సాక్షి, హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మండలి చైర్మన్ స్వామి గౌడ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ ఎస్ కే జోషి, ఎంపీ కె. కేశవరావు, కడియం శ్రీహరి, సంతోష్, బాల్క సుమన్, బండారు దత్తత్రేయ, డాక్టర్ లక్ష్మణ్, ఎల్ రమణ, ఏపీ డిప్యూటీ సీఎం కే.ఈ. కృష్ణ మూర్తి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క మల్లు, జానారెడ్డి, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి వచ్చిన వారందరికీ గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానం పలికారు. గవర్నర్ నరసింహన్ ప్రతిఒక్కరిని ఆలింగనం చేసుకొని పలకరించారు. మరోవైపు పవన్ కల్యాణ్, సీఎం కేసీఆర్ పక్కపక్కనే కూర్చొని ముచ్చటించారు. కేటీఆర్ కూడా పవన్‌తో మాట్లాడారు. గవర్నర్, సీఎం కేసీఆర్ అరగంట పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment