ్లు దాడులు చేస్తున్నారు.. ఆపకపోతే ఖబడ్దార్‌

సీఎల్పీ ఎంపిక వాయిదా?

►తెలంగాణ సీఎల్పీ నేత ఎంపిక వాయిదా
►ఢిల్లీకి పయనం అయిన కాంగ్రెస్‌ నేతలు
►రాజ్‌భవన్‌ వద్ద కాంగ్రెస్‌ శ్రేణుల్ని ఖాళీ చేయిస్తున్న పోలీసులు
►ఇవాళ రాత్రే సీఎం ప్రమాణం ఉంటుందని ఏర్పాట్లు చేసిన అధికారులు
►తాజా పరిణామాలతో కార్యక్రమం వాయిదా అయినట్లే!
►రేపు కీలక సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం
►తెలంగాణ సీఎం ఎవరనే దానిపై కొనసాగనున్న సస్పెన్స్‌


► తెలంగాణ  గ్రంధాలయ సంస్థ చైర్మన్  ఆయాచితం శ్రీధర్ రాజీనామా


ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లే!

►కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌
► ఢిల్లీకి తెలంగాణ ఎన్నికల  కాంగ్రెస్‌ పరిశీలకుడు డీకే శివకుమార్‌
►శివకుమార్‌తో పాటు మరో నలుగురు పరిశీలకులు కూడా?
►రేపు ఖర్గేతో ఏఐసీసీ పరిశీలకుల సమావేశం
►ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లే!


ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు గులాబీ నేతల క్యూ

►బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేల క్యూ
►బీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికైన వాళ్లంతా ఒక్కొక్కరుగా కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రానికి.. 
►ఎమ్మెల్యేలతో పాటు నేతలు కూడా
►హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, తులా ఉమ, మల్లారెడ్డి,కడియం శ్రీహరి, పద్మ దేవేందర్ రెడ్డి,జగదీష్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు,కేటీఆర్, సుదీర్ రెడ్డి,సత్యవతి రాధోడ్ ఎమ్మెల్సీ, మహమూద్ అలీ, రెడ్యానాయక్ తదితరులు

కాసేపట్లో వీడనున్న ‘సీఎం’ ఉత్కంఠ?

►కొద్దిసేపట్లో సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించనున్న డీకే శివకుమార్
►ఢిల్లీలో సోనియా నివాసంలో జరుగుతున్న పార్లమెంటరీ స్ట్రాటజీ మీటింగ్‌
► ఈ సమావేశంలో  తెలంగాణ సీఎం అభ్యర్థిని ఫైనల్‌ చేసే అవకాశం

వినోద్‌ కుమార్‌ రాజీనామా

►రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి బోయినపల్లి వినోద్ కుమార్ రాజీనామా
►కిందటి ఏడాది బాధ్యతలు చేపట్టిన వినోద్‌
►గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా.. స్నేహపూర్వకంగా కేబినెట్ హోదాలో వినోద్‌కు కీలక పదవి అప్పజెప్పిన కేసీఆర్‌

 
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి వినోద్‌



ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా పోషిస్తాం: కేటీఆర్‌

►గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు అభినందనలు
►పదేళ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టింది
►ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు సాధించింది
►తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం
►ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తాం

తెలంగాణ సీఎం ఎవరనేది మరికాసేపట్లో.. 

►సోనియా గాంధీ నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ మీటింగ్‌
►తెలంగాణ సీఎం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం
►ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ నివేదిక పంపిన డీకేఎస్‌
►ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత ఎంపిక కోసం టీ కాంగ్రెస్‌ శ్రేణులు వెయిటింగ్‌
►నిర్ణయం వెలువడగానే తెలంగాణ కాంగ్రెస్‌ అధికారిక ప్రకటన
►ఆ వెంటనే రాజ్‌భవన్‌లో తెలంగాణ కొత్త సీఎం ప్రమాణం
►సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా??

