సనా: యెమెన్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. 36 మంది మంత్రులతో కొత్త కేబినెట్ను ఏర్పాటు చేశారు. యెమెన్లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కొత్త ప్రభుత్వం కృషి చేయనుంది.
కేబినెట్లో నలుగురు మంత్రులకు చోటు కల్పించారు. గత సెప్టెంబర్ 21న తిరుగుబాటుదారులు రాజధానిని నిర్బందించారు. అనంతరం నవంబర్ 1న ఐక్యరాజ్య సమితి దూత సమక్షంలో ప్రధాన రాజకీయ పార్టీలు శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి. అధ్యక్షుడు అబ్ద్రబు మన్సూర్ హడీ ప్రభుత్వం ఏర్పాటు చేసుందుకు అంగీకరించారు. రాజకీయ పార్టీలకు, తిరుగుబాటు దారులకు మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యమైంది.
యెమెన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
Published Sat, Nov 8 2014 7:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement
Advertisement