At Home programme at raj bhavan
-
At Home Event: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం (ఫొటోలు)
-
తెలంగాణ: నేతలు లేక ఎట్‌హోం వెలవెల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్‌లో పంద్రాగస్టును పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే గంటన్నరపాటు సాగిన ఈ తేనీటి విందు కార్యక్రమం రాజకీయ నేతల హడావిడి లేక వెలవెలబోయింది. షరామామూలుగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. వరుసగా మూడోసారి రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. బీఆర్ఎస్ అధినేత మాత్రమే కాదు అధికార ప్రజాప్రతినిధులు(మంత్రులు, ఎమ్మెల్యేలు) సైతం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇక.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఎట్‌హోమ్‌లో కనిపించకపోవడం గమనార్హం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. తెలంగాణ బీజేపీ తరపున కీలక నేతలు సైతం ఎట్ హోమ్‌కు దూరంగా ఉండడం. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేతో పాటు కొంత మంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదీ చదవండి: ఆస్తులు అమ్ముకుని పోయేందుకు కేసీఆర్ ప్లాన్ -
రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ (ఫొటోలు)
-
ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్
-
రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఏర్పాటు చేసిన తేనీటి విందు (ఎట్‌హోమ్) కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. రాజ్‌భవన్ చేరుకున్న సీఎం జగన్ దంపతులకు గవర్నర్ దంపతులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రతిపక్షనేత చంద్రబాబు, పలువురు మంత్రులు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. -
సీఎం మమతాపై గవర్నర్ అసంతృప్తి
కోల్‌కతా: స్వాతంత్ర్య వేడుకుల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ జగదీప్ ధంఖర్ నిర్వహించిన తేనీటి విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకాలేదు. కార్యక్రమానికి సంబంధించి ముందుగా సమాచారం అందిచినా సీఎం మమతా బెనర్జీ, ప్రభుత్వ అధికారులు గైర్హజరు కావటం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. శనివారం ఉదయం కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం గవర్నర్ సీఎం మమతా బెనర్జీ, ప్రభుత్వ అధికారులను రాజ్‌భవన్‌లో జరిగే ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం మమతా హాజరు కాలేదు. దీంతో సీఎం లేకుండానే గవర్నర్ దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గవర్నర్ పక్కన ఏర్పాటు చేసిన కుర్చి ఖాళీగా కనిపించింది. (ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం) ప్రస్తుతం గవర్నర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మమతా పాల్గొనకపోవటం చర్చనీయంశంగా మారింది. ‘రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకుల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ హాజరు కాకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మనకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, భద్రత కల్పించిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకోవటంలో మనం మరింత ఎదగాలి’ అని ఆయన ట్విటర్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్‌కు ఉన్న గొప్ప సంస్కృతి, నీతిని పలుచన చేస్తుందన్నారు. ఇది ఒక అనాలోచితన ధోరణి అని ట్వీట్ చేశారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమం సరికాదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. (రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమం) -
రాజ్‌భవన్‌లో ఎట్‌హోం
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, హైకోర్టు చీఫ్‌జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై అతిథులకు తేనీటి విందునిచ్చారు. సీఎం, సీజేతో కలసి ఆమె అతిథులందరి వద్దకు వెళ్లి అభివాదం తెలిపారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన హైదరాబాద్ నగరవాసి చింతల వెంకట్ రెడ్డి దంపతులతో పాటు రాష్ట్రపతి సేవా పురస్కారానికి ఎంపికైన ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ శివధర్ రెడ్డిలను గవర్నర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు సీహెచ్ విద్యాసాగర్‌రావు, కె.లక్ష్మణ్, సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడవెంకట్ రెడ్డి, ఎంపీలు సంతోష్, రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి భవన్‌లోగణతంత్ర దినోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతి భవన్లో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్‌లోని సైనిక అమర వీరుల స్థూపాన్ని సందర్శించి అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. -
సందడిగా గవర్నర్ ‘ఎట్‌హోం’
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ హరిచందన్ విశ్వ భూషణ్, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్ గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ‘ఎట్‌హోం’ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో 3.15 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఎట్‌హోం గంట సేపు సాగింది. గవర్నర్ హరిచందన్ లాన్స్‌లో కలియ దిరుగుతూ అందరినీ పరిచయం చేసుకున్నారు. ఆ తరువాత గవర్నర్ దంపతులు, సీఎం వైఎస్ జగన్, ఏసీజే జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒకే టేబుల్‌పై ఆశీనులై అల్పాహార విందును తీసుకున్నారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్, టీడీపీ నేతలు కళా వెంకటరావు, కనకమేడల రవీంద్రబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ, ఆర్పీఐ (ఎ) రాష్ట్ర అధ్యక్షుడు కె.బ్రహ్మానందరెడ్డి, పొగాకు బోర్డు చైర్మెన్ రఘునాథబాబుతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాయంత్రం సంప్రదాయకంగా జరిగే ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గవర్నర్ హరిచందన్ విశ్వభూషణ్‌తో న్యాయమూర్తులు -
ఆహ్లాదకరంగా ‘ఎట్ హోం’
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం రాజ్‌భవన్‌లో ఇచ్చిన తేనీటి విందుకు (ఎట్ హోం) సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఎట్‌హోం కార్య క్రమంలో గవర్నర్ దంపతులు నరసింహన్, విమలా నరసింహన్ అతిథుల వద్దకు వెళ్లి పేరుపేరునా స్వాగతం పలికారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభం కాగా.. సీఎం కేసీఆర్‌తోపాటు గవర్నర్ దంపతులు ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ సీఎం రోశయ్యతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నేతలను పలకరించిన సీఎం కేసీఆర్.. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ కంపెనీ అధినేత బీవీఆర్ మోహన్‌రెడ్డితో సుదీర్ఘంగా సంభాషించారు. అతిథులను పలకరించిన అనంతరం.. గవర్నర్ నరసింహన్, కేసీఆర్ 25నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఇద్దరి నడుమ ఆసక్తికర చర్చ సాగిందని చెబుతున్నా.. భేటీ వివరాలు మీడియాకు వెల్లడి కాలేదు. కేసీఆర్‌తో జానారెడ్డి కరచాలనం, పక్కన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసే సందర్భం రావట్లేదు! ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పార్టీల నేతలను గవర్నర్, సీఎం కేసీఆర్ పలకరించారు. ఆహ్లాదకరంగా సాగిన కార్యక్రమంలో గవర్నర్, సీఎం, నేతల నడుమ పలుసార్లు ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిని ఎలా ఉన్నారంటూ సీఎం కేసీఆర్ పలకరించగా.. ఇప్పుడు మనం కలిసే సందర్భం రావడం లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో అసెంబ్లీలో అప్పుడో, ఇప్పుడో కలిసే సందర్భం వచ్చేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మమ్ములను కూడా దృష్టిలో పెట్టుకోండని గవర్నర్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించగా.. అలాంటిదేమీ లేదని గవర్నర్ అన్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, గవర్నర్ మధ్య కూడా సుమారు 2 నిమిషాల పాటు ఆసక్తికర సంభాషణ కొనసాగింది. తరలివచ్చిన ప్రముఖులు కార్యక్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు నేతలతో పాటు, ప్రభుత్వాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉమ్మడి ఏపీ శాసన మండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్, సంతోష్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, క్రీడాకారులు మిథాలీరాజ్, పుల్లెల గోపీచంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పాల్గొన్నారు. -
రాజ్‌భవన్‌లో ‘ఎట్‌హోం’ కార్యక్రమం
-
తేనీటి విందులో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: రాజ్‌భవన్‌లో గురువారం జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో సందడి నెలకొంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తొలిసారి ఏపీలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, వసంతకృష్ణ ప్రసాద్, జోగి రమేష్, టీడీపీ నేతల కళా వెంకట్రావు, కనకమేడల రవీంద్ర, అశోక్ బాబు, బీజేపీ నేతల కన్నా లక్ష్మీనారాయణ, దిలీప్, అడపా నాగేంద్ర, చాగర్లమూడి గాయత్రి, సీపీఐ నేతలు రామకృష్ణ, జల్లి విల్సన్, పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. -
రాజ్‌భవన్‌లో ఎట్ హోం..హాజరైన కేసీఆర్
-
రాజ్‌భవన్‌లో ఎట్ హోం..హాజరైన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మండలి చైర్మన్ స్వామి గౌడ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ ఎస్ కే జోషి, ఎంపీ కె. కేశవరావు, కడియం శ్రీహరి, సంతోష్, బాల్క సుమన్, బండారు దత్తత్రేయ, డాక్టర్ లక్ష్మణ్, ఎల్ రమణ, ఏపీ డిప్యూటీ సీఎం కే.ఈ. కృష్ణ మూర్తి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క మల్లు, జానారెడ్డి, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానం పలికారు. గవర్నర్ నరసింహన్ ప్రతిఒక్కరిని ఆలింగనం చేసుకొని పలకరించారు. మరోవైపు పవన్ కల్యాణ్, సీఎం కేసీఆర్ పక్కపక్కనే కూర్చొని ముచ్చటించారు. కేటీఆర్ కూడా పవన్‌తో మాట్లాడారు. గవర్నర్, సీఎం కేసీఆర్ అరగంట పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. -
గవర్నర్ ఆహ్వానాన్ని తిరస్కరించిన నారాయణ
సాక్షి, హైదరాబాద్ : రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ‘ఎట్ హోం’ ఆహ్వానాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగతంగా గవర్నర్‌పై గౌరవం ఉందని, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు...వ్యవహరించిన తీరు సరిగా లేదని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. అలాగే ఇక ముందు గవర్నర్ నిర్వహించే ఏ కార్యక్రమానికి తాను హాజరు కాబోనని ఆయన స్పష్టం చేశారు. ఎట్ హోంకు ఆహ్వానించినందుకు నారాయణ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా ప్రతి ఏడాది రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ‘ఎట్ హోం’ పేరిట తెనేటి విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు, ప్రతిపక్ష నేతలతో పాటు ఇతర పార్టీ నేతలను గవర్నర్ ఆహ్వానిస్తుంటారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన సందర్భంగా గవర్నర్ ...తెలంగాణ సీఎంతో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రిని పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ తీరుపై ప్రతిపక్షాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి. -
ఎట్ హోంలో ఇద్దరు సీఎంలు
♦ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు.. ♦ ఇరు రాష్ట్రాల మండలి చైర్మన్లు.. అసెంబ్లీ స్పీకర్లు కూడా సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వేడుకల సం దర్భంగా గవర్నర్ నరసింహన్ సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఇద్దరు కేవలం పలకరింపులకే పరిమితమయ్యారు. మరోవైపు తొలిసారిగా ఈ కార్యక్రమానికి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎట్ హోమ్‌కు హాజరు కావడం సంతోషం కలిగించిందని జగన్‌తో గవర్నర్ అన్నారు. ఇరు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్‌రావు, మండలి చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, కేంద్రమంత్రులు దత్తాత్రే య, సుజనాచౌదరి, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, శ్రీహరి, పలువురు మం త్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జగన్‌తో కేసీఆర్ కరచాలనం వైఎస్ జగన్ ఎట్ హోం కార్యక్రమానికి హాజరై వెళ్తున్న సమయంలో సీఎం కేసీఆర్ ఆయనతో కరచాలనం చేశారు. తెలంగాణ మంత్రులూ వీడ్కోలు పలికేందుకు లేచి కరచాలనం చేశారు. ఇదే సమయంలో వైఎస్ జగన్, చంద్రబాబు కూడా కరచాలనం చేసుకున్నారు. ఇద్దరు సీఎంల నడుమ గవర్నర్ కాసేపు కూర్చున్నారు. ఈ సమయంలో సీఎం లు ఏమీ మాట్లాడుకోలేదు. అతిథులను కలిసేందుకు గవర్నర్ వెళ్లిపోవడంతో చంద్రబాబు.. సుజనా చౌదరితో, కేసీఆర్.. దత్తాత్రేయతో మాట్లాడుతూ కనిపించారు. గవర్నర్ సతీమణి విమలానరసింహన్ కొద్దిసేపు జగన్‌తో మాట్లాడారు. ఎట్ హోం నుంచి తొలుత జగన్ వెళ్లగా.. కాసేపటికే చంద్రబాబు వెళ్లిపోయారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో సుజనా చౌదరి మాట్లాడుతూ కూర్చున్నారు. సంతృప్తి చెందారా: మీడియాతో గవర్నర్ ఇద్దరు సీఎంలను వెంట బెట్టుకుని బయటకు వచ్చిన గవర్నర్ నరసింహన్ మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. గత ఏడాది ఎట్ హోం సమయంలో ఇద్దరి గైర్హాజరీపై వచ్చిన ప్రశ్నలను గుర్తు చేస్తూ .. ‘‘ఈసారి మీకు ఆ అవకాశం లేదు.. మీరు సంతృప్తి చెందినట్టేనా’’ అని నవ్వుతూ ప్రశ్నించారు. ‘ఫుల్ మూన్’ అంటూ మీడియా ప్రతినిధులు అనడంతో ‘మీరు ఎక్కువ ఆశిస్తున్నట్టుంది..’ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ ‘ఇది ఎట్ హోం’ అంటూ ముందుకు కదిలారు. ఎట్ హోం ముగిశాక కేసీఆర్, గవర్నర్ రాజ్‌భవన్‌లోకి వెళ్తూ కొద్దిసేపు మీడియా ప్రతి నిధుల వద్ద ఆగారు. ఈ సందర్భంగా ‘‘సీఎం కేసీఆర్‌ను మీకు అప్పగిస్తున్నాను..’’ అంటూ గవర్నర్ సరదాగా అన్నారు. అనంతరం సీఎం మీడియా ప్రతినిధులతో ఫొటోలు దిగారు. ఇదే సమయంలో జర్నలిస్టుల ఇళ్ల సమస్యను ఆయనే ప్రస్తావిస్తూ.. ‘త్వరలోనే చేసేద్దాం..’ అంటూ ముందుకు కదిలారు. ఎట్ హోంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ పాల్గొన్నారు. టీకాంగ్రెస్, టీడీపీ నేతలు హాజరు కాలేదు. -
'ఎట్ హోం'లో అరుదైన కలయికలు
సాక్షి, హైదరాబాద్ : స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఇచ్చిన ఎట్ హోం ఆహ్లాదకరంగా జరిగింది. తెలంగాణ, ఏపీల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, ఎన్.చంద్ర బాబు నాయుడు హాజరయ్యారు. కాగా, ఇద్దరు సీఎంలు కేవలం పలకరింపులకు మాత్రమే పరిమితం అయ్యారు. ఏ ఇతర అంశాలపై వారు మాట్లాడుకోలేదు. మరో వైపు తొలిసారిగా ఎట్‌హోమ్ కు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎట్ హోమ్‌కు హాజరు కావడం సంతోషం కలిగించిందని గవర్నర్ ఈ సందర్భంగా వైఎస్.జగన్‌తో పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల శాసన సభా స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్‌రావు, మండలి చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైఎస్ జగన్‌తో సీఎం కేసీఆర్ ఆత్మీయ కరచాలనం ఎట్ హోమ్‌కు హాజరైన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ వెళుతూ ..తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గరకు రావడంతో ఆయన లేచి కరచాలనం చేశారు. తెలంగాణ మంత్రులూ ఆయనకు వీడ్కోలు పలికేందుకు లేచి కరచాలనం చేశారు. ఇదే సమయంలో ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి వైఎస్. జగన్ చేయి పట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు తీసుకు వెళ్లి కరచాలనం ఇప్పించారు. కాగా, అంతకు ముందు ఆరంభంలోనే ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా, అది గమనించని ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి మరో సారి చేతులు కలిపించారు. కాగా, ఇద్దరు సీఎంల నడుమ గవర్నర్ నర్సింహన్ కూర్చున్నారు. ఈ సమయంలో ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. అతిథులను కలిసేందుకు గవర్నర్ వెళ్లిపోవడంతో చంద్రబాబు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి దత్తాత్రేయ వేర్వేరుగా మాట్లాడుతూ కూర్చున్నారు. కార్యక్రమం నుంచి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ తొలుత వెళ్లిపోయారు. ఆయనతో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కొద్దిసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. వైఎస్ జగన్ వెళ్లిపోయిన కొద్ది సేపటికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా వెళ్లి పోయారు. అనంతరం కేంద్ర మంత్రి సుజనా చౌదరి సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతూ కూర్చున్నారు. మీరు సంతృప్తి చెందారా : మీడియాతో గవర్నర్ ఇద్దరు సీఎంలను వెంట బెట్టుకుని బటయకు వచ్చిన గవర్నర్ నరసింహన్ మొదట్లోనే ఉన్న మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడారు. గత స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఇచ్చిన ఎట్‌హోంకు ఇద్దరు సీఎంలు హాజరు కాలేదు. ఆ సమయంలో ఇద్దరి గైర్హాజరీపై వచ్చిన ప్రశ్నలను గుర్తు చేస్తూ ..‘ ఈ సారి మీకు ఆ అవకాశం లేదు.. మీరు సంతప్తి చెందినట్టేనా..’ అని వ్యాఖ్యానించారు. ‘ ఫుల్ మూన్ ’ అంటూ మీడియా ప్రతినిధులు అనడంతో.. ‘ మీరు ఎక్కువ ఆశిస్తున్నట్టుంది..’ అని గవర్నర్ ప్రశ్నించారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ ‘ఇది ఎట్ హోం ’ అంటూ ముందుకు కదలడంతో గవర్నర్, ఏపీ సీఎంలు ఇద్దరూ ఏమీ మాట్లాడకుండానే ముందుకు కదిలారు. ఎట్ హోంకు ఒకింత ఆలస్యంగానే వచ్చిన చంద్రబాబు కార్యక్రమం ఆరంభమైన కొద్దిసేపటికే వెళ్లిపోయారు. ఎట్ హోం ముగిశాక సీఎం కేసీఆర్, గవర్నర్లు రాజ్భన్లోకి వెళుతూ మరికొద్ది సేపు మీడియా ప్రతినిధుల వద్ద ఆగారు.‘ సీఎంను మీకు అప్పగిస్తున్నాను..’ అని గవర్నర్ అనడంతో సీఎం మీడియా ప్రతినిధులతో ఫోటోలు దిగారు. అదే సమయంలో జర్నలిస్టుల ఇళ్ల సమస్యను ఆయనే ప్రస్తావిస్తూ త్వరలోనే చేసేద్దాం అంటూ ముందుకు కదిలి వెళ్లారు. ఈ కార్యకర్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ హాజరయ్యారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ నుంచి ఎవరూ ఎట్ హోమ్‌కు హాజరు కాలేదు.