తెలంగాణలో కొత్త శాసనసభ

►తెలంగాణలో మూడో శాసన సభ ఏర్పాటకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
►పాత అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసిన రాజ్‌భవన్‌
►ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌ తమిళిసైకు సమర్పించిన సీఈవో వికాజ్‌రాజ్‌
►119 మంది ఎమ్మెల్యేల ఎంపికను ధృవీకరించిన గవర్నర్‌
►గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్
►గెజిట్ ను గవర్నర్ కు అందించిన సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి
►అంతకు ముందు అసెంబ్లీ రద్దు ప్రతులను అందించిన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి
► ఇక కొలువుదీరనున్న కొత్త శాసనసభ

వరుస రాజీనామాలు

►తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత వరుస రాజీనామాలు
►బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పని చేసిన పలువురు అధికారులు కూడా
►ఇప్పటికే రకరకాల కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా
► 15 మంది కార్పొరేషన్‌ చైర్మన్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది


కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

►హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
►పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం
►కౌంటింగ్‌ సందర్భంగా నిన్న పోలీసులతో వాగ్వాదం

కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్‌..

►రాజ్ భవన్ వద్ద కొత్త సీఎం కోసం న్యూ కాన్వాయ్
►రాజ్ భవన్ పక్కన దిల్కుషా వద్ద సిద్ధం చేసిన ప్రోటోకాల్ అధికారులు
►ఆరు కొత్త ఇన్నోవా వెహికిల్స్ రెఢీ చేసిన అధికారులు


తమిళసై చేతికి నెగ్గిన ఎమ్మెల్యేల జాబితా.. 

►రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయిన సీఈఓ వికాస్ రాజ్ బృందం
►గవర్నర్ తమిళ్ సై కి రిజల్ట్ ను సమర్పించిన సీఈఓ
►గెలిచిన ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను అందించిన సీఈవో


కొత్త ప్రభుత్వానికి సచివాలయం సిద్ధం

►ఛాంబర్లను సిద్ధం చేస్తున్న జీఏడీ శాఖ
►పాత బోర్డులను తొలగించిన అధికారులు
►ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలు ఖాళీ చేసిన సిబ్బంది
►కొత్త మంత్రులకు కొత్త సిబ్బంది కేటాయింపు
►గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియాకు ప్రత్యేక గది

తెలంగాణ టాస్క్ ఫోర్స్ OSD రాధా కిషన్ రావు రాజీనామా 

►మూడేళ్ల క్రితం ముగిసిన రాధాకిషన్‌ పదవీ కాలం 
►టాస్క్ ఫోర్స్ లో ఎక్స్‌ టెన్సన్‌ మీద కొనసాగుతున్న రాధా కిషన్ రావు
►ప్రస్తుత ప్రభుత్వం ఓడిపోవడంతో నిర్ణయం?
►తన రాజీనామా ను ప్రభుత్వానికి పంపిన రాధా కిషన్ రావు

కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టెక్నికల్ క్లియరెన్స్ పనిలో గవర్నర్

►గవర్నర్ తమిళిసైతో సీఈవో వికాస్ రాజ్ భేటీ
►గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ కి ఇచ్చిన వికాస్ రాజ్
►రాజ్‌భవన్‌లోనే ఉన్న అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి 
►ప్రస్తుత అసెంబ్లీ రద్దుకు టెక్నికల్ ఫార్మాలిటీస్ పూర్తి
►ఈ రాత్రికి కొత్త సీఎం ప్రమాణానికి రాజ్‌భవన్ లో ఏర్పాట్లు దాదాపు పూర్తి


పార్టీ మారను: పాడి కౌశిక్‌రెడ్డి

►హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను
►హుజూరాబాద్ ను గొప్పగా అభివృద్ధి చేసుకుందాం
►నా పాత ఫోటో పెట్టీ రేవంత్ రెడ్డి నీ కలిసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు
►నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారితో కేసీఆర్ కుటుంబం తోనే  ఉంట
►ఫేక్ ప్రచారాలను ఎవరు నమ్మొద్దు


బీఆర్‌ఎస్‌ ఓటమిపై అసదుద్దీన్‌ ఒవైసీ

►రాజకీయాల్లో గెలుపోటములు సహజం
►ఓటమికి కారణాలు గుర్తించి బీఆర్‌ఎస్‌ సరి చేసుకుంటుంది
►కేటీఆర్‌, హరీష్‌రావులకు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అవకాశం దొరికింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement