ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ నిధులను విచక్షణారహితంగా వాడటంపై నిషేధం విధించింది. దేశాధ్యక్షుడు, ప్రధాని సహా ప్రభుత్వాధికారులు, నేతలు ఎవరైనా సరే విమానాల్లో ఫస్ట్‌క్లాస్ ప్రయాణాలు చేయకూడదని ఆదేశించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌధురి తెలిపారు. అధికారిక బంగ్లాను కాదని, మిలిటరీ సెక్రెటరీ నివాసంలోని ఓ చిన్న పోర్షన్‌లోనే ఇమ్రాన్ నివాసముంటున్నారు.
2 వాహనాలు, ఇద్దరు సిబ్బందిని మాత్రమే నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు, ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, సెనేట్ చైర్మన్, జాతీయ అసెంబ్లీ స్పీకర్, రాష్ట్రాల సీఎంలు ఇకపై క్లబ్/బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చౌధురి వెల్లడించారు. విదేశీ పర్యటనలకు, దేశంలో పర్యటించేందుకు ప్రత్యేక విమానాన్ని వినియోగించడాన్ని ఇకపై నిలిపివేయాలని ప్రధాని నిర్ణయించారు. ఆర్మీ చీఫ్ మొదటి తరగతికి బదులు బిజినెస్ క్లాస్‌లోనే వెళ్లాలి. ప్రభుత్వ నిధులను యధేచ్ఛగా కేటాయించే అధికారం అధ్యక్షుడు, ప్రధాని, ఇతర అధికారులకు ఇకపై ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment