సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్‌లో పంద్రాగస్టును పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే గంటన్నరపాటు సాగిన ఈ తేనీటి విందు కార్యక్రమం రాజకీయ నేతల హడావిడి లేక వెలవెలబోయింది. షరామామూలుగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు.
వరుసగా మూడోసారి రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. బీఆర్‌ఎస్ అధినేత మాత్రమే కాదు అధికార ప్రజాప్రతినిధులు(మంత్రులు, ఎమ్మెల్యేలు) సైతం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇక.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఎట్‌హోమ్‌లో కనిపించకపోవడం గమనార్హం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. తెలంగాణ బీజేపీ తరపున కీలక నేతలు సైతం ఎట్ హోమ్‌కు దూరంగా ఉండడం. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేతో పాటు కొంత మంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇదీ చదవండి: ఆస్తులు అమ్ముకుని పోయేందుకు కేసీఆర్ ప్లాన్
Comments
Please login to add a commentAdd a comment